720.ప్రశ్న (KSM 241): 👿 “సాతానుకి అన్నీ తెలుసు కదా.. మరి భవిష్యత్తులో తాను అంతమైపోతాడు (నరకానికి వెళ్తాడు) అని కూడా తెలుసు కదా? అయినా ఎందుకు మొండిగా పోరాడుతున్నాడు?” (01m 42s)

Link: https://www.youtube.com/live/dorsIQG8SOs?t=3887

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • 🚬 మూర్ఖత్వం అంటే ఇదే: దాని పేరే మూర్ఖత్వం అంటారు. ఇప్పుడు సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరము అని రాసి, ఆ తయారు చేసినోడే ప్యాకెట్ మీద రాసి అమ్ముతుంటే ప్రజలు కొనుక్కోవట్లేదా?
  • ☠️ తెలిసి చేసే తప్పు: సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది, భయంకరంగా నోట్లో పుండ్లు ఏర్పడతాయి, ఈ దవడ ఎముకలు తీసేస్తారు, వాడు క్యాన్సర్ తో చచ్చిపోతాడు అని చెప్తుంటే కూడా కొనుక్కొని తీసుకోవట్లేదా? దాన్ని ఏమంటారు? ఇప్పుడు మధ్యపానం ఆరోగ్యానికి హానికరం, సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నా సరే, ప్రభుత్వాలే ఆ ఆదాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి.
  • 👿 మూర్ఖత్వానికి మూల పురుషుడు: కాబట్టి ఇది నాకు హానికరము అని తెలిసినా కూడా దాన్ని చేయడమే మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వానికి మూల పురుషుడే సైతాను.
  • ⚔️ భ్రమలో సాతాను: వాడు లాస్ట్ ఛాన్స్ తీసుకుందాం.. “ఏమో నేను గెలుస్తానేమో పోరాటంలో” అని ఒక భ్రమలో ఉన్నాడు వాడు.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram