721.ప్రశ్న (KSM 241): 🌌 “దేవదూతలకు విమోచన ఎందుకు లేదు? అంతరిక్షంలో ఉన్న కోట్లాది గ్రహాలలోని జీవులందరికీ భూమిపై ఉన్నట్లే కుటుంబ వ్యవస్థ ఉంటుందా? దేవదూతలు నిబంధన మీరడం అంటే ఏమిటి?” (02m 53s)

Link: https://www.youtube.com/live/dorsIQG8SOs?t=3989

దైవజనులు రంజిత్ ఓఫీర్ గారి సమాధానం:

  • 🌌 భిన్న ప్రపంచాలు: ఇప్పుడు మళ్ళీ మీరు స్పష్టంగా విని గ్రహించండి. అంతరిక్షంలో ఉన్న కోటాను కోట్ల గ్రహాలలో ఉన్నటువంటి జ్ఞానవంతులైన జీవజాతులు, జనాంగాలు అన్నీ ఒక రకమైనవి కాదు. ఎన్ని కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయో ప్రతి ప్రపంచము మీద ఉన్నటువంటి బుద్ధిజీవులు, జ్ఞానవంతులైన జీవులు సపరేట్ కేటగిరి.
  • 👽 వేరు వేరు లక్షణాలు: మనుషులు ఒక రకము, దేవదూతలంతా ఒక రకం అని అట్లా అనుకోకూడదు మనం. ప్రతి ప్రపంచం మీద ఉన్న జాతి సపరేట్. వాళ్ళ లక్షణాలు వేరు, గుణగణాలు వేరు, వాళ్ళ నాగరికత, వాళ్ళ ఆహారపు అలవాట్లు అంతా వేరు. దేనికి అదే సపరేట్ అన్నమాట.
  • 👨‍👩‍👧‍👦 కుటుంబ వ్యవస్థలు: అందులో మైధున సృష్టి (సంతానోత్పత్తి) జరిగే ప్రపంచాలు కూడా కొన్ని వందల కోట్లు ఉంటాయి. ఇప్పుడు ఆదాము పాపము చేయలేదు అనుకోండి.. చేయకపోతే గనుక ఆయనకు పిల్లలు పుడతారు, పరిశుద్ధులే పుడతారు. భూగ్రహమంతా ఒక కుటుంబము, ఒక రాజ్యము, దానికి ఆదాము ఏమో తండ్రి, ఆదాము రాజు, కూడా ప్రజాపిత అవుతాడు. ఈ వ్యవస్థ కలిగినటువంటి కూడా కోట్ల కుటుంబాలు (ప్రపంచాలు) ఉన్నాయి. అంతా ఒకటే కేటగిరి అని మనం అనుకుంటే కన్ఫ్యూషన్ అవుతుంది. ఏ లోకం లెక్క దానిదే వేరు వేరు.
  • 🚫 నిబంధన మీరిన దేవదూతలు: ఆ దేవదూతలు మానవ కన్యకలను చూసి వాళ్ళ అందానికి వాళ్ళు ఆకర్షితులై వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు, తమ నివాసస్థలమును విడిచి సుదొమ గొమొఱ్ఱా వాళ్ళలాగా శరీర సంబంధమైన పాపము చేసినటువంటి దేవదూతలు నిబంధనను మీరారు వాళ్ళు. ఆ పెళ్లి చేసుకోకూడదు అని నిబంధన ఉన్నటువంటి దూతలు వేరే.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram