73. ప్రశ్న: దేవుడు ఎలా మాట్లాడతాడు? మీతో దేవుడు ఎన్ని విధాలుగా మాట్లాడారు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: “దేవుడు మాట్లాడే విధానం” అనే నా ప్రసంగం మా పబ్లికేషన్స్లో ఉంది. యూట్యూబ్లో కూడా ఉంది. అది వినవోచ్చు. The most common way God speaks is ప్రేరేపణ, అంతరంగ స్వరము, Inner still small voice దీనికి లేఖనాధారం ఏమిటంటే ఎజ్రా గ్రంథము ప్రారంభవచనాలు. “పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నేరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా, అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను.

  1. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదా దేశమందున్న యోరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండును గాక!” ఇది కోరేషు రాజు యొక్క ప్రకటన. అక్కడ ముందు జరిగింది ఏంటి? ప్రేరేపించగా మనకు ఎన్నో తలంపులు పుడతాయి. అవన్నీ దైవాజ్ఞ? కాదు. ఉదా: ఒక గదిలో నలుగురు మనుషులు ఉన్నారు అనుకోండి. ఈ నలుగురు కాక, ఐదవ మనషి గదిలో క్రొత్తగా వచ్చాడు అనుకోండి. కొత్త మనిషి వచ్చాడు అనేది వెంటనే ఆ నలుగురికి తెలుస్తుంది కదా! అలాగే మన మనస్సు అనేది ఒక గది. అందులో ఉన్న తలంపులు, ఒక్కొక్క తలంపు, ఒక్కో మనిషి అనుకుంటే నాకున్న కోరికలు, అభిప్రాయాలు, పరిశోధన అవన్నీ ఉన్నాయి. ఆ ఉన్న ముఖాలు (మనుషులు) కాక వేరే కొత్త మొఖం ప్రవేశిస్తే ఎలా తెలిసిపోతుందో, అలా ఒక కొత్త బలమైన తలంపు లోపలికి వచ్చినప్పుడు మిగతా తలంపులన్నీ నిశ్శబ్దం అయిపోతాయి. ఆ వచ్చిన తలంపు ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, మిగతా వాటన్నిటినీ నోరు మూయించేస్తుంది. మన మనస్సులో ఉన్న తలంపులకు తెలుసు ఏదో కొత్త తలంపు వచ్చింది అని. అది డిఫరెంట్ గా ఉంటుంది. అలాగు వచ్చిన తలంపు ఇప్పుడు మనం అడుగుతున్న ప్రశ్నకు జవాబై ఉంటుంది. మనం దాన్ని గురించి ప్రార్ధిస్తూ ఉన్న సందర్భంలో మన మనస్సులో ఉన్న ప్రశ్నకే ఇది జవాబు అనుకొని కరెక్ట్ గా మ్యాచ్ కావాలి. ఆ విధంగా మన అక్కర, అన్వేషణ వచ్చిన తలంపు రెండూ మ్యాచ్ అయినప్పుడు; ఇది దేవుడు తప్ప ఇంకెవరూ ఈ తలంపు నాలోకి ఇంత బలంగా పంపించడానికి అవకాశం లేదు అని వివేచన కలిగినప్పుడు దాన్ని దైవ ప్రేరేపణ అంటాము. ఇది Most common method of God speaking to his saints ఇంకా ప్రవచనం ద్వారా మాట్లాడాడు. బైబిల్ చదువుతుంటే మాట్లాడాడు, స్వప్నాలు దర్శనాలుకూడా వస్తాయి. ఇలా అన్ని రకాలుగా ప్రభువు నాతో మాట్లాడారు. దేవుడు మాట్లాడడం అనేది ఎన్ని విధాలుగానైనా మాట్లాడుతాడు. గాని ముందు వినే చెవులు మనకు ఉండాలి.