776.Q: Why Did Prophet Hosea Marry a Harlot? The Depth of Divine Love (KSM 237)

776.ప్రశ్న: హోషేయ ప్రవక్త వ్యభిచారిణిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? (KSM 237)

🏥 ప్రశ్న: హోషేయ ప్రవక్త వ్యభిచారిణిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? దేవుడు తన ప్రవక్తకు ఇంత కఠినమైన ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు? (01:17:46)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (09m15s)

  • 🤝 అసలైన సంసారం: అసలు అనుకూలము 100% అయితే ఆమె భార్యే కాదు, వాడు భర్తే కాడు. నచ్చని వాటిని సహిస్తూ సహజీవనం చేయడమే అసలైన సంసారం. దీనికి బైబిల్లో అత్యంత నికృష్టమైన, భయంకరమైన ఉదాహరణ హోషేయ భార్య గోమేరు. ఊహించలేనంత భయంకరమైన పరిస్థితి అది.
  • 📖 దేవుని కఠినమైన ఆజ్ఞ: హోషేయ 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, దేవుడు హోషేయకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు: “నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము.” ఆమె తల్లి దిబ్లయిము కూడా ఒక వేశ్యే, ఆమె కుమార్తె గోమేరు కూడా ఒక వేశ్యే. అంతకుముందే ఆమెకు వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు ఉన్నారు, వారిని కూడా తెచ్చుకోమన్నాడు దేవుడు. పోనీ పెళ్లి చేసుకున్నాకైనా మారిందా అంటే లేదు, ఆమె తిరగడానికి అలవాటు పడి ఎవరితోనో వెళ్ళిపోతుండేది.
  • 💔 దౌర్భాగ్యపు పరిస్థితి: ఆమె వెళ్ళిపోయినప్పుడల్లా హోషేయ మళ్ళీ వెళ్లి తెచ్చుకోవాలి. ఒకానొక దశలో ఆమె ఒక ప్రియుని వద్ద ఉంటే, వాడు “నేను ఇంతకాలం సాకాను కదా, నాకు పైసలు ఇవ్వు” అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే – “15 తులాల వెండి, ఒకటిన్నర తూముల యవలు ఇచ్చి ఆమెను కొనుక్కో” అన్నాడు (హోషేయ 3:1-3). అంటే తన భార్యను వేరే వాడి దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యం. ఏ పురుషుడైనా ఈ రోజుల్లో ఇలా చేయగలడా? తప్పు చేస్తే చంపేస్తారు లేదా బావిలో దూకుతారు. కానీ హోషేయ భరించాడు. ‘భర్త’ అనగా అర్థమే ‘భరించువాడు’.
  • 🛡️ దేవుని గాయం వెనుక మర్మం: దేవుడు ఇంత గాయం హోషేయకు ఎందుకు పెట్టాడంటే, ఇశ్రాయేలీయులు దేవుని విసర్జించి అన్య దేవతల వెనుక వెళ్తున్నా, దేవుడు వారిని ఎలా ప్రేమిస్తున్నాడో అర్థం కావడానికి. “యెహోవా ఇశ్రాయేలీయులను ప్రేమించినట్లు, నీవు పోయి ఆ వ్యభిచారిణిని ప్రేమించు” అన్నాడు దేవుడు. ఈ రోజుల్లో ఎవరైనా నా భార్య అనుకూలం కాదు అంటే, హోషేయ భార్య ముందు ఆమె ఏపాటిది?
  • నిజ జీవిత సాక్ష్యాలు & ముగింపు: నేను నల్గొండలో, సిద్దిపేటలో ఇలాంటి హోషేయ లాంటి భక్తులను ఇద్దరిని చూశాను. భార్య తప్పు చేసినా, “హోషేయ గురించి మీరేమంటారు? నేను క్షమించాలని డిసైడ్ అయ్యాను” అని నిలబడిన మహానుభావులు వారు. కాబట్టి, మన భార్య లేదా భర్త మనల్ని చెక్కడానికి దేవుడు వాడుతున్న ఉలి అని గ్రహించాలి. దేవుని వంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడమే ఈ పరీక్ష వెనుక ఉన్న మర్మం.

Detailed English Translation:

  • The Essence of Marriage: If there were 100% compatibility, she wouldn’t truly be a wife, and he wouldn’t truly be a husband. Coexisting while enduring what one dislikes is the true essence of marriage. The most wretched and terrifying example of this in the Bible is Hosea’s wife, Gomer. It was an unimaginably horrific situation.
  • God’s Stern Command: According to Hosea 1:2, God gave Hosea a command: “Go, take to yourself a wife of harlotry and children of harlotry.” Her mother, Diblaim, was a harlot, and her daughter Gomer was a harlot as well. She already had children born of adultery, and God told him to take them in too. Even after marriage, she didn’t change; she was so accustomed to her wandering ways that she would repeatedly run away with others.
  • A Miserable Situation: Every time she left, Hosea had to go and bring her back. At one point, when she was with a lover, the man demanded money for having maintained her. God then said, “Buy her for fifteen shekels of silver and a homer and a half of barley” (Hosea 3:1-3). Imagine the misery of having to pay money to another man to buy back one’s own wife. Could any man today do this? Usually, people would resort to violence or despair. But Hosea endured. The very meaning of ‘Husband’ (Bhartu) is ‘One who endures’.
  • The Mystery Behind the Pain: Why did God inflict such a wound upon Hosea? It was to demonstrate how God continues to love the Israelites even though they abandoned Him to follow foreign gods. God said, “Go, love that adulterous woman, just as the Lord loves the Israelites.” Today, if anyone complains that their spouse is incompatible, how does that compare to Hosea’s wife?
  • Real-life Testimonies & Conclusion: I have seen two such believers in Nalgonda and Siddipet who were like Hosea. Even when their wives sinned, they stood firm, saying, “What do you say about Hosea? I have decided to forgive.” They were great souls. Therefore, realize that our spouse is the chisel God uses to shape us. The mystery behind this test is to acquire a character like God’s.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram