❓ ప్రశ్న: “ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను” అనే మాట ఉంది కదా! అసలు ఆ కట్టువారు ఎవరు? దీక్షిత్ గారు ఈ ప్రశ్నను అడుగుతున్నారు. (1:08:31)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (1m 33s)
- 🧱 కట్టువారు ఎవరు?: ఇశ్రాయేలీయులు. ఓకే.. కట్టువారు ఇశ్రాయేలీయులు అనే సంగతి స్పష్టంగా మొదటి పేతురు పత్రికలో రెండవ అధ్యాయంలో ఆ పేతురు భక్తుడు రాస్తాడు అన్నమాట.
- 📖 లేఖన సాక్ష్యం: మొదటి పేతురు 2:8 లో – “కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి” అని ఉంటుంది. ఈ కట్టువారు అంటే దేవుని కొరకు ఇల్లు కట్టువారు. వీళ్ళకి ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే – యెషయా 66 లో దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడాడు. “ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము.. నా నిమిత్తము మీరు కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది?” అని దేవుడు అన్నాడు.
- 🏛️ నియమింపబడిన జనాంగం: మరి వాళ్ళు ఎందుకు ఇల్లు కట్టాలి అనుకున్నారు అంటే – నిర్గమకాండము 25:8 లో దేవుడు చెప్పాడు.. “నేను వారి మధ్యలో నివసించునట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించాలి” అని ఇశ్రాయేలీయులకు చెప్పు అని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక దేవుని ఆజ్ఞానుసారం వాళ్ళు ప్రత్యక్ష గుడారం కట్టారు, తర్వాత సొలొమోను కాలంలో వాళ్ళు మందిరం కట్టుకున్నారు, తర్వాత మళ్ళీ సెకండ్ టెంపుల్ (Second Temple), థర్డ్ టెంపుల్ (Third Temple).. ఇవన్నీ కూడా మన చరిత్రలో ఇలా నడుస్తూ వచ్చింది.
- ✨ మూలపు తలరాయి: అందుచేత దేవుని కొరకు ఇల్లు కట్టడానికి నియమింపబడిన వారు ఇశ్రాయేలు జనాంగం. అయితే మొదటి మూలరాయిగా, ముఖ్యమైన మూలరాయిగా నజరేయుడగు యేసును దేవుడు ప్రతిష్టించి పంపించాడు. అయితే ఆ మూలరాయిని వీళ్ళు తృణీకరించారు. ఇల్లు కట్టే ఇశ్రాయేలు జనాంగం తృణీకరించినటువంటి ఆ ‘యేసు’ అనే రాయి మూలపు తలరాయి ఆయెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యం అని 118వ కీర్తనలో చెప్తారు. అది విషయం. ఓకే.
Detailed English Translation:
❓ Question: Psalm 118:22 mentions “The stone which the builders rejected has become the chief cornerstone.” Who are these ‘builders’ referred to in the scripture?
- The Identity of the Builders: The builders are the Israelites. Apostle Peter confirms this in 1 Peter 2:8, explaining that those who were appointed to build stumbled by being disobedient to the Word.
- The Mandate to Build: God commanded the Israelites in Exodus 25:8 to build a sanctuary so that He could dwell among them. Throughout history, they built the Tabernacle, Solomon’s Temple, and subsequent temples. They were the people designated by God to build His earthly dwelling place.
- Rejecting the Cornerstone: When God sent Jesus of Nazareth as the ultimate and most important ‘Cornerstone’ for His spiritual house, the Jewish establishment (the builders) rejected Him.
- Conclusion: The very stone (Jesus) that the builders (Israel) deemed unfit and cast aside has been made the most vital part of God’s eternal structure—the chief cornerstone. This irony was prophesied in Psalm 118 and fulfilled in Christ.
