-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: మనిషి చనిపోయిన తర్వాత అతడు తన వ్యక్తిత్వంలో జ్ఞాపకాలలో అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలిగిన తన ఉనికి ఇంకా as a spirit కొనసాగుతుంటుంది. గనుక మనిషి శరీరంలో నుండి ఆయుష్షు అయిపోయి ఆ ఆత్మ వెళ్లిపోయాక ఉండడానికి రెండే రెండు స్థలాలు ఉన్నాయి. మహిమలోకం లేదా అగ్ని గంధకముల గుండం. గనుక దేవుడు ఎందుకు అవసరం అంటే ఇక్కడి నుండి వెళ్లిపోయినా ఆత్మకు నిత్యము శాంతి, సమాధానము దొరకడానికి మనకు దేవుడు అవసరం అందుకే నాస్తికులు మనిషికి ఆత్మలేదంటారు. నాస్తికత్వంలో నరకం,స్వర్గం, దేవుడు, దయ్యం, ఆత్మ లేదంటారు. ఆత్మ ఉన్నది అనుకుంటే మతం వస్తుంది. ఆత్మ లేదనుకుంటే మతం అవసరం లేదు. దేవుడు ఎవరు? ఆయన దగ్గరకు దారేది? అన్న ప్రశ్నలు పుట్టవు. దేవుడు మనకు అవసరమా? ఇంత science develop అయింది కదా అంటారు. science ఏం develop అయింది అంటే rocket technology, atomic science, gravitation, quantum mechanics మొదలైనవి. ఇప్పుడు ఇన్ని శాస్త్రీయ సూత్రాలు కనుక్కున్న శాస్త్రవేత్తల అందరి పేర్లు రాస్తే వీళ్లందరూ దేవుని నమ్మినవారే. దేవుడిని నమ్మిన వారు చేసిన ప్రయోగాలు అని బుక్ లో రాసుకొని ఇంత science వచ్చింది. గనుక ఇప్పుడు దేవుడు వద్దు అంటున్నారు. ఏ science ని బట్టి నీవు దేవుడు వద్దని విర్రవీగుతున్నావో దాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తే దేవుడు కావాలని ఇవన్నీ కనిపెట్టాడు. ఈ జ్ఞానం నాకు దేవుడు ఇచ్చాడు అనేది Galileo, Copernicus, Newton సాక్షం. అది దొరికింది గనుక నాకు దేవుడు వద్దని వీడి సాక్షం. గనుక నాస్థికత్వం గురించి బైబిల్ “బుద్ధిహీనుడు దేవుడు లేడని తన మనస్సులో అనుకుంటాడు” అని చెప్పింది. ఎన్ని ఆధారాలు చూపించినా నాస్తికుడు నాకు దేవున్ని చూపించు అంటాడు. వానికి జవాబు సూర్యుడు ఒక నక్షత్రం అంతకంటే పెద్ద నక్షత్రాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ సూర్యున్నే కన్నార్పకుండా రెండు నిమిషాలు చూడలేని వాడు, దాని చేసిన దేవున్ని చూసి ఎలా తట్టుకుంటాడు? గనుక అది మూర్ఖత్వం ఆయనను చూడాలి అనుకుంటే మనోనేత్రాలతో చూడాలి తప్ప మాంస నేత్రాలతో కాదు. అదే విశ్వాసం, నమ్మకం, భక్తి.