(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: తండ్రి మాట్లాడుతున్నాడా? కుమారుడు మాట్లాడుతున్నాడా? పరిశుద్దాత్ముడు మాట్లాడుతున్నాడా? అనే ఈ మీమాంస అనవసరమైన కుతూహలమే తప్ప practical purposes లో దీనివల్ల ఏ లాభం నష్టం లేదు. దేవుడు మాట్లాడాడు అనే అనుభవం ఉంటే కుమారుడా మాట్లాడినా, పరిశుద్దాత్మడు మాట్లాడినా, తండ్రియైన దేవుడు మాట్లాడినా, అదే మాట్లాడుతాడు. తండ్రి ఒకటి మాట్లాడిన తర్వాత కుమారుడి నుండి second opinion ఏమీ రాదు. కుమారుడు మాట్లాడినాక తండ్రిని గానీ పరిశుద్దాత్ముడిని గాని నీ opinion ఏంటయ్యా అని అడగడానికి వారు separated వ్యక్తులు కారు. వాళ్లు inseparable unified one person. అందుచేత ఇది దేవుడే మాట్లాడాడని గ్రహిస్తే చాలు. ఈ తరంలో మనతో దేవుడు మాట్లాడడం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జరుగతుంది ఎందుకంటే,నేను తండ్రి దగ్గరికి వెళ్లిపోతున్నాను, మిమ్మును అనాధలుగా విడువను, మీ దగ్గరికి తిరిగి వస్తాను, ఒక ఆదరణ కర్తను మీ కొరకు పంపిస్తాను. ఆయన మీతో, మీలో ఉండును. మీకు అన్నిటిని భోదించును, నడిపించును. అని యేసు ప్రభు చెప్పారు. ఇమ్మానుయేలు అంటే మనకు తోడైయున్న దేవుడు. ఈ యుగంలో పరిశుద్దాత్మ దేవుడే మన ఇమ్మానుయేల్. గనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే తండ్రియైనా, కుమారుడైనా మాట్లాడుతాడు. ఎవరు మాట్లాడినా అది ఏక దేవుని ఏక స్వరమే తప్ప separated గా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండవు.
అందుచేత ఇది అవసరం లేని ఒక మీమాంస. దీనివల్ల ప్రయోజనం లేదు. ముగ్గురు కలిసి ఏకాభిప్రాయం కలిగి ఎప్పుడూ ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మధ్యలో యుద్ధాలు ఉండవు. Essentially one person. అందుచేత ఇందులో ఆ స్వరమా, ఈ స్వరమా అనేది అవసరం లేని ప్రశ్న. దాని మీద దృష్టి పెట్టకండి. దేవుడే మాట్లాడుతున్నాడు అని తెలిసినప్పుడల్లా ఆయనకు లోబడండి. ఆయన మిమల్ని ఆశీర్వదిస్తాడు.