🇮🇱 ప్రశ్న: అయ్యగారు, ఇజ్రాయేల్ దేశం మీద ఇరాన్ దాడులు చేసినప్పుడు నష్టం జరిగింది. దేవుడు కాపాడుతున్న దేశంలో ఈ విధమైన దాడి జరగడం ఏంటి? అసలు దేవుని ప్రణాళిక ఏమై ఉండొచ్చు? (00:03:08)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 12s)
- ⚔️ యుద్ధంలో నష్టం సహజం: యుద్ధం అనేది జరిగినప్పుడు ఎంత దేవుడు కాపాడినా ఒక పక్షానికి రవ్వంత నష్టం జరగకుండా, ఒక్క ప్రాణం కూడా పోకుండా నష్టమంతా అవతల పక్షానికే జరగడం అనేది ఎన్నడూ జరగలేదు. ఇది గతంలో జరగలేదు, ఇప్పుడు జరగదు, భవిష్యత్తులో కూడా జరగబోదు. యుద్ధం జరిగిన తర్వాత ఇరు పక్షాలకు కాస్తో కూస్తో నష్టం ఉంటుంది.
- 🛡️ అంతిమ విజయం ఇశ్రాయేలుదే: పాత నిబంధనలో కూడా అన్య జనాంగాలను హతము చేసి వారి ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నప్పుడు, వీళ్ళు (ఇశ్రాయేలీయులు) కూడా కొంతమందిని కోల్పోవాల్సి వచ్చింది. కానీ అల్టిమేట్ గా ఫైనల్ విక్టరీ దేవుడు ఇశ్రాయేలుకే ఇచ్చాడు. దేవుని చిత్తంలో ఎవరిని తీసుకోవాలనుకుంటే వాళ్ళని తీసుకుంటాడు.
- 📉 తక్కువ నష్టం – ఎక్కువ రక్షణ: ఇశ్రాయేల్ వాళ్ళకు జరిగిన నష్టం చాలా తక్కువ. వాళ్ళ శత్రువులకు జరిగేది వీళ్ళకంటే చాలా ఎక్కువ ఉంటుంది. శత్రువులకు 90% నష్టం జరిగితే వీళ్ళకి 10% మాత్రమే నష్టం ఉంటుంది. అందులో నుంచి కూడా వాళ్ళు తొందరగా కోలుకొని శత్రువును మళ్ళీ దెబ్బతీస్తారు. ఆఖరికి పైచేయి ఇజ్రాయిల్దే అవుతుంది, ఇది 100% షూర్ బైబిల్ చెప్పిన ప్రవచనం.
- 📖 నా దేశము – నా ప్రజలు: ఇరాన్ ఒక్కటే గెలవలేక రష్యా, జర్మనీ వంటి దేశాలను కలుపుకొని వచ్చినా ఇజ్రాయేల్దే పైచేయి అవుతుంది. ఎందుకంటే అది “నా దేశం, ఆ దేశం నాది” అని దేవుడు ఎహెజ్కేలు 38లో చెప్పాడు. ఇజ్రాయేలును దేవుడు ‘మై ఓన్ కంట్రీ’ (My Own Country) అని పిలుస్తాడు.
- ✨ ముగింపు: ఇజ్రాయేల్ అనేది కేవలం అందమైన దేశం కాబట్టి కాదు, అది దేవుడు స్వయంగా ఎంచుకున్న దేశం. అక్కడ యుద్ధం జరిగినా, నష్టాలు వచ్చినా అంతిమంగా దేవుడే ఆ దేశాన్ని నిలబెడతాడు.
Detailed English Translation:
🇮🇱 Question: Pastor, damage occurred when Iran attacked Israel. How is such an attack possible in a country protected by God? What could be God’s plan in this?
- Loss is Inevitable in War: Whenever a war occurs, no matter how much God protects, it has never happened that one side suffers no loss at all while all the damage goes to the opponent. This has not happened in the past, does not happen now, and will not happen in the future. After a war, both sides will experience some degree of loss.
- Final Victory Belongs to Israel: Even in the Old Testament, when they went to destroy pagan nations and occupy their land, they (Israelites) also had to lose some people. But ultimately, God gave the final victory to Israel. God takes whomever He wishes according to His will.
- Minimal Loss – Maximum Protection: The damage caused to Israel is very little. What happens to their enemies is much more than what happens to them. If the enemies suffer 90% damage, Israel only suffers 10%. Even from that, they recover quickly and strike back at the enemy. Eventually, Israel will have the upper hand; this is a 100% sure prophecy told by the Bible.
- My Land – My People: Even if Iran cannot win alone and brings countries like Russia and Germany, Israel will still prevail. Because God said in Ezekiel 38, “It is My land, that land is Mine.” God calls Israel ‘My Own Country.’
- Conclusion: Israel is not just a beautiful country; it is a nation personally chosen by God. Even if war happens and losses occur, ultimately, God Himself will sustain that nation.
