🎼 ప్రశ్న: అయ్యగారు రాసిన మొదటి పాట ఏది? 1980లో సేవకు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్న అనుభవాలు మరియు మొదటి ఆల్బమ్ వెనుక ఉన్న మర్మం ఏమిటి? (00:49:24)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 22s)
- 🛡️ మొదటి పాట – 1980: మార్చి 27, 1980వ సంవత్సరంలో 21 ఏళ్ల వయసులో సేవకు వచ్చినప్పుడు రాసిన మొదటి పాట—”యెహోవా నా కాపరి నేను ఆయన స్వాస్థ్యమును.. నా జీవమా నీకు దిగులేలెను.” ఈ పాటలోని చివరి చరణం “త్వరలోనే ధరవీడి పరలోకమేగుదున్” అని రాశాను.
- ⏳ ఆరు నెలల ఆయుష్షు: ఆ రోజుల్లో నేను ఆరు నెలల కంటే ఎక్కువ కాలం బ్రతకనని, త్వరలోనే చనిపోతానని బలంగా నమ్మాను. డేవిడ్ బ్రైనర్డ్ (27 ఏళ్లు), బాప్తిస్మమిచ్చు యోహాను (30 ఏళ్లు) వంటి భక్తుల జీవితాలే నాకు ఆదర్శం. ఉద్యోగం వదిలేసి, పెళ్లి వద్దనుకుని, నా సమయం తక్కువ ఉందని అందరికీ చెప్పేశాను.
- 🕰️ దేవుని ఆశ్చర్యకరమైన నడిపింపు: నేను 60 ఏళ్లు వస్తానని కలలో కూడా అనుకోలేదు. రాత్రి పడుకున్నప్పుడు నిద్రలోనే ప్రభువు దగ్గరికి వెళ్లాలని ప్రార్థించేవాడిని. ఉదయం కళ్లు తెరిచాక చుట్టూ చూసి, ఇంకా చావలేదా అని ఆశ్చర్యపోయేవాడిని. కానీ దేవుడు నా చేయి పట్టుకుని 66 ఏళ్లు నిండే వరకు అద్భుతంగా నడిపించారు.
- 🎵 మొదటి ఆల్బమ్ – పిజేడి కుమార్ గారి సంగీతం: ఆల్బమ్‌లు చేయాలనే ప్లాన్ నాకు అప్పుడు లేదు. కానీ యాత్ర సాగుతున్న కొద్దీ పాటలు పెరిగాయి. శిష్యుల కోరిక మేరకు రాక్ చర్చిలో పిజేడి కుమార్ గారి సంగీత సారధ్యంలో మొదటి 10 పాటలు రికార్డ్ చేశాం. ఆయన వంటి వర్సటైల్ మ్యూజిషియన్ (Versatile Musician) క్రైస్తవ లోకంలో అరుదు.
- ✨ ముగింపు: ఈ ఆల్బమ్‌లు, గ్రంథాలు, సంఘాలు.. ఏదీ నేను చేయాలనుకొని చేసింది కాదు. దేవుడే నా ద్వారా అన్ ఎక్స్పెక్టెడ్ గా (Unexpectedly) చేయించారు. ఇప్పటికీ ఇన్ని పాటలు రాశానంటే అది కేవలం దేవుని కృప మాత్రమే.
Detailed English Translation:
🎼 Question: What was the first song written by the man of God? What were his struggles and experiences when he entered ministry in 1980?
- The First Song – 1980: On March 27, 1980, at the age of 21, I entered the ministry and wrote my first song: “The Lord is my Shepherd, I am His inheritance… O my soul, why are you troubled?” The last verse of this song was, “Soon I will leave this earth and reach Heaven.”
- Expectation of Death: In those days, I firmly believed I would not live more than six months. I was inspired by servants of God like David Brainerd (who died at 27) and John the Baptist (who died at 30). I resigned from my job and told everyone that my time was short.
- God’s Miraculous Guidance: I never imagined I would reach 60 years of age. I used to pray to the Lord to take me in my sleep. Upon waking up, I would be surprised to find myself still in this world. But God took my hand and led me wonderfully until I completed 66 years.
- The First Album – Music by PJD Kumar: I had no plan to make albums. But as the journey continued, the number of songs grew. At the request of disciples, we recorded the first 10 songs at Rock Church under the musical direction of PJD Kumar. Such a versatile musician is rare in the Christian world.
- Conclusion: These albums, books, and churches—none of this was done by my own planning. God did it through me unexpectedly. The fact that I have written so many songs today is purely by His grace.
