89. ప్రశ్న: గలతీ 6:17లో “నేను యేసుయొక్క ముద్రలు నా శరీరమందు ధరించి యున్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. అని పౌలు గారు అంటున్నారు. దీని అర్థం ఏమిటి? ముద్రలు శరీరమందు ధరించడం ఏమిటి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఆయనకు పడ్డటువంటి కొరడా దెబ్బలు, బెత్తము దెబ్బలు, వాటివల్ల మిగిలిపోయిన మచ్చలు. అవన్నీటిని ఆయన అతిశయంగా చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఇవ్వన్నీ యేసు ప్రభు యొక్క ముద్రలు అని చెప్పుకుంటున్నాడు. ఆయనను చాలా సార్లు బెత్తముతో కొట్టారు. రాళ్ళతో కొట్టారు, ఆ గాయాలు మానిన చర్మం మీద మచ్చలు మిగిలిపోతయి కదా! వాటిని నేను పొందిన శ్రమల చిహ్నాలుగా అవి మిగిలిపోయినాయి. యేసుప్రభు వారి ముద్ర అని ఆ context లో చెప్తాడు. ఇకమీదట నన్ను ఎవడు శ్రమపెట్టకండి. అంటే ఇంతకు ముందు పొందిన శ్రమలకు ఈ చిహ్నాలు మిగిలిపోయినాయి. మళ్ళీ నన్నెవరు కొత్తగా శ్రమ పెట్టకండి అంటాడు.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram