(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: Intresting fact ఏమిటంటే ఆదికాండము రాసిన మోషే భక్తుడే 90వ కీర్తన రాసాడు గనుక ఇక్కడ 3 facts మనం గమనించాలి.
- నెఫీలుల అక్రమం అంతా దేవుడు మోషేకు బయలుపరిచిన తర్వాత అక్రమ విషయంలో వీళ్లు నరమాత్రులు వీళ్లను చేసినందుకు నేను సంతాప పడుతున్నాను. అయినను వారి దినముల 120 ఏండ్లగును అని అనడం.
- మోషే ఒక కీర్తన వ్రాసినప్పుడు అధిక బలం ఉంటే 70 ఏండ్లు నరుని ఆయుష్షు అని రాయడం.
- అసలు ఈ మాట రాసిన ఆయనే 120 ఏండ్లు బ్రతకడం. ఈ మూడు intresting facts ఈ మూడు connected facts ఈ మూడు కలిసి మనకు అనేక పాఠాలు నేర్పిస్తున్నాయి. నరుని ఆయుష్షు 70 ఏండ్లు అని చెప్పిన మోషే తాను స్వయానా 120 ఏండ్లు బ్రతికాడు. ఆయన సేవ మొదలు పెట్టినప్పుడు 80 ఏండ్లు అని బైబిల్ చెప్తుంది. 80 ఏండ్లుకు మోషే సేవ ప్రారంభించాడు అంటే ఆయన 90వ కీర్తనలో రాసిన ప్రకారం ఆయన life time అయిపోయింది. ఎప్పుడైతే life అయిపోయింది అని అనుకున్నాడో, అప్పుడు సేవా పరిచర్య ప్రారంభమై ప్రపంచాన్నే ప్రభావితం చేసిన సేవ మోషే చేసాడు. అంటే అర్థం ఏమిటంటే నా శరీరక బలం అయిపోయింది, నేను zero అనుకున్నప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడం ప్రారంభం అవుతుందన్నమాట. “The end of your strength is the begining of God’s strength in your life”. ఇది అసలు పాఠం. ఇంత కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినవారు మోషే కంటే ముందు బ్రదికినవారు. అయితే 120 సంవత్సరాలు కంటే ఒక్కరోజు కూడా ఎక్కువ బ్రతకకూడదు అని బైబిల్ లో లేదు. దానికి ఎదో 5-10 ఏండ్లు అటు ఇటు ఉండొచ్చు అది పెద్ద విషయమేమి కాదు. ఎన్ని ఎండ్లు బ్రతికినా మళ్లీ మంటికి మన్నై పోవడమే.