(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అక్కడ ప్రభువే క్లియర్గా చెబుతున్నాడు కదా? అద్భుతాలు చేసాను, ప్రవచనాలు చెప్పాను అని. విర్రవీగితే కుదరదు. వీళ్ళను యేసుప్రభువు వారు, నేను అద్భుతాలు చేయ్యలేదా? ప్రవచనాలు చెప్పలేదా? దయ్యాలు వెల్లగొట్టలేదా? ప్రభువా, అంటే యేసు ప్రభువు వారు ఉండి, మీ మొహం, వెళ్ళండ్రా! మీరెప్పుడు చేసారు? అద్భుతాలు. అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరెప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టారు? మీరు ప్రవచనాలు చెప్పడం ఏంటి? మొహం, అని ఆయన అనలేదు. ఇవన్నీ చేసారు నిజమే! అద్భుతాలు చేసారు. ప్రవచనాలు చెప్పారు. దయ్యాలు వెళ్ళగొట్టారు. ప్రసంగాలు చేసారు. యేసయ్య ఏమన్నాడంటే ఇవన్నీ, మీరు చేసారు నిజమే! ఇంకొకటి కూడ చేసారు. అది మీరు ఇప్పుడు చెప్పట్లేదు. ఏంటంటే ఇవన్నీ చేస్తూ అక్రమము కూడ చేసారు. ఇప్పుడు ప్రవచనాలు చెబుతూ అక్రమము చేసారు. దయ్యాలు వెళ్ళగొడుతూ అక్రమము చేసారు. ప్రసంగాలు చేస్తూ సువార్త ప్రకటిస్తూ వీరు అక్రమము కూడ చేసారు. గనుక మీరెవరో నాకు తెలియదు, పొమ్మని అనేసాడు. అక్కడ విషయం ఏంటంటే, మన ద్వారా జరుగుతున్న సేవను గూర్చి మనం సంతోషపడి, సంబరపడి, విర్రవీగి, చంకలు గుద్దుకుని గర్వించడంకంటే ఇన్ని జరగడం అనేది దేవుని కృప ద్వారా జరుగుతున్నాయి; నా వలన ఇన్ని అద్భుతాలు జరిగితే దేవునికి స్తోత్రం. కాని నా ప్రవర్తనలో ఎక్కడైనా అక్రమం ఉన్నదా? క్రమము, క్రమశిక్షణ లేకపోవడం ఉన్నదా? అని మనం పరీక్షించుకుని, అంతటను, అందరూ మారుమనస్సు పొందాలి. అనే దేవుని వాక్కు ప్రకారం ప్రతి దినము కూడ దైవసేవకులు అనుకున్నవాళ్ళు కూడ స్వపరీక్ష చేసుకుంటూ, మారుమనస్సు పొందుతూ ఉండాలి. అదీ యేసయ్య చెబుతున్న పాఠం అక్కడ! మనం గొప్ప సేవకులమై ఉండొచ్చు గాని, మనలో తప్పులేదుగా అని విర్రవీగకూడదు. తప్పు లేకపోతేనే పని జరుగుతుంది అనుకోకూడదు. ఎన్నో తప్పులు ఉన్నవాళ్లని కూడా దేవుడు వాడుకుంటాడు . God works not because of us but in spite of us.