🛕 ప్రశ్న: గ్రామాలలో దేవాలయాలు కట్టేటప్పుడు క్రైస్తవులను కూడా చందాలు అడుగుతున్నారు. మా సహవాసంలో కొందరు ఇచ్చారు, కొందరు ఇవ్వలేదు. పాస్టర్లు వద్దంటున్నారు. అసలు చందాలు ఇవ్వవచ్చా? ఇస్తే విగ్రహారాధన చేసినట్లు అవుతుందా? ఇచ్చిన వారికి, ఇవ్వని వారికి మధ్య కాపరి ఎలా వ్యవహరించాలి? (0:28:00)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 02s)
- 🤝 సామాజిక సంబంధాలు: ఇది పెద్ద ఇష్యూ చేయాల్సిన విషయం కాదు. గ్రామాలలో కొంతమందికి సామాజిక వ్యతిరేకతను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉంటుంది కాబట్టి “నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో” అని నిలబడతారు. మరికొందరు బలహీనులు ఉంటారు. రేపు పొద్దున్న లేస్తే ముఖాలు చూసుకోవాలి, అనవసరంగా శత్రుత్వాలు ఎందుకు అని వంద రూపాయలో, పది రూపాయలో ఇచ్చేస్తారు.
- ❌ విగ్రహారాధన కాదు: చందాలు ఇచ్చినంత మాత్రాన వారు విగ్రహారాధకులు అయిపోరు. వారు హృదయంలో యేసయ్యను వదిలిపెట్టలేదు, ఆ విగ్రహానికి సాగిలపడలేదు. “నా అన్నకో, తమ్మునికో ఇచ్చాను” అనే సాఫ్ట్ కార్నర్ తో ఇచ్చారు తప్ప, ఆ దేవతే రక్షకురాలని వారు అనుకోలేదు. వారు ఇచ్చినప్పుడు ఇష్టం లేకుండానే ఇచ్చారు.
- ⚖️ బలవంతం మీద చేసే దోషం: ఇది ఒక యూనివర్సల్ లా (Universal Law)—మనకు ఇష్టం లేకుండా, బలవంతం మీద మనం చేసే దాని దోషం మనకు అంటదు. ఉదాహరణకు, ఒక అమ్మాయిని బలవంతంగా అవమానిస్తే శిక్ష చేసిన వాడికి పడుతుంది కానీ, ఆ అమ్మాయికి కాదు. అలాగే, సామాజిక ఒత్తిడి వల్ల ఇష్టం లేకుండా ఇచ్చిన చందాల విషయంలో దేవుడు మూర్ఖంగా తీర్పు తీర్చడు. ఇచ్చిన వారు ఎంత బాధపడుతూ, “యేసయ్య నన్ను క్షమించు, గొడవలు ఎందుకులే అని ఇచ్చాను” అని ఏడ్చారో మనకు తెలియదు.
- 🛡️ మనోబలం – భిన్నత్వాలు: సమాజంలో ఎదురుతిరిగే దమ్మున్న వారు ఒక వర్గం అయితే, గొడవలు ఎందుకు అని సర్దుకుపోయే వారు మానసికంగా కొంచెం బలహీనులు. దేవుడు అందరినీ క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. వారి మీద అబద్ధ క్రీస్తు ముద్ర పడిందని గానీ, భ్రష్టులని గానీ అనకూడదు. 666 ముద్ర వేసేటప్పుడు యేసు దేవుడు కాదని ఒప్పుకుంటేనే ముద్ర వేస్తారు, ఇక్కడ ఆ పరిస్థితి లేదు.
- 🏘️ అగాపే సంఘం ఉదాహరణ: మన చర్చి ఆఫీస్ ముందే వినాయకుని విగ్రహం పెట్టే దిమ్మ కట్టారు. ప్రతి ఏటా వారు నిమజ్జనం అప్పుడు మన చర్చి ఆఫీస్ ఆవరణలోనే (Premises) భోజనాలు పెట్టుకుంటున్నారు. మేము హ్యాపీగా అనుమతిస్తాం. భోజనం పెట్టడం ప్రసాదం కాదు, అది ఒక పండుగ సందర్భంగా చేసే సామాజిక పని. నేను వినాయక భక్తుడిని అయిపోయానా? నా రక్షణ పోయిందా? ఆ బాప్తిస్మం ట్యాంక్ లోనే తర్వాత వందల మందికి నేను బాప్తిస్మం ఇచ్చాను.
- 📢 సాక్ష్యం ఇచ్చే అవకాశం: ధైర్యం ఉంటే గట్టిగా నిలబడండి. లేదంటే “నాకు ఈ దేవత మీద నమ్మకం లేదు, కానీ మనం ఒకే ఊరు కాబట్టి, బంధుత్వం (చుట్టరికం) ఉంది కాబట్టి నీకు సహాయంగా ఇది ఇస్తున్నాను” అని సాక్ష్యం ఇచ్చి ఇవ్వండి. “యేసే నా రక్షకుడు, మీకు కూడా ఆయనే రక్షకుడు” అని చెప్పి ఇవ్వడం వల్ల పాపం అంటదు. దేవుడు మనల్ని త్రోసేయడు.
Detailed English Translation:
🛕 Question: In villages, Christians are asked for donations for temple construction. Some give out of pressure, while some refuse. Does giving donations amount to idolatry? How should a pastor guide them?
- Social Context: This is not a major issue to conflict over. Some have the courage to refuse social pressure, while others, being spiritually or socially weaker, give a small amount to maintain peace in the village.
- Not Idolatry: Giving a donation under pressure doesn’t make one an idolater. Their heart still belongs to Jesus; they haven’t bowed down to the idol. They gave it considering the solicitors as their brothers or neighbors.
- Involuntary Acts: Universal law states that a sin committed under absolute duress or force does not count against the victim. Just as a victim of assault is not the sinner, a believer forced by social circumstances is not judged harshly by God.
- Broad-Mindedness: At our church office, we allow locals to have festive meals in our premises during certain festivals. This is social grace, not a compromise of faith. Being broad-minded doesn’t mean our salvation is lost.
- Opportunity to Witness: If you decide to give under pressure, use it as a chance to witness. Tell them, “I don’t believe in this deity, but because we are neighbors, I am giving this. Jesus is my only Savior.”
- Conclusion: Giving out of social compulsion or kinship does not result in losing one’s salvation or being marked by the Antichrist. God is just and understands the heart.
