935.Q: Number of Judges and Handling Biblical Controversies (KSM 231) 📖

❓ ప్రశ్న: అయ్యగారు, బైబిల్ గ్రంధంలో కొంతమంది న్యాయాధిపతులు ఉన్నారు. వారిలో కొంతమంది 13 మంది అంటారు, కొంతమంది 12 మంది అంటారు, లేదు 15 మంది అంటారు. అసలు ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? దీనివలన మన రక్షణ ఎలాగో సంపూర్ణం అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయండి. (1:54:17)

📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (08m 48s) 🎙️

  • ⚖️ ధర్మశాస్త్రం విషయమైనటువంటి వివాదములు ఉన్నవి, అవి రక్షణకు సంబంధం లేనివి, దాని మీద లక్ష్య పెట్టొద్దు అని పౌలు రాశాడు. ఇప్పుడు 13 అంటాను, 14 అంటాను, 15 అంటాను—దానివల్ల ఏ రకంగా మనం పరిశుద్ధులం కాగలం? మన ప్రార్థన జీవితం ఎలా ఎక్కువ అవుతుంది? ఎలాగ పాపాన్ని మనం అసహ్యించుకోగలుగుతామో, ఎలాగ ఆత్మల రక్షణ భారం కలుగుతుంది? పౌలు సీరియస్ గా చెప్పాడు ఏంటంటే—ధర్మశాస్త్ర సంబంధమైన వివాదములు, పేళ్లను గూర్చిన వివాదములు, వంశావళులను గూర్చిన వివాదములు దేవుని గృహ నిర్వాహకత్వంతోను, దేవుని రక్షణ ఏర్పాటుతో సంబంధము లేవు. అవి వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్యపెట్టవద్దు అని స్పష్టంగా చెప్పాడు. 🚫
  • 📖 నేను ఇప్పుడు 126వ సారి బైబిల్ చదువుతున్నా, నాకు బోలెడు డిస్క్రిపెన్సీస్ (Discrepancies) కనబడుతున్నాయి. ఇదేంటి ప్రభువా ఇక్కడ ఇలాగ ఉంది, అక్కడ అలాగ ఉంది అనిపిస్తుంది. ఒకచోట సొలొమోను ఇశ్రాయేలీయులను వెట్టి పనివారిగా నియమించాడు అని ఉంటుంది, నెక్స్ట్ పేజీలోనే ఇశ్రాయేలీయులను ఎవరిని దాసునిగా చేయలేదు అని ఉంటుంది. మరి ఇదేంటి ప్రభువా అంటే, ఇప్పుడు అది పట్టుకొని యేసు రక్షకుడు కాదంటామా? అనలేము. అనవసరమైన వివాదాలు మనం పట్టించుకోకపోతేనే రక్షకుని మీద గురి నిలుపగలం అనేది పాఠం. నువ్వు రక్షకుని మీద గురి ఎంత నిలిపావో పరీక్షించడానికి కూడా దేవుడు ఇట్లాంటి కన్ఫ్యూజన్ అలవ్ (Allow) చేశాడు. ⚖️
  • 📜 పౌలు భక్తుని యొక్క చక్కని ధర్మోపదేశము రెండు చోట్ల ఉంది:
    1. 1 తిమోతి 1:4: కల్పనా కథలను, మితములేని వంశావళులను లక్ష్యపెట్టవద్దు. అవి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి.
    2. తీతు 3:9: అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
      ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా ఉపయోగిస్తే అది మేలు, అంతేగాని అనవసరంగా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఉండకూడదు. దానివల్ల లాభం లేదు. 🥚🪶
  • 👑 న్యాయాధిపతులు 15 మంది అని మనం లెక్క తీల్చామనుకోండి, దానివల్ల కొంత టైం వేస్ట్ అవుతుంది తప్ప మన ప్రార్థన జీవితమేమీ ఎక్కువ కాదు. ఏదో ఒక టెంప్టేషన్ తయారైపోయి ఇలాంటి ప్రశ్నల వెంట పడితే, ఈ లోపల ప్రభువు రాకడ వచ్చేస్తుంది. అప్పుడు ప్రభువు “నా దాసుడా నువ్వు నా కొరకు ఏం సాధించావు” అంటే, “న్యాయాధిపతుల లెక్క తేల్చితిని, కోడిగుడ్డు మీద ఈకలు పీకితిని” అని చెప్పాలి. అప్పుడు ఆయన “బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో ఈకల కిరీటం” అని ఇస్తాడు. కనుక ఈకల కిరీటాల వంటివి మనకు అవసరం లేదు. 👑🪶
  • ✝️ సిలువ మీద దృష్టి పెట్టండి, రక్షకుని మీద దృష్టి పెట్టండి. రక్షకుని లోకానికి ఎలా పరిచయం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. 66 ఏళ్ల వయసులో నాకే ఎన్నో ప్రశ్నలు వస్తాయి, కానీ నేను బైబిలే ప్రకటిస్తున్నాను. ఆదికాండం 3:15 లో దేవుడు వాగ్దానం చేసిన స్త్రీ సంతానం జగద్రక్షకుడిగా కన్య మరియ గర్భాన పుట్టాడు, ఆయనే మార్గం. ఆయన్ని తెలుసుకోవడం వల్ల మన బ్రతుకులు మారుతాయి గానీ ఈ వివాదాలు తేల్చడం వల్ల మారవు. ఇదంతా హెడ్ నాలెడ్జ్ (Head Knowledge), మనకు అవసరం లేదు. క్రీస్తే మన జీవం. 🔗
  • 🌍 అన్ని గ్రంథాల్లోనూ ప్రశ్నలు ఉంటాయి, బైబిల్‌లో కూడా ఉంటాయి. కానీ నేను ఎందుకు బైబిల్‌నే ప్రామాణికంగా తీసుకున్నానంటే—’The presence of the Savior, the prophecy and fulfillment about the Savior’. ఇది వైటల్ ఇష్యూ. మిగతా గ్రంథాలలో నీతి బోధలు ఉన్నాయి తప్ప, రక్షకుడు వస్తాడనే ప్రవచనం మరియు దాని నెరవేర్పు లేదు. అది అక్కడ మిస్సింగ్. అందుకే నాకు ఇది ప్రామాణిక గ్రంథం. అది విషయం. ✅

Detailed English Translation: 🌍

❓ Question: There are judges in the Bible. Some say there are 13, some 12, and others 15. Exactly how many judges were there? Please explain how knowing this completes our salvation.

  • Avoiding Disputes: Paul clearly stated that we should not focus on disputes concerning the Law that are irrelevant to salvation. Whether the number is 13, 14, or 15, it won’t increase our holiness, prayer life, or burden for souls. Genealogies and legalistic arguments are not related to God’s administration of grace but only breed quarrels. ⚖️
  • The Purpose of Discrepancies: Even after reading the Bible 126 times, one might find apparent discrepancies. For instance, one passage says Solomon used Israelites for forced labor, while another says he didn’t. Does this mean Jesus isn’t the Savior? No. God allows such confusion to test where our focus lies. If we get distracted by trivialities, we lose sight of the Savior. 🚫
  • Paul’s Exhortation: 1. 1 Timothy 1:4: Do not devote yourself to myths and endless genealogies which promote controversial speculations rather than advancing God’s work.
    1. Titus 3:9: Avoid foolish controversies and genealogies and arguments about the law, because these are unprofitable and useless. 📜
      Arguments over the law are like “plucking feathers off an egg”—meaningless and wasteful. 🥚🪶
  • Focus on the Cross: If you spend your whole life tallying the number of judges, you’ll have nothing to show when the Lord returns. Instead of a crown of glory, you’ll receive a “crown of feathers.” Focus on the Cross, focus on the Savior, and focus on how to introduce Him to the world. ✝️
  • Prophecy and Fulfillment: I trust the Bible because of the presence of the Savior and the fulfillment of prophecy. Genesis 3:15 promised a Savior through the seed of the woman, which was fulfilled in Christ. Other books have moral teachings, but they lack the specific prophecy and historical fulfillment of a Savior. That is why the Bible is my standard. ✅

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram