❓ ప్రశ్న: లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో—”వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు” అని ఉంది. సాధారణంగా ప్రసంగాల్లో దేవుడు అడుగుతున్నాడు అని చెప్తారు కానీ, అక్కడ ‘అడుగుచున్నారు’ అని బహువచనంలో ఉంది. కాబట్టి దేవుడు కాదు మరి ఎవరు అడుగుతున్నారు? వారి పేర్లు ఏంటి? (0:21:04) 📖
📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 00s) 🎙️
- ⚖️ బైబిల్ వ్యాఖ్యాన సూత్రం: ఇలాంటి ప్రశ్నలకు నేను చాలాసార్లు సమాధానం చెప్పాను. ఏదైనా ఒక సిద్ధాంతముగా దేవుడు మనకు నేర్పించాలనుకున్నప్పుడు అదే విషయాన్ని రెండు లేక మూడు చోట్ల రాయిస్తాడు. “ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరము చేసుకోవాలి.” ఒకే చోట ప్రస్తావించబడినప్పుడు దాని మీద దృష్టి పెట్టకూడదు, అది పెద్ద సిద్ధాంతముగా మనం ఎంచుకోకూడదు అనేది బైబిల్ వ్యాఖ్యాన సూత్రాలలో అతి ముఖ్యమైనది. ఇవన్నీ సంఘాలలో నేర్పాలి కానీ నేర్పరు. 📜
- 🚫 సిద్ధాంతం కాని విషయాలు: ఉదాహరణకు, మృతుల కొరకు బాప్తిస్మం పొందుతున్న వాళ్ళ సంగతి ఏమిటి అని మొదటి కొరింతి 15వ అధ్యాయంలో పౌలు ప్రశ్నిస్తాడు. దాని మీద కూర్చొని మనం కూడా మృతుల కొరకు బాప్తిస్మం పొందవచ్చా అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అట్లాగే పౌలు కెంక్రయలో మొక్కుబడి ఉన్నందున తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు అని ఉంది. మరి మనం కూడా ఇప్పుడు గుండ్లు కొట్టుకోవాలా? అట్లాంటి మొక్కుబలు ఉండాలా? పౌలు తీతును తీసుకుపోయి సున్నతి చేయించాడు అనే విషయం ఉంది. ఇవన్నీ మనం కూడా పాటించాలి అంటే అవ్వదు. అవన్నీ ఒకే చోట వ్రాయబడినవి గనుక దాని మీద సిద్ధాంతం చేయకూడదు, ఇది వ్యాఖ్యాన సూత్రం. ✂️
- ⛪ కొత్త నిబంధన సిద్ధాంతం: ఒకవేళ అది కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక సిద్ధాంతం అయితే కనీసం రెండు లేక మూడు ప్లేసెస్ లో లేఖనాల్లో దాన్ని రాయిస్తాడు. అప్పుడే అది సిద్ధాంతం అవుతుంది. కానీ ఒకే చోట ఉన్నది, ఒకే ముక్క బైబిల్లో ఉన్నది ఏది కూడా మనకు డాక్ట్రిన్ (Doctrine) కాదు. గనుక దాని మీద దృష్టి పెట్టొద్దు. అందుకే ఆ ధర్మశాస్త్రములోని వ్యర్థమైన వివాదములు ఉన్నాయి, వాటిని లక్ష్యపెట్టొద్దు అని పౌలు రాస్తాడు కదా తీతుకు, తిమోతికి. 🚧
- 📖 దేవుని జాగ్రత్త: అవన్నీ ఇటువంటివి అన్నమాట. మనకు సిద్ధాంతపరంగా దేవుడు ఇవ్వలేదు గనుకనే ఒక్క చోటనే అది వ్రాయించాడు, రెండో చోట రాయించకుండా దేవుడు జాగ్రత్త పడ్డాడు. నా పుస్తకాలు చదవండి, మీకు ప్రపంచమే కొత్తగా మారిపోతుంది. నేను 24 పుస్తకాలు రాశాను, అవి చదవండి. విశ్వము, మీ సొంత జీవితమే మీకు కొత్తగా అర్థమవుతుంది. 📚
Detailed English Translation: 🌍
❓ Question: Luke 12:20 says, “You fool! This very night your life is being demanded (asked) from you.” Since it is in the plural (“they are asking”), who are “they”? If it were God, wouldn’t it be singular?
- Principles of Interpretation: When God intends to teach a doctrine, He ensures it is mentioned in at least two or three places in Scripture. “By the mouth of two or three witnesses, every word shall be established.” A primary rule of biblical hermeneutics is that a subject mentioned only once should not be developed into a major doctrine. 📜
- Non-Doctrinal Instances: For example, Paul mentions baptism for the dead in 1 Corinthians 15, and he cut his hair at Cenchreae due to a vow. Does this mean we should practice baptism for the dead or shave our heads today? No. These are recorded as historical events or specific contexts, not as universal doctrines for the New Testament Church. If it were a fundamental doctrine, God would have reinforced it in multiple passages. 🚫
- Focus on Sound Doctrine: Paul warned Timothy and Titus to avoid foolish controversies regarding the law. Trivial details mentioned only once are not meant to be points of contention or pillars of faith. God deliberately kept such mentions singular to prevent them from becoming misleading doctrines. To understand these depths, one must study my books, which explain these universal truths and spiritual perspectives clearly. 📚
