943.Q: Recovering Lost Revelation & Discerning God’s Voice (KSM 230) 🕊️

❓ ప్రశ్న: దేవుని నుండి ఒక ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు దాన్ని జ్ఞాపకంలోనే సేవ్ చేసుకోవాలి కదా. అయితే కాలము గడుస్తున్న కొలది అది మర్చిపోయినా లేదా సాతాను తొలగించినా తిరిగి దాన్ని పొందే మార్గం ఏమిటి? అలాగే అది దేవుని ప్రేరేపణే అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? (0:31:20) 📖

📺 YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 11s) 🎙️

  • 🧠 పరిశుద్ధాత్ముడు జ్ఞాపకము చేయువాడు: 100% దేవుడు మళ్ళీ దాన్ని రిన్యూ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధకుడు మాత్రమే కాదు, ఆయన జ్ఞాపకం చేసేవాడు. యోహాను 14:26 ప్రకారం—”ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులని మీకు జ్ఞాపకము చేయును.” నేను వందల సార్లు ఇది అనుభవించాను. ఫలానా ఊరికి వెళ్ళినప్పుడు ఈ వాక్యం చెప్పాలని దేవుడు ముందు బయలుపరుస్తాడు. తీరా అక్కడికి వెళ్ళాక మైండ్ బ్లాంక్ అయిపోయి ఇన్ఫర్మేషన్ డిలీట్ అయినట్టు అనిపిస్తుంది. ఎలాగని వేదన పడి ప్రార్థన చేసినప్పుడు, ఆఖరి నిమిషంలో కూడా దేవుడు అద్భుతంగా ఫ్లాష్ లాగా దాన్ని జ్ఞాపకం చేస్తాడు. అడిగితే ఆయన 100% జ్ఞాపకం చేస్తాడు. ⚡
  • 🕯️ కొత్త తలంపు – ఒక కొత్త వ్యక్తి రాక వంటిది: దేవుడు మాట్లాడే విధానం ఒక గదిలోకి కొత్త వ్యక్తి ప్రవేశించినట్టు ఉంటుంది. ఒక స్టూడియోలో ఉన్నవాళ్ళు కాక కొత్త మనిషి వస్తే వెంటనే తెలిసిపోతుంది కదా! అలాగే మన మనస్సు అనే గదిలో మన సొంత ప్రేరేపణలకు ఒక ఫ్లేవర్ ఉంటుంది. కానీ ఉన్నట్టుండి ఒక కొత్త తలంపు వచ్చినప్పుడు దాని సువాసన వేరుగా ఉంటుంది. ఆ కొత్తగా వచ్చిన తలంపును బట్టి ఒక స్ట్రేంజర్ మన మనసులోకి ప్రవేశించాడని మనకు అర్థమవుతుంది. 🚪
  • దేవుని స్వరం vs దుష్టుని తలంపు: ఆ స్ట్రేంజర్ వచ్చినప్పుడు దేవుని తలంపు అయితే మనసు ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఆనందభరితంగా ఉంటుంది. దుష్టుని తలంపు అయితే భయము, ఆందోళన, కలవరం కలుగుతుంది. పౌలు చెప్పినట్లు జ్ఞానేంద్రియాలకు సాధన చేయాలి. ఆధ్యాత్మిక చెవులతో దేవుని స్వరమును వినడంలో సాధన అవసరం. పసిబిడ్డ కొత్తవాళ్ళని చూస్తే భయపడుతుంది కానీ, అమ్మ రాగానే కంఫర్టబుల్ గా ఉంటుంది. దేవుని స్వరం వచ్చినప్పుడు భక్తుని స్పందన అలాగే ఉంటుంది. ఆయన సన్నిధిలో చల్లటి చెట్టు నీడలో విశ్రమించినట్టు ఉంటుంది. సాతాను వెలుగు దూత వేషం వేసినా లోపల భయం భయంగానే ఉంటుంది. 🛡️
  • 🐯 భయాలలో వ్యత్యాసం: నాన్నగారిని చూస్తే కలిగే భయం వేరు, తోడేలును చూస్తే కలిగే భయం వేరు. నాన్నగారు మనకు కావాలి, ఆయన శిక్షణ నేర్పిస్తారు కానీ ప్రాణాలు తీయరు. తోడేలు ప్రమాదకారి. దేవుని యందలి భయం పవిత్రమైనది. దేవుని చిత్తం బయలుపడినప్పుడు మనకు ఆనందం, ఆహ్లాదం కలిగితే అది మొదటి టెస్ట్. ⚖️
  • 📖 అల్టిమేట్ టెస్ట్ – బైబిల్: ప్రేరేపణ కలిగినప్పుడు దాన్ని సుప్రీం కోర్టు లాంటి బైబిల్ దగ్గరికి తీసుకెళ్లాలి. ఎక్కడైనా బైబిల్ దీన్ని ఖండిస్తుందా అని చూసుకోవాలి. హృదయంలో సంతోషం ఉండి, బైబిల్ ఎక్కడా ఖండించకపోతే అది 100కు 1000% దేవుని స్వరమే. ఈ రెండు టెస్టులు సరిపోతాయి. ✅

Detailed English Translation: 🌍

❓ Question: If we receive a revelation from God but later forget it or if Satan causes us to lose it, how can we recover it? Also, how can we distinguish if a prompt is truly from God?

  • The Holy Spirit as a Reminder: God will 100% renew a forgotten revelation. According to John 14:26, the Holy Spirit is not just a teacher but also a reminder. I have experienced this hundreds of times. Even when the mind feels completely blank just before a sermon, the Holy Spirit flashes the original revelation back into memory when we pray with anguish. If you ask Him, He will certainly remind you. 🕊️
  • The Entrance of a New Thought: Discerning God’s voice is like recognizing a stranger entering a room. Just as we sense the presence and “fragrance” of a new person in a studio, our mind recognizes a thought that doesn’t belong to our own usual internal “flavor.” When a stranger (a new thought) enters the mind, we must identify its origin. 🕯️
  • Divine Peace vs. Demonic Anxiety: If the thought is from God, it brings a sense of pleasantness, tranquility, and joy. If it is from the enemy, it brings fear, anxiety, and turmoil. Paul speaks about training our spiritual senses. Like a child who finds comfort only in their mother’s arms and fears strangers, a believer finds rest in God’s voice. Satan, even when disguised as an angel of light, cannot provide genuine peace; there will always be underlying fear. ✨
  • The Fear of a Father vs. The Fear of a Wolf: There is a difference between fearing a father and fearing a wolf. We desire our father’s presence even though we respect and fear his discipline. A wolf, however, is a predator. The fear of God is pure and brings us closer to Him, whereas the enemy’s fear drives us to despair. 🛡️
  • The Supreme Test – The Bible: The ultimate verification for any revelation is the Word of God. The Bible acts as the Supreme Court. If a revelation brings joy and is not contradicted by Scripture, it is 1000% the voice of God. These two tests—internal peace and scriptural alignment—are sufficient. 📖

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram