(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నేను అంబేద్కరిస్ట్ని, అంబేద్కర్ గారు వేదాలను ప్రామాణికంగా ఎంచలేదు వాటిని తృణీకరించారు. నేను అంబేద్కర్ ఆలోచన విధానం యావత్తు భారతీయులందరి ఆలోచన విధానం కావాలి అనే ఆశయంతో నేను పనిచేస్తున్నానని చెప్పుకుంటున్నాను. మరి నేనేమో వేదాలలో దైవ మార్గమును గూర్చిన ఉపదేశము ఉన్నదని “హైందవ క్రైస్తవం” రాసాను. ఇది అంబేద్కరిజం కాదు కదా అనే ప్రశ్న ఉన్నది. నా సమాధానం ఏంటంటే అంబేద్కర్ గారు నాకు సామాజిక విషయాలలో మాత్రమే గురువు. ఆధ్యాత్మిక గురువు ఆయన కాదు. మీరు ఏ మతంలో నైనా ఉండండి కాని మీరు అంటరాని వాళ్ళు అది చెప్పినటువంటి ఆ మతములో మాత్రము మీరు ఉండొద్దు అని అంబేద్కర్ గారు అన్నారు. అలాంటప్పుడు నేనే మీకు spiritual గురువుని అన్నట్లు కాదు గదా! నేను క్రైస్తవుడిగా ఉన్నాను కాబట్టి యేసు ప్రభువును గూర్చిన సువార్త లోకమంతా చాటించడానికి వాళ్ల వాళ్ల పుణ్య గ్రంథాలను నేను ఆధారంగా తీసుకొని సువార్త చెప్తున్నాను. ఇందులో ఏ మాత్రం clash లేదు. భారతదేశంలోని సమాజంలోని హెచ్చు తగ్గులు, వివక్షలు నిర్మూలించటం ఎలా అన్న ఒక్క principle లోనే మాకు బాబా సాహెబ్ గురువు, మార్గ దర్శకుడు. చచ్చిపోయిన తర్వాత ఉండే నరకం ఎలా తప్పించుకోవాలో అది యేసు ప్రభు మనకు చెప్తారు. కానీ బ్రతికుండగానే మనువాదులు మనకొక నరకం సృష్టించారు. దళితులు, అంటరాని వారు అనబడిన ఈ జనాంగం ఎవరైతే ఉన్నారో వారు ఈ నరకంలో ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత ఉండే నరకం నుండి ఎవరికి తోచినట్లు వారు తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ బ్రతికుండగా ఉన్న నరకం నుండి తప్పించుకోవాలంటే మాత్రం అంబేద్కరిజం ఒక్కటే శరణ్యం అని నేను ఎన్నో సార్లు ప్రకటించాను. సమాజాన్ని సంస్కరించడానికి నాకు అంబేద్కర్ గారు గురువు కానీ మోక్షసాధనకు యేసే గురువు. నమ్ముకుంటే నమ్ముకోండి. అని ఆయనే చెప్పారు గనుక As an Ambedkarist I am a good Christian and as a good Christian I can be an Ambedkarist also.