(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఈ విషయంలో ఆ vocabulary వాడుతున్న వారికి కూడా clarity లేదు. క్రైస్తవులు కూడా ఇది మతం కాదు మార్గం అని అంటారు. ఏమిటంటే వారికి కూడా మతం, మార్గం అంటే clarity లేదు. ఎందుకంటే గలతీ. 1:22,23,24 “క్రీస్తు నందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని; మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని, వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచిరి.” అని ఉంది. మతము అంటే foot note లో విశ్వాసము అని ఉంది కానీ అది alternative word గా వ్రాసారు గాని మూలభాషలో విశ్వాసం అని అక్కడ లేదు. గనుక పౌలే చెప్తున్నాడు ఒకప్పుడు నేను ఈ క్రైస్తవ మతమును చెడగొట్టాను అదే మతాన్ని ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను. గనుక యేసు ప్రభు మార్గంలో ఉన్నవారు యేసు ప్రభు మతంలో ఉన్నారంటే దోషం ఏమిటి? మతం అనేది తప్పు మాట కాదు. గనుక క్రైస్తవులు కూడా ఉలిక్కిపడి ఇది మతం కాదు అనవద్దు. ఎందుకు అంటారంటే ఇతర మతముల వంటి మతము కాదు అని వారి భావన. “Christianity may be” a religion with different parameters, different foundation of faith. క్రైస్తవులు ఈ మాట అంటున్నందుకు హిందూ మత పెద్దలు కూడా అంటున్నారు. హిందూ మతం, మతం కాదు అనేది. correct అది నేను అంగీకరిస్తాను. ఎందుకంటే మతానికి ఒక specific demonstration ఉండాలి. For e.g :- మతం అంటే దానికి ప్రామాణిక పవిత్ర గ్రంథమేమి, దానికి దేవుడు ఎవరు, దేవున్ని చేరే మార్గం ఏది, భక్తి సాధన నియమములు ఏమిటి? ఇలాంటివి ఉంటే అది ఒక మతం. ఇస్లాం ఉంది దానికి Mohammad is prophet, Allah is God, and Quran is holy book. వాళ్లలో పుట్టిన మగ శిశువులకు సున్నతి చేయాలి. పండగ ఆచరించాలి, Namaz అనేది ఉన్నది ఇలా ఉన్నాయి.అలాగే క్రైస్తవ్యంలో Jesus is god, Bible is holy book. ఇది మనకున్న demonstration. మరి హిందుత్వానికి holy book ఏది అంటే many holy books, many gods, ఎన్నో పూజా విధానాలు. ఒక దేవున్ని గురువారం, శుక్రవారం ఇంకో వారం ఇలా మ్రొక్కాలి. గనుక ఇది మతం కాదు ఒక జీవన విధానం అని చెబుతున్నారు. ఇలా ఒక కచ్చితమైన demarcation లేదు గనుక ఇది మతం కాదు ఒక జీవన విధానం అని చెబుతున్నారు. Islam, Judaism, Christianity religions చెప్పడం తప్పుకాదు. అయితే క్రైస్తవులు అలా ఎందుకు చెప్పారంటే మీకు తెలిసిన ఇతర మతముల వంటి మతం ఇది కాదు, అన్నిటికంటే విశిష్టమైన, శ్రేష్టమైన లక్షణాలు కలిగి ఉన్నది అని చెప్పడం చేతగాక అలా చెప్పారు. కానీ bible లోనే ఆ మతము అన్న మాట పౌలు అన్నాడు.