15. ప్రశ్న : కీర్తన 81:3 మరియు కొలస్సీ 2:16లో “అమావాస్యనాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమునాడు కొమ్ము ఊదుడి”. వివరించగలరు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: కొలస్సీ 2:16లో నాలుగు సంగతులు చెప్పాడు.

  1. కాబట్టి అన్న పానముల విషయములో
  2. పండుగల విషయంలో
  3. అమావాస్య విషయంలో
  4. విశ్రాంతి దినము
    ఈ నాలుగు విషయాలలో మీకు తీర్పు తీర్చడానికి ఎవరీకి అవకాశం ఇవ్వొద్దు అని చెబుతూ ఇవి ఛాయయేగాని అన్నాడు. అంటే అన్నపానములు ఒక నీడ, పండుగలు ఒక నీడ, అమావాస్య ఒక నీడ, విశ్రాంతి దినము ఒక నీడ అసలైనవి వేరే ఉన్నాయి. దీని గూర్చి “ప్రమాణవాక్యము” అనే నా గ్రంథంలో చెప్పాను. అది తప్పక చదవండి. ఈ నాలుగు విషయాలలో అమావాస్య అనేది వచ్చింది. కీర్తన 81:3లో అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అన్నాడు. అమావాస్య అంటే చంద్రుడు క్షీణించి క్షీణించి almost zero point కి వచ్చే ఆ దినం చంద్రకాంతి, వెన్నెల రాత్రి ఏ మాత్రం ఉండదు. ఆ రోజు కొమ్ము ఊదమన్నాడు. కొమ్ము అనేది విజయ సూచకం. ఇక్కడ చంద్రబింబం అనేది సంఘానికి సూచన. ఎందుకంటే చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. సూర్యునికి self illumination ఉంటుంది. సూర్యకిరణాలు వచ్చి చంద్రుడి మీద పడాలి. చంద్రుడిదే reflected light. అందుచేత క్రీస్తు సూర్యుని వంటివాడు ఆయన నీతి, జ్ఞానం అంతా ఆయన సొంతప్రకాశమే. సంఘానికి ఉండే జ్ఞానం, నీతి అంతా ప్రతిబింబించిన మహిమే గాని సొంత మహిమకాదు. సూర్యుడు సంవత్సరం అంతా ఏకరీతిగా ఉంటాడు. చంద్రుడికి నెలలో సగభాగం క్షీణిస్తూ ఉంటాడు, ఇంకో సగభాగం వృద్ధి చెందుతూ ఉంటాడు. క్రీస్తు సంఘము ఇలాగే ఉంటుంది. అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది తరుగుతూ ఉంటుంది. ఏ విశ్వాసికైనా Ups and downs ఉంటాయి. ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ ఏకరీతిగా ఉండము. చంద్రుడిలాగా పెరుగుతూ, తరుగుతూ ఉంటాము. అమావాస్య అంటే క్రీస్తు కాంతి మన మీద పడి మనం ప్రకాశించే స్థితి Minimum స్థాయికి వెళ్లిపోయింది. అలాంటప్పుడు కొమ్ము ఊదమన్నాడు. అంటే the beginning of a new revival అన్నమాట. ఆ రోజే చంద్రుడిలో మళ్లీ growth ప్రారంభం అవుతుంది. సంఘం గానీ విశ్వాసి గానీ చాలా బలహీనంగా ఉన్నారు అనుకున్నప్పుడే ఉజ్జీవం వస్తుంది. గనుక మీరు బాగా క్రుంగిపోయామని భాదపడకండి. This may be the beginning of a new revival అనే నిరీక్షణ మాట కీర్తన 81:3లో చెప్తున్నాడు.