అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: ధర్మశాస్త్రం అనేది బాలశిక్షకుడు అని గలతీలో పౌలు చెబుతాడు. దశమభాగం అనేది మోషే ధర్మశాస్త్రంతో రాలేదు. మోషే కొండమీద ధర్మశాస్త్రం పొంది, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినప్పుడు దశమభాగం ప్రారంభం కాలేదు. మోషే కంటే 500 ఏండ్ల క్రిందట అబ్రాహాము దశమభాగం, మెల్కీసెదెకుకు ఇచ్చాడు. తర్వాత యాకోబు ఇశ్రాయేలు జనాంగానికి వీళ్లు మూలపురుషులు. ధర్మశాస్త్రం కంటే ముందే దశమభాగం ప్రారంభం అయింది. తర్వాత ధర్మశాస్త్రం క్రీస్తుచేత కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం కొట్టి వేయబడినంత మాత్రాన దశమభాగం కొట్టివేయబడదు. ఎందుకంటే ఈ సీనాయి కొండ నిబంధనలో అది భాగము కాదు. పాతనిబంధనలో 100కి 10 రూపాయలు ఇవ్వమని ఉంది. క్రొత్త నిబంధనలో తమ చరస్థిర ఆస్తి అమ్మేసి అపోస్తులుల పాదాల దగ్గర పెట్టారని ఉంది. గనుక దశమభాగం తప్పైతే మేము క్రొత్తనిబంధన క్రమంలో ఉంటాము అనుకుంటే మీ చరస్థిర ఆస్తులు అమ్మిరండి, సువార్త చేద్దాం. మరి అది కష్టంగా ఉంటే కనీసం పాతనిబంధననైనా పాటించండి. సువార్త విని,నమ్మి బాప్తిస్మం పొంది ఊరుకోవడం కాదు మనకి ఉన్నదంతా దేవునికి ఎంత ఇచ్చేయాలంటే, చూసేవారికి మనకు పిచ్చిపట్టింది అనిపించాలి. అంతలా దేవునికి ఇవ్వడానికి మనం ఇష్టపడాలి. అలా తయారు చేయడమే సువార్త యొక్క Goal. శాపమేమీ రాదు కానీ ఇవ్వకపోతే ఆశీర్వాదం ఆగిపోతుంది.