23. ప్రశ్న : 2సమూయేలు 12:8లో “నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారినీ నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనిన యెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును” అన్నాడు. దేవుడే అలా ఎక్కువ మంది భార్యలను ఇవ్వడం ఏమిటి?

-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: ఆయా కాలఘట్టములలో అమలులో ఉండిన ధర్మం; ఉదాహరణకు అబ్రాహాము శారాలను ఉదాహరణగా తీసుకుంటే; అబ్రాహామునకు హాగరును శారానే భార్యగా ఇచ్చింది. హాగరు ప్రార్థన దేవుడు విన్నాడు. ఇష్మాయేలు మొరను విన్నాడు. మరి యాకోబు తీసుకుంటే రాహేలు, లేయా ఉన్నారు; మళ్లీ ఇద్దరు దాసీలు ఉన్నారు. మొత్తం పన్నెండు గోత్రాలు దాసీలకు కూడా కలిపి పుట్టారు. ఒక్క ఆమెకు పుట్టినవారు కాదు. ఆ విధంగా పాతనిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ social order ప్రకారం సౌలు స్త్రీలను తీసి నీ కౌగిటను చేర్చితిని అంటే సౌలు బ్రతికియుండగా కాదు. సౌలు చనిపోయిన తర్వాత ఆ అంతఃపురము, ఆ రాజ్యము దావీదు వశమైపోయింది. వారు ఒక 25 సంవత్సరాలు సౌలును భర్తగా ఎంచుకొని ఆయన దగ్గర బ్రతికినవారు. ఇప్పుడు మా భర్త చనిపోయాడు, రాజ్యము నీవు ఆక్రమించుకున్నావు దావీదు మహారాజా! మా బ్రతుకేంటి అని అన్నప్పుడు పరవాలేదు నేను మీకు అన్ని విషయాలలో అండగా ఉంటానని అనాల్సివచ్చింది. దేవుడు ఏమంటాడు అంటే కాలము కలిసి సౌలు చనిపోయాడు. అతని కౌగిటిలో ఉన్న స్త్రీలందరూ నీకు అయ్యారు. నీకు స్త్రీతో ఉండే సుఖమే కావాలి అంటే availability లో ఇంత మంది ఉండగా ఒక నిరు పేద వాని భార్య మీద ఎందుకు కన్నేసావు అనేది దేవుని ప్రశ్న. ఇది చాలదని అనుకుంటే నీకు ఇచ్చియుందును అంటే అది ఇవ్వడం ఎప్పుడు జరుగుతుంది? దావీదు ప్రార్థన చేయాలి. “దేవా నీవు నాకిచ్చిన 10 మంది, 20 మంది చాలలేదు. నాకు ఇంకా కావాలి అని అడగడం అనేది ఉండాలి. అక్కడ విషయం ఏమిటంటే సౌలు బ్రతికుండగా, దావీదు బ్రతికుండగా దేవుడు సౌలు కౌగిటిలోనుండి తీసుకొని దావీదుకు ఇచ్చిన పరిస్థితి కాదు. అది కాలక్రమేనా జరిగిన కొన్ని historic events లో సౌలు రాజు చనిపోగా వాళ్లను దావీదే చూసుకోవాల్సి వచ్చింది. నీకు ఇంత మంది ఉండగా నీవెందుకు ఇతరులను ఆశిస్తున్నావు అని దేవుడు గద్దిస్తున్నాడు. చాలదనుకుంటే ఇస్తాను కదా అంటే చాలదని నీవనుకోలేదు, నన్ను అడగలేదు, నీకా లేమి రానేలేదని గుర్తు చేస్తున్నాడు. అంతేగాని ఇప్పటికైనా అడుగు ఇస్తానని కాదు.