-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: మొట్టమొదటి విషయం ఏంటంటే అసలు ధర్మశాస్త్రములోని ఆజ్ఞలు, నైతిక పరమైన ఆజ్ఞలు ఒక వర్గము, ఒక కోవకు చెందినవి. అలాగే మరీ దాని ఏమంటారంటే ఆచార, వ్యవహరానికి లేక పారంపర్యము, లేక పూజా విధానము, ఆరాధన విధానానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రము ఆజ్ఞలు. యిప్పుడు దైవారాధనకు సంబంధించిన ఆజ్ఞలన్నింటిని “CEREMONIAL LAW’ అంటారు. అలాగే నైతిక ప్రమాణాలకు, కొలతలకు సంబంధించిన ఆజ్ఞలను “MORAL LAW” అంటారు. ఇప్పడు MORAL LAW ఏంటంటే నీతిప్రవర్తనకు సంబంధించి అబద్ధం ఆడవద్దు తరువాత వ్యభిచరించవద్దు, పొరుగువారి సొమ్ము, పొరుగువారి భార్యను ఆశించవద్దు. పొరుగువాని యింటిని ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు…., యివన్నీ కూడా నీతి సంబంధమైనవి. ఇకపోతే దేవుని దృష్టిలో యిది చేస్తే పవిత్రము, యిది అపవిత్రము అనేది CEREMONIAL LAW అంటాము. యేసుప్రభువారు అవతరించి యజ్ఞము జరిగిన తరువాత MORAL LAW అనేది Change కాలేదు. MORAL LAW అనేది కొట్టి వేయబడలేదు. నీతి సంబంధమైన, నీతి ప్రవర్తన కొరకైన ఆజ్ఞలు ఎన్ని అయితే పాత నిబంధన గ్రంథములో ఉన్నాయో అవన్నీ క్రొత్త నిబంధనలో యేసుప్రభువు గాని, ఆయన అపొస్తలులు గాని మళ్ళీ repeat చేస్తారు. All the moral law, the commandments of the moral law are repeated in the new testament either by the Lord Jesus or his disciples and apostles. గనుక అవి continue అవుతున్నాయి. ఇంక మనకు పాతనిబంధన కొట్టివేయబడింది అని యిప్పుడు మనం వ్యభిచారం చేయొచ్చు, Murder చేయొచ్చు అంటే కుదరదు. No-no-that commandment is still stands good. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మళ్ళీ భక్తులు చెప్పారు లేకపోతే రక్షకుడే చెప్పాడు. So యిప్పుడు యిందులో నీతి సంబంధమైన ఆజ్ఞలు అనేది సమాజం యొక్క శాంతియుత సహజీవనానికి అవసరం. అవి యిప్పుడు పొరుగువాని భార్యను ఆశించొద్దు అన్నారు. యిప్పుడు A అనే వ్యక్తి B అనే వాని భార్యను ఆశించి, B అనే వాడు D అనే వాని ఇంట్లో ఒక అమ్మాయిని ఆశిస్తే, వీరి ఇద్దరి భార్యలను C అనే వాడు ఆశించి సమాజం అంతా కలుషితం అయిపోతుంది. గనుక నీతి సంబంధమైన ఈ ప్రవర్తన నియమావళి, ఆ ప్రవర్తన నియమములకు సంబంధించిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా సమాజం యొక్క శాంతియుత సహజీవనానికి అవసరం. అప్పుడు అవసరమే, యిప్పుడూ అవసరమే. ఇకపోతే మనలను దేవుని ముందు నీతిమంతులుగా లేక పరిశుద్ధులుగా, పాప రహితులుగా, సంపూర్ణులుగా నిలబెట్టడానికి ఈ ఆజ్ఞలు కావాలి. దేవునితో మనం సమాధాన పడడానికి ఈ ఆజ్ఞలు కావాలి. ఈ ఆజ్ఞలు మనం పాటించి తీరాలి. అప్పుడే దేవుని ముందు మనం క్షమాపణ పొందుతాము, సమాధానం కలిగి ఉంటాము అనేది CEREMONIAL LAW.
అదిప్పుడు లేదు. అందులో CEREMONIAL LAW లోపలికి వచ్చేవాటిలో వస్తాయి ఈ జంతువును తినాలి, ఈ జంతువును తినొద్దు, ఈ మాంసము పవిత్రమైనది. యిదంతా కూడా ఏంటంటే, ఇప్పుడు పందిని తినొద్దు అన్నాడు. తింటే వాడు అపవిత్రుడు అని. ఇప్పుడు దానికి దాంట్లో కొన్ని ఉపమాన పాఠాలు చెప్పాడు. ఇప్పుడు పవిత్ర జంతువులు అని అంటే దానికి గిట్టలు చీలి ఉండాలి. నెమరు వేయాలి. ఈ రెండు ఉంటేనే పవిత్ర జంతువుబలికి పనికి వస్తుంది. మనకు ఆహారానికి పనికి వచ్చేది, దేవునికి బలి యివ్వడానికి కూడా పనికి వస్తుంది. దేవునికి బలికి యివ్వడానికి మాత్రమే పనికి వచ్చి, మనము తినకూడనిది లేదు. మనం తినడానికి మాత్రమే పనికి వచ్చి దేవునికి బలి యివ్వకూడదు అనే జంతువుకూడా లేదు. అందుచేత ఈ పవిత్ర జంతువులు అంటే మనము తినడానికి లేక దేవునికి బలి యివ్వడానికి యోగ్యమైనవి అని. జంతువులుకు రెండు లక్షణాలు ఉండాలి అన్నాడు ప్రభువు. (1) గిట్టలు ఉండాలి. చీలిన గిట్టలు ఉండాలి (2) నెమరు వేయాలి అంటే దేవునికి బలియివ్వడానికి పనికొచ్చే జంతువు అంటే Final గా విశ్వాసికి అది సూచన ఎందుకంటే మనలను మనమే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. గనుక దేవునికి మనము సజీవయాగముగా అర్పించుకునే యోగ్యమైన వ్యక్తులం కావాలంటే మనకు ఈ రెండు ఉండాలి. చీలిన గిట్టలు, నెమరువేసే లక్షణం. చీలిన గిట్టలు అంటే భూమి మీద Grip ఉంటుందిదానికి. For Example : గుర్రము వేగముగా పరుగెడుతుంది గాని గిట్టలు ఉండవు. అంత ఏక గిట్ట దానికి. అయితే గ్రురము అతివేగంగా పరిగెడుతుంది గాని దానితోని మనము భూమిని దున్నలేము. గుర్రానికి నాగలి కడితే పనిచేయదు. ఈ గుర్రము జారుతుంది. నాగలి జారుతుంది మొత్తం అందరు కలిసి బురదలో పడతారు ఎద్దుపడదు. ఎందుకంటే ఎద్దుకు గిట్టలు ఉంటయి. భూమిని ఆ రెండు గిట్టలతో గుచ్చి తన్ని పట్టుకొని భూమి మీద grip పెట్టుకొని బరువును ఎంతైనా లాగగలుగుతుంది అది. బరువు లాగాగలుగుతుంది. గాని వేగంగా పరుగెత్తలేదు ఎద్దు దాని వేగం చాల తక్కువ గుర్రంతో పోలిస్తే, గుర్రము శరవేగంతో పరుగెడుతుంది. 100 మైళ్ళు Per hour అయినా వెల్లిపోతుంది. కాని భూమి మీద దానికి grip తక్కువ గనుక స్థిరముగా నిలబడుట, బరువులు లాగడానికి కూడా సిద్ధపడి. మరీ… ఎదురు గడ్డలు ఎక్కడానికి Ups and Downs ఉంటయి. జీవితంలో, కొండలు ఎక్కాలి లోయలు దిగాలి, బరువులు లాగాలి అలాంటప్పుడు మీరు స్థిరులను, కదలని వారునై ఉండండి అని 1కొరింథి 15:58లో చెప్పిన ఆజ్ఞ. ఆ హెచ్చరిక గిట్టలు గలిగినట్టువంటి విశ్వాసికే సాధ్యమవుతుంది. అంచేత ఎన్నో శ్రమలలో యోబు స్థిరుడు. దావీదు స్థిరుడు, యోసేపు, ప్రవక్తలు అందరు కూడా స్థిరంగా నిలబడ్డారు, స్థిరులు వారందరు, పౌలు స్తెఫెను అందరూ కూడా. ఆ స్థిరంగా నిలబడే శక్తిని అలంకారరూపకంగా గిట్టలు అంటారు. రెండవది నెమరు వేయుట అంటే విన్నది విన్నట్టు మరిచి పోవడం కాదు. పందికి గిట్టలు ఉంటాయి కాని అది నెమరు వేయదు. పందికి కూడా దానికి రెండు గిట్టలు చీలి ఉంటాయి గానీ అది తిన్నది తిన్నట్టు అటునుండి అటు వెనకకు పోవాల్సిందే తప్ప మళ్లీ వెనక్కి తిచ్చుకునేది దానికి ఉండదు. దేవుడు మనతో మాట్లాడే మాటలు మనకు ఆహారం అయితే ఒకేసారి విని దాని మరిచిపోవడం కాదు, దేవుని మాటలు మళ్ళీ మళ్ళీ ధ్యానము చేయాలి. మొదటి కీర్తనలో దావీదు చెప్పినట్టు యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అదే నెమరు వేయడం. ఒక్కసారి గొంతు నుండి లోపలికి వెళ్ళినాక దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే శక్తి ఈ పవిత్ర జంతువులకు మేకలకు ఎద్దులకు ఉంటది. కాని పందికి అది ఉండదు. అదొకసారి మింగిందంటే Out అది అటునుండి అటు బహిర్ భూమికి పోవాల్సిందేతప్ప అది మళ్ళీ వెనక్కి తెచ్చుకోదు. చాలామంది విశ్వాసులు కూడా అలాగే లేక క్రైస్తవులు అనబడ్డాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఏంటంటే, పోయిన ఆదివారం ఏమి చెప్పానంటే వాళ్ళకిప్పుడు గుర్తు ఉండదు. ప్రసంగం అంతా గంటా, రెండు గంటలు విన్నాకా Closing Prayer లో యిప్పుడు యింతనేపు ఏం చెప్పానంటే ఏమో సార్ బాగానే చెప్పారు గాని ఏమిచెప్పారో అని అంటారు. గనుక అతడు దేవునికి సజీవయాగంగా అర్పించుకోడానికి పనికి రాడు. అలాంటోళ్ళను పందులు అని మనం అవమానించొద్దు ఎందుకంటే అది దుర్మార్గమైన లక్షణం అయితే కాదుగాని నిర్లక్ష్యం. అటువంటి వాళ్ళందరూ Bad people, Evil people అని కాదు.
We need not to scold them or abuse them కానీ Childish అన్నమాట. Serious mind లేదు దేవుని వాక్యం మీద. వాడు సజీవయాగంగా పనికిరాడు. అయితే అసలు ఈ ఆజ్ఞలు ఎందుకు యిచ్చాడు అని అంటే ద్వీతీయోపదేశకాండము 8:2లో “మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి, నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు, నిన్ను అనుచు నిమిత్తము దేవుడు ఈ నలుబది సంవత్సరములు నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము తెచ్చుకొనుము”. దేవుడు పరీక్షించి ఒక సంగతి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. నీకు దేవుని ఆజ్ఞలు అంటే భయం ఉన్నదా? లేదా? లోబడాలి అనే చిత్తశుద్ధి, Commitment,నిబద్ధత ఉన్నదా? లేదా?, God wants to know this by testing you. దేవుని మాట నాకు అర్థమైనా లోబడతా అర్థం కాకపోయినా లోబడాతా, నచ్చినా నచ్చకపోయినా నేను లోబడుతాను అనే తత్వము, నైజము, స్వభావము నీకున్నదో లేదో ఎలా తెలుసుకోవాలి? కొన్ని ఆజ్ఞలు యిచ్చి తెలుసుకోవాలి. Primarily ఆజ్ఞలన్నిటికి వెనుక ఉన్న దేవుని Intention యిది. By-the- by పనిలో పనిగా దేవుడు కొన్ని ఆత్మీయ పాఠాలు కూడా నేర్పుతున్నాడు. గిట్టలు, నెమరు యిదంతా కూడా Second stage of Gods revelation. So, యిది అందుచేత క్రొత్త నిబంధనకు వచ్చినాక CEREMONIAL LAW అనేది లేదు. ఆహార విషయంలో మనకు నియమ నిబంధనలు లేవు. ఎవ్వరు ఏదైనా తివొచ్చు మనిషిని తప్ప. క్రొత్త నిబంధనలో ఆహారమును బట్టి మీరు హృదయం స్థిరపరచుకోవద్దు అంటాడు హెబ్రీ పత్రిక 13:9వ వచనంలో. దేవుని కృపను బట్టియే హృదయాన్ని స్థిరపరచుకొండి. ఆహారములను బట్టి ప్రవర్తించిన వారికి ఏ మేలు కలుగులేదు అని కూడా అంటాడు. So అది ప్రశ్నను గురించిన జవాబు.