-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: పది దినములు శ్రమ కలుగును అనేది అది దీర్ఘకాలము మరీ దీర్ఘాకాలముకాకుండా, మరీ తక్కువ కాకుండా కొంత సమయము నీకు శ్రమ కలుగుతుందని తీసుకోవాలి తప్ప దానికి ఆత్మీయ అర్థం ఏం మనం చెప్పలేం. చెప్పకూడదు. ఎందుకు అని అంటే అటువంటి విషయాలు మరి కొన్ని బైబిల్లో ఉన్నయి. ఏ వచనానికైన మనం ఒక వైఖరి అవలంబిస్తున్నాం అంటే దాన్ని Justify చేసుకోవాలి కదా! యిప్పుడు ఆ పది మంది రాజులు కృరమృగముతో కూడా ఒక “ఘడియ” అధికారం పొందుదురు. ఘడియ అంటే అంతనే టైమ్ అని అనుకోలేము కదా! తరువాత కొంచము కాలము వారు అధికారములో ఉండాలి అని అంటాడు. మరి ఎంత కాలము? గనుక అక్కడ ఆ time-period ఇంత length అనేది specify చేసి దాంట్లో ఆత్మీయ అర్థం వెతుక్కోవాల్సిన అవసరము లేదు. ఒకవేళ ఆ time period అదే specify చేసి దాంట్లోనే మనకు important message ఉంటే అదే phrase ఇంకోక చోట bible లో repeat అవుతుంది. కనీసం రెండు చోట్ల repeat అయినటువంటి statement గురించి మనం పట్టించుకోవాలి గాని ఒకటే చోట ఆ విధమైన పదజాలం కనబడి యింక లేఖనంలో ఎక్కడ కనబడలేదనుకోండి దాన్ని మనం అంత serious గా తీసుకోవద్దు.