-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: లౌకిక ఆత్మ అంటే యిప్పుడు ఒక subject మీద కొంతమంది మస్తిష్కాలు పనిచేసి, వాళ్ళ మెదడులు, వాళ్ళ ఆలోచనలు, భావజాల పరంపర అదంతాకూడ; ప్రతి మెదడు కూడ కొన్ని తరంగాలను వెదజల్లుతా ఉంటది. Every human brain is a transmitter కొన్ని భావ తరంగాలను, అది వెదజల్లుతా ఉంటుంది. అలాగే నేనిక్కడ కూర్చున్నాను నా మనస్సులో నుంచి భావ తరంగాలు మీ మనస్సులో నుంచి భావతరంగాలు ఒక రకమైన Ideology భావ సారుప్యం కలిగిన వారు పది మంది, వంద మంది, వెయ్యి మంది, లక్ష్య మంది కలిసి ఉన్నప్పుడు వీళ్ళందరి భావజాలాలన్నీ కలిసి ఉన్న తరువాత అక్కడొక ప్రత్యేక వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణమే ఒక spirit గా ఏర్పడి అక్కడికి వచ్చే ఒక క్రొత్త మనిషిని ప్రభావితం చేస్తుంది. This is the subject. This is the truth. నేను చెపుతున్నాను వినండి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు లేడు అనుకునే వాడు ఒకడున్నాడు నాస్తికుడు. ఇంకొకడున్నాడు. పది మంది, యాభై మంది, వంద మంది, వెయ్యి మంది తయారయ్యారు. ఈ నాస్తికులు వెయ్యి మంది కలిసి ఒకరితో ఒకరు comfortable గా ఉంటారు. ఎందుకంటే వీడనుకున్నది వాడనుకుంటాడు. అతడనుకున్నదే ఇతడనుకుంటాడు, ఈమె కూడా అనుకుంటుంది. ఒకరితో ఒకరు perfect agreement లో ఉన్నారు. అయితే వాళ్ళలో వాళ్ళకు ఆ భావాలన్నీ కలిసి అక్కడొక ప్రత్యేకమైన atmosphere ఏర్పడుతుంది. తరువాత దేవుని యందు భక్తి కలిగినవాడు ఒక్కడు అక్కడికి ప్రవేశిస్తే అక్కడ already create అయిన ఆ ఆత్మ వీడిని ప్రభావితం చేస్తుంది. అందుకే అపహాసకులతో కూర్చుండకూడదు. పాపుల మార్గమున నిలువకూడదు. దృష్టుల ఆలోచన చెప్పున నడువకూడదు అని అంటాడు. భక్తుడైన వాడు, భక్తిసాధన చేసేవాడు ఎవరితో associate అవుతున్నాడో అది జాగ్రత్తగా చూసుకోవాలి. So ఇది లౌకిక ఆత్మ. దేవుని ఆత్మ అంటేనేమో దేవుడు పైనుండి మనమీద కుమ్మరించే పరిశుద్ధాత్మ. అయితే ఈ లోకములో కూడ దేవ విరోధమైన ఆలోచనలు, మనుష్యులందరిలో ఉన్నందుచేత ఈ లోకానికే ఒక ఆత్మ ఉన్నది. అందుకే ఈ లోకమునుండి వేరై రక్షణపొందమన్నాడు. క్రైస్తవుడేంటంటే తన మనుగడకవసరమైనంత మేరకు లోకస్తులతో సహవాసం చెయ్యొచ్చు. ఉద్యోగం, వ్యాపారము, ఇంటి యిరుగు, పొరుగు వాళ్ళను Hello, చలో అనడం అంతేగానీ అంతకుమించి ఎక్కువ deep గా లోకస్తులతో సహవాసం చేయకూడదు. చేస్తే లౌకిక ఆత్మ వీనిమిదికి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు భక్తి హీనుల మధ్యలో ఒక మహా పరమ భక్తుడిని పెట్టామనుకోండి. పొద్దున్నుండి సాయంత్రం దాకా ఆ వెయ్యిమంది భక్తిహీనుల మధ్యలో ఈ పరమభక్తుడుంటే, పొద్దున్నుండి సాయంత్రం దాకా ఉంటే వాడుకూడా భక్తిహీనమైన మాటలు మాట్లాడడం మొదలు పెడతాడు. తనకే తెలీకుండా ఆ thoughts వచ్చేస్తాయి, ఆ మాటలు వచ్చేస్తాయి. “ఆ ఏముంది లే పరవాలేదు దేవుడంటే పెద్ద అంత serious ఏం కాదు”, అనే ఒక వైఖరి create అయిపోతుంది. So ఈ లోకంలో ఒక ఆత్మ ఉంది. దానికి మనం దూరంగా ఉండాలి అనేది అక్కడ పాఠం.