-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: బైబిల్ లో అలాగ చాలా వచనాలు విరుద్దంగా కనబడతాయి కానీ అవి విరుద్ధ వచనాలు కావు. They appear to be contradicting each other but they do not really contradict each other. They are two sides of the same coin. ఒక నాణానికి రెండు పక్కలలాగా ఒక సత్యానికి అటు, ఇటు వేరువేరు కోణాలవి. Its a beautiful question, unveiling beautiful truth. ఏమిటంటే “నీతిమంతునికి ఆపద సంభవించదు” అన్నాడు. “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు” అని కూడా 34వ కీర్తనలో చెప్పాడు దావీదు. మరిప్పుడు ఆపద సంభవించదు అనేది సత్యమా? అనేక ఆపదలు సంభవించును అనేది సత్యమా? అనంటే అక్కడొక అద్భుతమైన, సుందరమైన సత్యం ఉంది. ఏంటంటే, నీతిమంతునికి కలిగే పరిస్థితులు, ఆపద కాలంలో ఆపదలు, ఈ లోకపు దృక్కోణం నుండి ఆపదలుగా కనిపిస్తాయి గాని, ఆత్మసంబంధి యొక్క View Point నుండి, పరలోక సంబంధి, దేవుని ఆత్మ వశుడైన వ్యక్తి యొక్క దృక్కోణం నుండి అవి ఆపదలు కాదు అది కొలిమి. బంగారమును పుటము వేసే కొలిమి. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని అన్నాడు. శ్రమలకొలిమి అది. కొలిమిలో బంగారం వేయబడడము బంగారానికి మేలా? కీడా? ఒక బంగారాన్ని కొలిమిలో కంసాలి వాడు అగ్నితో దాన్ని మూసలో కరిగించాడు. దానికి కీడు చేస్తున్నాడా? ఆపద కాలం వచ్చిందని చెబుదామా? గనుక లోకం యొక్క దృష్టిలో చూసినప్పుడు యోబుకు ఆపద కలిగింది. కానీ యోబు ఏమంటాడు ఇలాగు నేను శోధింపబడిన తరువాత సువర్ణము వలె నేను ప్రకాశిస్తాను అంటాడు. అంతకముందు లేని ప్రకాశము తేజస్సు ఇప్పుడు వచ్చింది శ్రమలో నుండి బయటకు వచ్చాక. మరి ఆయనకు ఆపద వచ్చింది అందామా? లేకుంటే దేవుడు మేలు చేసాడు అందామా? గనుక ఆపదలు వస్తవి వాటిని మేలుగా దేవుడు మార్చేస్తాడు. మనకు ఆపద కలిగిందని లోకస్తులు అనుకుంటారు. సైతాను అనుకుంటాడు. సైతాను పరిపాలనలో ఉన్నోల్లకు అలా ఆపదని కనబడుతుంది. మనము నిజంగా దేవుని సంబంధులమైతే ఆహా! ఎంత అద్భుతమైన అవకాశము నాకు వచ్చింది నేను పరిశుద్ద పరచ బడడానికి, దేవుని కట్టడలు నేర్చుకోడానికి. “నేను నీ కట్టడలు నేర్చుకొనునట్లు శ్రమనొంది వుండుట నాకు మేలాయెను” అన్నాడు భక్తుడు. శ్రమను మేలుగా చూసేవాడే భక్తుడుగాని, శ్రమను ఆపద అనుకునే వాడు భక్తుడే కాడు. ఈ Lesson క్రైస్తవులందరూ నేర్చుకోవాలి. శ్రమవచ్చినప్పుడు ఇది నాకు మేలు జరుగుతుంది అని దృష్టి గలవాడే, ఆ ఆలోచన విధానం అలవర్చుకున్నోడే భక్తుడు, క్రైస్తవుడు. అంతేగాని చిన్నగా పరిస్థితి ఏదన్నా అనుకున్నట్టు జరుగలేదు, అనుకోని విధంగా ఆపదలు వచ్చి పడ్డాయి. “ఏంటి…? నాకిలాగా కీడు చేసాడు దేవుడు అని అనుకోవడము అది భక్తిహీనుని లక్షణమే కాని భక్తుని లక్షణం కాదు. గనుక అసలు పాస్టర్లు అందరు తమ విశ్వాసులకు సరైన ఆలోచన విధానం నేర్పించాలి”. “మీరు బాగుంటారు, మీకేం కష్టం రాదు” అనేది సరైన బోధ కాదు. కష్టాలు వచ్చినా దాన్ని మీరు కష్టం అనుకోకూడదు. ఇది నన్ను పరిశుద్ధ పరిచే కొలిమి, కంసాలివాని అగ్ని, ఇది నేను దేవుని కట్టడలు నేర్చుకోడానికి దేవుడు నన్ను ఉంచిన బడి అనుకోండి అని చెప్పినోడే Correct Pastor. లేకపోతే ఈ Prosperity preaching చేసే Pastorల దగ్గర ఎంతమంది పెరుగుతున్నారో అందరు ఈ మహాశ్రమల కాలంలో అబద్ధక్రీస్తు వచ్చినప్పుడు అడ్రస్ లేకుండా పొట్టు కాలిపోయినట్టు కాలిపోతారు. అందుకే మేము మొదటి నుండి కూడా చెబుతున్నాం పునాదులు సరిగ్గావేసి సంఘాలను కట్టండి అని. పునాదిలేని సంఘాలు కట్టొద్దు అని. Soశ్రమ అనగా అది ఆపద కాదు మేలు.