35. ప్రశ్న : అయితే ఈ పాటలను ఉద్దేశించి మీ దృష్టికి వచ్చే ఉంటుంది. కొందరు చెప్పారన్నమాట “నేను చనిపోదామనుకున్నాను. ఈ పాటలు విని నేను బ్రతికాను, విశ్వాసములో కొనసాగుతున్నాను” అని చెప్పినవాళ్ళలో విశ్వాసులు, సేవకులు ఉన్నారట కదా!

  1. అలాగే ఓసారి నేను హెబ్రోను కెళ్ళాను అక్కడ “జోన్” ఆంటి అని ఒక అమ్మగారు ఉండేవాడు. Full time సేవకురాలు. ఆ ఆంటిగారు Ophir babu ను పిలిపించు, పిలిపించు అని అంటే ఒకసారి వెళ్ళా. వెళ్ళి వాళ్ళ రూమ్లో కూర్చున్నప్పుడు Harmonium తెచ్చారు. పాడమనంటే కొన్ని పాటలు పాడాను. ఒకాయన White-suit, Tie కట్టుకొని వచ్చారు పెద్ద మనిషి వందనాలు అని చెప్పాను. Praise the Lord అని చెప్పాను. కూర్చో కూర్చో బాబు అన్నారు. ఆయన ఎవరు అన్నంటే సీయోను పాటలకు, సీయోను గీతములు అనే బుక్ కు ఆ పేరు రావడానికి కారణం, దాదాపు 100 వరకు సీయోను, సీయోను అనే పదంతో ఆరంభమయ్యే పాటలన్నీ వ్రాసింది ఆయనే. ఆయన పేరు B.J. Paul గారు అంతపెద్ద దైవజనుడు. “సీయోను పాటలు సంతోషముగ పాడుచు సీయోను వెళ్ళుదము” అదొకటి “. సీయోను పురమా సర్వోన్నతుని శృంగార పురమా” ఇవన్నీ ఆ అయ్యగారు వ్రాసినవే. ఆయన వస్తే నాకు కాళ్ళు, చేతులు ఆడడం లేదు. చాలా పెద్దవాడు దైవజనుడు. అభిషక్తుడు. ఓఫీర్ వచ్చాడని విని నేనొచ్చాను చూడడానికి, అన్నారు. నేను మీకు తెలుసా అంటే, “తెలీడం ఏంటి బాబు, ఒక పరిస్థితిలో నేను చనిపోతానేమో అనుకున్నాను నీ పాట నన్ను బ్రతికించింది నాయనా”. అని ఈ పాటలు చెప్పారన్నమాట. అప్పటికి ఇంకా నేను “నీ వాక్యమే శ్రమకొలిమిలో” వ్రాయలేదు. “మేలాయేను ప్రభు” పాట నన్ను బ్రతికించింది బాబు అని అన్నారు. అట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. వాళ్ళ పాటలతో నేను బ్రతికేసాను అని నేను అనుకుంటుంటే, నా పాటే బ్రతికించిందని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళ పాటను వాడుకొని, నా పాటను వాడుకొని భాదితులను బ్రతికించినాడు. గానీ అలాంటి మధురమైన అనుభవాలైతే కొన్ని ఉన్నాయి.