(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అవి రెండు ప్రశ్నలు, అవి పాపము ఉన్నదా అనేది వేరు, మరణం ఉన్నదా అనేది వేరు. పాపం అయితే ఉన్నది. ఎందుకంటే ఆదాము హవ్వలు సృష్టించబడక ముందే ఈ భూమి మీద అంతకుముందు ఉన్నటువంటి ప్రపంచము, అంతకముందు ఉండే సృష్టి జాలము, జీవజాలము ఎలా ఉండేదో మనకు తెలీదు కాని దేవుడీ భూమిని ముందు చేసినప్పుడు దీనిని ఆయన నివాసయోగ్యముగా సృష్టించాడు. ఆయన దీనిని నిరాకారముగా సృష్టింపలేదు అని యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో చెబుతాడు. అందుచేత నివాసయోగ్యముగా ఉన్నది అంటే నివాసులు ఉన్నట్లే లెక్క ఒక యెడారికి పోయి ఇల్లు కట్టేసి వచ్చేసి ఊరికేనే సరదాగా కట్టేసామండి. ఎవడు ఉండడానికి కాదు అని అంటే ఎలా ఉంటది? ఒక మానవుడే అలాంటి పిచ్చిపనులు చేయడు. ఎడారిలో ఒక ఇల్లు కట్టా? ఎందుకు కట్టావంటే నేను Civil Engineerను నాకు ఇల్లు కట్టడం వచ్చు అని చూపించుకోడానికి కట్టాను ఎవడు ఉండటానికి కాదు అని అంటే వీడు తప్పకుండా Mental Hospital నుండి పారిపోయినోడై ఉంటాడు. Engineer అయి ఉండొచ్చు Using his talent, ability just without any use అలాంటి పని దేవుడు చేయడు. నివాసయోగ్యము అంటే అక్కడ నివాసులు ఉన్నారు. తరువాత అతడు పాతాళములోనికి పోయిన దినమున, నేను అగాధజలములు భూమిని కమ్మజేసితిని అని మనకు యెహెజ్కెయేలు 31వ అధ్యాయంలో చెబుతాడు. గనుక నివాసయోగ్యముగా భూమి చేయబడింది. లూసీఫరు పడిపోయినప్పుడు భూమి మీద ప్రళయం వచ్చింది. ఆ తరువాత మళ్ళీ పునఃనిర్మాణము, పునఃసృష్టి కార్యక్రమమే ఆదికాండము మొదటి అధ్యాయంలో ఉంది. అందుచేత పాపం అనేదైతే ఉంది. ఆదాము పుట్టకముందే పాపము ఉంది. ఆ పాపము ఎవరి ద్వారా వచ్చిందో, ఆ పాప పురుషుడు, ఆదిమహాఘటసర్పము వాడు ఈ పవిత్రమైన, నూతన జాతి, మానవ జాతిని కూడా పాపంలో వాడు పడేసి, వాడు తన grip లోకి తెచ్చుకున్నాడు. కాని మరణమనేది అంతకుముందు లేదు. That is the speciality of mankind. ఈ విషయం కూడా నేను విశ్వచరిత్రలో వ్రాసాను. దయచేసి ఈ సందర్భంగా ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికి పృచ్చకులకు అంటే ప్రశ్నించువారికి అందరికి నేను చేసే మనవి ఏంటంటే దయచేసి నా పుస్తకాలు చదవండి. ఇప్పుడు పుస్తకాలుచదవరు కాని జ్ఞానము రావాలంటే ఎలాగు వస్తది? రాదు. తప్పకుండా నా పుస్తకాలు మీరు చదవాల్సిందే. ఇప్పుడూ విశ్వచరిత్రలో ఈ విషయం చెప్పాను. మహిమ ప్రపంచంలో చెప్పాను. ఇప్పుడూ ఇది చాలా పెద్ద subject అంతకుముందు ఉన్నటువంటి దేవదూతల లేక మహిమ ప్రపంచాల్లో ఉండే ఆ యొక్క జాతులు, రకరకాల జాతులు మధ్యలో రక్షకుడు అవతరించలేదు. only భూమి మీదనే రక్షకుడు అవతరించాడు. ఎందుకంటే భూమి మీద యజ్ఞము జరగాలి యజ్ఞము జరగాలంటే అది మరణము. మరణమనేది ఇతర గ్రహాలలో, ఇతర జాతుల్లో అసంభవము గనుక అక్కడ యజ్ఞము జరుగదు. ఆదాము, హవ్వలను దేవుడు చేసినప్పుడు He created them with the possibility of dying. Possibility of death. Death was made possible for mankind not for angel. ఎలాగనంటే చెట్టు ఉన్నది. చెట్టు నరుకుతాము మళ్ళా కొమ్ములు మొలుచుకొస్తయి. చెట్టు చచ్చిపోదు. అలాగే దేవదూతలు. కానీ మనిషిని అడ్డంగా నరికితే వాడు అయిపోయ్యాడు. ఎందుకంటే వాని ప్రాణం అంతా కూడా రక్తము అనే ఒక ఎర్రని ద్రవము మీద కూర్చొని ఉన్నది. రక్తమే ప్రాణము రక్తమే దేహామునకు ప్రాణాధారము అని బైబిల్ చెప్తుంది. దేవదూతలకు రక్తం ఉండదు. వాళ్ళ శరీరం మొత్తం life energy అనేడి నిండి ఉంటుంది. గనుక ఎక్కడన్నా నరికితే అది మళ్ళా మొలుచు కొస్తుంది. బల్లికి తోక మొలచుకొచ్చినట్టు వాడు చచ్చిపోడు. చచ్చిపోనటువంటి జాతిలో రక్షకుడు, ఆదిసంభూతుడు, అవతరిస్తే ఆయన చచ్చిపోకుండా అట్లే ఉంటాడు. గనుక విశ్వరక్షణ విమోచన కొరకు విశ్వపౌరులందరిని దేవునితో సమాధాన పరచాలని వాళ్ళకు బదులుగా తన ప్రాణమును అర్పించిన ఒక యజ్ఞ పురుషుడు కావాలి. యజ్ఞము జరగాలంటే మరణించడానికి అవకాశమున్న జాతి ఒకటి ఉండాలి. ఆ జాతిని దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు గనుకనే భూమి సృష్టించబడుట అనగా యజ్ఞ వేదిక నిర్మించబడుట అవుతుంది. అందుకే ఈ భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలందరు వచ్చి జయధ్వనులు చేసారని యోబు గ్రంథం చెబుతుంది . 38వ అధ్యాయంలో భూమిని చేస్తే అంతకుముందు కోటానుకోట్ల గ్రహాలు ఉన్నాయి. వీళ్ళకు అంత సంతోషమెందుకు? క్రొత్త గ్రహాన్ని చేస్తే ఎన్నో ఉన్నాయిగా. ఎక్కడ జరగని ఒక మహాద్భుతం ఇక్కడ జరుగుతుంది. యజ్ఞం జరుగుతుంది. యజ్ఞ వేదిక దేవుడు కట్టినప్పుడు భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు వచ్చి ఆనందగానాలు ఆనంద జయధ్వనులు చేసారు. ఎవరి కోరకైతే ఏ యజ్ఞపురుషుడు, విరాట్పురుషుడు కొరకైతే ఈ యజ్ఞ వేదికను దేవుడు చేసాడో ఆయన జన్మించినప్పుడు బెత్లహేముకు మళ్ళీ ఆ దేవదూతలు వచ్చి, గాన ప్రతిగానాలు, స్తుతిగానాలు చేసారు. దేవదూతలు భూమికి పునాది వేసినప్పుడు ఆనందించారు. రక్షకుడు పుట్టినప్పుడు ఆనందించారు. అంటే ఈ రెండిటికి లింక్ ఉంది. గనుక మరణమనేది లేదు కాని పాపం అనేది ఉంది.