(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: పండులో జ్ఞానం ఉండదు. కానీ అక్కడ విషయం ఏమిటంటే విధేయత అనేదానికి పెట్టిన పరీక్ష అది. అసలు ఇతడు నా మాట వింటాడా? లేదా? అనేది. గనుక అక్కడేంటంటే దేవుడు ఆ రెండు కూడా సాదృశ్యరూపకమైనటువంటి చెట్లే. అసలు జీవవృక్షం అంటే అది మామూలు చెట్టు కాదది. ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే వాడు నశింపడు నిత్యజీవం పొందుతాడు అని అన్నాడు. ఆ పండు తింటే అదే ఎఫెక్ట్ వస్తుంది అని ఉంది. అంటే ఆ జీవవృక్షం ప్రభువైన యేసుకు సాదృశ్యము యేసు యొక్క మరొక రూపం అనికూడ మనము చెప్పుకోవచ్చు. అందుకే ఆ జీవవృక్షాన్ని దేవుడు పరదైసుకు transport చేసాడు. ఈ విషయం నేను ఇంతకుముందు చెప్తే ఎవడో ఒకడు బుద్ధిలేని చవట ఒకడు దానిమీద comment వ్రాసాడు. transport ఏమిటి రా అని ఏదో నన్ను దూషించి ఒక మాట వ్రాసాడు. వృక్షమును భూమి మీద నుండి అక్కడికి transport చేయడం ఏమిటీ అని నన్నేదో చెడ్డ మాట అన్నాడు. వాన్ని వెధవన్నరవెధవ అని నేను అంటున్న. ఎందుకంటే హిందూ పురాణాలలోకూడా పారిజాతాన్ని స్వర్గం నుండి ఇక్కడికి తెచ్చినట్టు ఉన్నది మరి. “పారిజాతాపహరణము” అని ఒక కథ ఉంది. శ్రీ కృష్ణుడు తన భార్య కోరితే స్వర్గానికి వెళ్ళి పారిజాతం అనే వృక్షాన్ని తెచ్చాడు అని. అంటే మరి ఆ లోకం నుండి చెట్టు ఈ లోకం వచ్చిందనే కథేమో నీకు కమ్మగా ఉన్నది. ఈ భూమ్మీది చెట్టు అక్కడికి పోయిందంటేనేమో వాడికది పిచ్చి కథలాగా కనబడుతుంది. వాడు ముందు పిచ్చోడు. సకల పురాణములు, ఉపనిషత్తులు, వేదములు కలబోసి సత్యమేంటో చెరుకుగడ రసం పిండి తీసుకున్నట్టుగా తీసుకొని అసలు స్పష్టమైనటువంటి Idealogy గలిగిందే OPHIRISM. గనుక శిష్యునికి తగిన మనస్సుతో మనము ముందుకు రావాలి తప్ప వాడే గురువనుకొనివస్తే అట్లాగే మూతులు పగులుతాయి. గనుక ఇక్కడ ఈ జీవవృక్షము అనేది నిత్యజీవమునకు కారణభూతుడైన నిత్యజీవప్రదాతయైన యేసుకు మరొక రూపము. గనుక జల ప్రళయంలోగాని, అంతకుముందు గాని అది నశింపకుండా దేవుడు దానిని పరదైసుకు Shift చేసాడు. జయించువారికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తానన్నాడు.
ఇకపోతే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము ఏమిటంటే దాన్ని తినాలి అంటే దేవుని ఆజ్ఞకు అవిధేయుడు కావాలి. దేవుని ఆజ్ఞకు అవిధేయుడు కావాలి అంటే ఇంకొకని ఆలోచనకు విధేయుడు కావాలి. ఆ ఇంకొకని ఆలోచన తీసుకోవడమే ఒక విధంగా మరణాన్ని ఆహ్వానించటం. దాన్ని తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అయినా తింటునన్నాడంటే దానికి ప్రోత్సాహించిన వాడెవడో ఒకడు ఉండి ఉండాలి. గనుక ఆ వృక్షము దేవ విరోధి యొక్క ఆలోచనకు లోబడే ఆదాము ఆ పండు తింటే మంచి చెడ్డల తెలివి మాత్రమే వస్తుంది. మంచి ఇదని తెలుస్తుంది గానీ చేసే బలము ఉండదు. ఇది చెడు అని తెలుస్తుంది గానీ మానేసే శక్తి ఉండదు. గనుక Man Miserable గా మారిపోతాడు. మానవుడు, అందుచేత ఆ పండులోపల తెలివిఉన్నదని కాదు, తెలివిని మాత్రమే ఇచ్చి మంచిని చేసే శక్తిని ఇవ్వలేనటువంటి ఒక దుష్టశక్తి ఆధీనంలోకి వెళతాడు ఆ పండు తినడము ద్వారా. That is the actual scenario there. ఆ పండు తింటున్నాడంటే దేవవిరోధి యొక్క ఆలోచన ప్రకారమే అది జరగాలి. సొంతగా అయితే ఆదాము చెయ్యడు ఆ పని. అది పండు తినడం ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆదాము? ఏది మంచో, ఏది చెడో చెప్పగలిగిన వాడు దుష్టుడు. కాని చెడు మానే శక్తి ఇవ్వలేడు. మంచి చేసే శక్తి ఇవ్వలేడు. వాని Grip లోనికి వెళ్ళిపోతున్నాడు. That’s what will happen. అందుకే ఇదంతా చెప్పకుండా అది తింటున్నావంటే మంచేదో చెడేదో తెలుస్తుంది. ఎవరి ద్వారా? వాడు నిన్ను grip లోకి తీసుకోవడం ద్వారా అని అర్థము. ఈ జీవ వృక్షంలో ఉండే beauty ఏంటంటే ఇది తింటే కూడా మంచి అని తెలుస్తుంది. చెడు అని తెలుస్తుంది. ఇది మంచి, అని తెలుసు అది చేసే శక్తి ఉంటుంది ఇది చెడు అని తెలుసు అది మానేసే శక్తి ఉంటుంది. అంటే యేసే వాని లోపల తన ప్రాణాన్ని ప్రతిష్టిస్తాడు అందుచేత అది safe అన్నమాట.