(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: దాని విషయం అసలు అది ప్రశ్నేకాదు. అది ఆదివారము ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేనే మరియ. వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఆయనకు లేపనము, సుగంధద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు, అనేది సంగతి. అది ఆదివారం కావడం తప్ప ఇంకొకటి కావడానికి వీళ్ళేదు. లూకా 23:54 వ వచనంలో “ఆ దినము సిద్ధపరచుదినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. యేసుప్రభును సమాధి చేసిన దినము సిద్ధపరచు దినము. ఆయన మరణించినప్పుడు పొద్దుగుంకే సమయం అయింది గనుక విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. యూదుల ఆచారం ప్రకారం Day అనేది సూర్య అస్తమయంలో ప్రారంభం అవుతుంది. Friday సూర్య అస్తమయం అయినప్పుడు “సాయంత్రం 6 గంటలకు శనివారం మొదలవుతుంది. శనివారం సాయంత్రం 6గంటలకు ఆదివారం మొదలవుతుంది. అదీ యూదుల పద్ధతి. అయితే విశ్రాంతిదిన ఆరంభం కావచ్చెను. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు కాబట్టి లూకా 24:55, 56” అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి”. విశ్రాంతిదిన ఆరంభం అయినప్పుడు విశ్రాంతిదినానికి ముందు సిద్ధపరచే రోజున యేసయ్య సిలువ వేయబడ్డాడు. మరణించాడు ఆయన్ని సమాధిలో పెట్టినాక విశ్రాంతిదినం ఏం పనిచేయలేం కాబట్టి, వారు తీరికగా ఉన్నారు. తెల్లవారిన తరువాత ఆదివారము, విశ్రాంతిదినము తరువాత వచ్చేది ఆదివారమే కదా! సోమవారం అయితే కాదు కదా! విశ్రాంతిదినమున తీరికగా ఉన్నారు విశ్రాంతి దినం అంటే మనకు లేఖనాల ప్రకారం శనివారమే. శనివారం తరువాత వచ్చేది ఆదివారమే గానీ సోమ, మంగళవారం కాదు కదా! అక్కడ ఆదివారం అని ఎందుకు రాసాడంటే it goes by common sense. విశ్రాంతి దినమున తీరికగా ఉండి, సోమవారమున వారు వెళ్ళారా మరి? గనుక ఇదొక్కటే కాదు చాలా Evidences ఉన్నాయి. అది అనవసరమైనటువంటి ఒక వివాదము. Good Friday, శనివారము, Easter Sunday సాంప్రదాయము Perfect గా లేఖన ప్రకారం. దాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు. మరొక విషయం చెబుతున్నా, ఈ Good Friday శనివారం పునరుత్థాన దినం ఆదివారము (Easter Sunday) అనేది దీన్ని Accurate గా మనం నమ్మితేనే రక్షణ పొందుతామనే Rule కూడా బైబిల్ లో లేదు. నీవు యేసు రక్తాన్ని నమ్మినందుకు రక్షణ పొందుతావు. యేసు రక్తంలో కడగబడినందుకు రక్షణ పొందుతావు గాని Good Friday, Good Saturday, Easter Sunday correct గా పాటిస్తేనే పరలోకానికి వెళ్తావు అనేది లేదు. అవన్నీ పాటించి కూడా చాలామంది నరకానికి వెళ్తారు, యేసురక్తంలో కడగబడనందు చేత. So, నా కర్థమైనంత వరకు సిద్ధపరచే దినం యేసు ప్రభు మరణించాడు. విశ్రాంతి దినాన తీరికగా ఉన్నారు. Following day is Sunday not any other day అదీ విషయం.