44. ప్రశ్న : మత్తయి సువార్త 5:29 “నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీ యొద్దనుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ, నీ ఆవయువములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా!” కుడికన్ను, కుడిచెయ్యి అభ్యంతర పరచడం ఏంటి? దేహంలో కుడికన్ను, ఎడమకన్ను అంటూ ఏం ఉండదు కదా! రెండు కళ్ళు అభ్యంతర పరుస్తాయి. కుడిచెయ్యి, ఎడమచెయ్యి అని ఉండదు కదా రెండు కళ్ళు కలిసే ప్రయత్నం చేస్తాయి గదా?