(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: భర్త చనిపోతే బొట్టు పెట్టరు కదా. ఉన్న బొట్టే తొలగిస్తారు. మరణ సమయములలో జరిగేటటువంటి తంతు అనేది ఆధ్యాత్మికము మాత్రమే కాదు. అందులో చాలా భాగం సామాజికం. ఇప్పుడు తండ్రి చచ్చిపోతే అబ్బాయి గుండు కొట్టుకోవాలి అంటారు. లేకుంటే ప్రదక్షణలు చేసి చితి ముట్టించి కుండ పగలకొట్టాలి అంటారు. ఇప్పుడు ఆ చచ్చిపోయినవాడు దేవుని రక్తములో కడుగబడి దేవుని కృప పొంది రక్షణ పొంది చచ్చిపోతే పరదైసుకెళ్తాడు. లేదా దేవునితో సమాధానము లేకుండానే సువార్తను వ్యతిరేకించి, క్రీస్తును ద్వేషించి, విరాట్ పురుషుని యొక్క యజ్ఞమును కూడా తృణీకరించి నాకక్కరలేదని మూర్ఖంగా అవిశ్వాసంతో జీవిస్తే వాడు ఎంత మంచివాడైన సరే అగ్నిగుండానికే వెళ్తాడు. ఆ వెళ్ళిపోయినవాడు ఎక్కడికి వెళ్ళాడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం కుండ పగలకొట్టినందుకు చుట్టు తిరిగినందుకు, తిరగకుండా ఉన్నందుకు వాడు పరదైసు నుండి పాతాళానికి పోడు. పాతాళం నుండి పరదైసురాడు. Already ఆ చనిపోయినవాడి కొడుకు రక్షణ పొంది క్రీస్తు రక్తప్రభావంలో నూతన జన్మనెత్తి ద్విజుడు అయిపోయినాడు అనుకో, భూసురుడు అయిపోయినాడు. ఈ భూసురత్వము – దేవుని కుమారత్వం అంతా ఆ కుండ పగలగొట్టగానే Wipe out గాదు. రక్షణ అనేది అంత బలహీనం కాదు. ఆయన చనిపోయినందుకు బంధువులు అందరు వచ్చి దుఖఃపడుతున్నారు. ఏం కర్మ కాండ చేయాలో చూడండి. చేయండి నేనేమి ఆరాధన చేయను. పూజలు చేయను. మంత్రాలు చదవను. నా మనస్సు involve కాదు. ఏదో ఇంటికి పెద్ద కొడుకునిగా పుట్టినందుకు ఏం చేయాలో చెప్పండని, చేసి ఆ ప్రక్కకు వెళ్లి మోకరించి ప్రార్థన చేస్తే, ఆ దృశ్యము చూసిన వాళ్ళందరూ, రేపు అతని నోట సువార్త వినడానికి ఇష్టపడే అవకాశం ఉంది. అతని ధర్మము వేరు. క్రీస్తును అంగీకరించాడు. అయినా మనకు సహకరించాడు. అంటే వాళ్ళు మతమౌఢ్యం కలిగినవారు కారు. విశాల హృదయులు అని వాళ్ళందరి హృదయాల్లో సువార్తకు ద్వారం తెరువబడుతుంది. సామాజికంగా అందరు మామయ్యలు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నీలు, అన్నదమ్ములు, cousins అందరు కలిసి వచ్చి ఆ చచ్చిపోయినవాన్ని మట్టి చేయాల్సిందే. అంత్యక్రియలు దహిస్తారో, ఖననమో, దహనమో ఏదో ఒకటి. దానికి మనం సహకరిస్తే తప్పేమ్ లేదు. ఎందుకంటే, ఆ ఆత్మను మనం మోక్షానికి కాని, నరకానికి కాని ఈ కర్మకాండతో పంపలేము. వాడు రక్తమును తృణీకరించినప్పుడే వాడి internal fate seal అయిపోయింది. గనుక ఈ మరణ సమయాలలో మనము అనవసరంగా వితండ వాదము చేసి భీష్మించుకోకుండా అందరు దుఃఖంలో ఉంటారు గనుక మనము మన ప్రతాపం చూపాల్సిన సమయం అదికాదు. ఏదో సరే చేయండి సార్ అని చేసేసి అందరిని ఆదరిస్తే రేపు సువార్త చేస్తే వినే అవకాశం ఉంది.