(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నిస్సందేహంగా పాలుపొందవచ్చు. ఎలాంటి అభ్యంతరము లేదు. స్త్రీలకు ఋతు ధర్మము, నెలజబ్బు వచ్చినప్పుడు అది వాళ్ళు చేసిన పాపం కాదు. ప్రకృతిలో అది సహజంగా జరిగే ఒక చక్రము. “ఆమె పాపం చేసినందుకు బహిష్టి అవుతుంది, పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటే బహిష్ఠి కాదు” అనేదేమీ లేదు కదా! దేవుడు ఆత్మశద్ధి కోరుకుంటున్నాడు. ఋతు ధర్మం సమయంలోను, ఋతు ధర్మం జరగని సమయంలోను ఏకరీతిగా స్త్రీ పరిశద్ధురాలు. ఆమె యేసురాక్తాన్ని బట్టి పరిశుద్దురాలే. గానీ ఈ దేహంలో పరిస్థితిని బట్టి కాదు. ఇబ్బందేమీ లేదు దీనిని గూర్చిన ఆజ్ఞ పాతనిబంధనలో ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. గానీ యేసు ప్రభు యజ్ఞము జరిగిన తరువాత క్రొత్తనిబంధనలో ఋతుధర్మమును గూర్చి ఎక్కడ వ్రాయబడలేదు. యేసయ్య చెప్పలేదు, అపొస్తలులు చెప్పలేదు. స్త్రీ ఋతుమతి అయినప్పుడు, ఋతు ధర్మం నడుస్తున్నప్పుడు ఆమె కడగా ఉండవలెను. బహిష్ఠ అయి ఆమె దూరముగా ఉండాలి అనే సంగతి పాతనిబంధనలో ఉన్నది తప్ప, క్రొత్త నిబంధన క్రమములో, సిద్దాంతములో ఆ మాట మన రక్షకుడైన యేసుగాని, అపోస్తులులు గాని చెప్పలేదు. గనుక క్రొత్తనిబంధన క్రైస్తవులకు అసలు ఆ Subject ఏ లేదు, Topic ఏ లేదు మనకు.