48. ప్రశ్న : వెయ్యేండ్ల కాలంలో చనిపోయినవారి భక్తుల ఆత్మలు ఎక్కడ పెట్టబడతాయి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మొట్టమొదట వెయ్యి సంవత్సరాల పరిపాలన కాలంలో మరణం అనేది ఇంకా జరుగుతూనే ఉంటుంది. కానీ అది బహు అరుదు. పాపాత్ములై శాపగ్రస్తులైనవారు సహితము నూరు సంవత్సరాలు బ్రతుకుతారని బైబిల్ చెప్తుంది. వాడు చాలా చెడ్డవాడు, శాపగ్రస్తుడు, బాలుడు మరీ చిన్నోడండి. నిన్న మెన్నటి వాడే అప్పుడే చచ్చిపోయాడేంటీ అని చెప్పుకోవాలంటే వాడు వంద ఏళ్ళకు చచ్చాడన్నమాట. జలప్రళయానికి ముందు ఎలాగైతే మనుషులు ఒక్కొకడు 1000, 800 ఏళ్ళు బ్రతికారో అలాంటి Long life, long span of life ఉంటుంది. వెయ్యేళ్ళ రాజ్యంలో క్రీస్తు ప్రభు పరిపాలనలో గనుక చచ్చిపోయేవాళ్ళు కొన్ని వందల్లో ఉండొచ్చు.  అదొక విషయం. మరణం అనేది అరుదుగా జరుగుతుంది. ఇప్పుడున్నట్టు జరుగదు. Accidental deaths ఉండవు.  Death because of sickness ఉండదు. రోగముతో చనిపోవుట, ఒకరినొకరు చంపుకొనుట ఇట్లాంటి మరణాలు ఉండవు. ఒక్కొకరు 400, 500, 800 ఏళ్ళు బ్రతుకుతుంటారు. ఆ కొద్ది మందైనా సరే, వాళ్ళు మొత్తం అందరూ కూడా బ్రతికి ఉన్నవాళ్ళు – చచ్చిపోయిన వాళ్ళు పోగా బ్రతికి ఉన్నవారు ఎవరైతే వెయ్యి ఏండ్ల పరిపాలన ముగింపు వరకు బ్రతికి ఉంటారో వాళ్ళలో Almost 100కు 100% ఈ అగాధం, చెరనుంచి సాతాను ఘటసర్పం విడిపించబడ్డాక వాడు మళ్ళీ భూలోకమంతా తిరిగి వీళ్ళను మోసం చేస్తే, ఈ వెయ్యి ఏండ్ల పాటు క్రీస్తు నీతిని, మంచితనాన్ని, ప్రేమను జ్ఞానాన్ని Perfection ని చూసిన భూనివాసులు మొత్తం ఒకటై క్రీస్తు మీద తిరుగుబాటుకు వస్తారు. అంటే వాళ్ళు నూతనముగా జన్మించకుండానే క్రీస్తు నీతి పరిపాలనను చూసారు. గనుక పైనుంచి యుద్ధం ఏం జరుగదు. అగ్ని దిగివచ్చి వారిని దహించి వేస్తుంది అంటే వీల్లందరు కూడా యేసు నీతి పరిపాలనను, నిజమైన దేవుని మహిమను చూసారు తప్ప ఆ మహిమలో నిత్యం ఉండడానికి నూతన జన్మను పొందలేదు. కొంత మంది దేవుని శేషము ప్రతి తరములో ఉంటుంది అని పౌలు చెప్తాడు. శేషముగా ఉండడానికి ఎవరో ఇద్దరు, ముగ్గురు రక్షణ పొందొచ్చు తప్ప అందుకే Almost అన్నాను.  నేను ఇంతకు ముందు Almost 100% అని శేషముగా ఉండడానికి ప్రతి తరము నుంచి కొంతమంది అక్కడ ఉంటారు.  కానీ దాదాపు 99.99% వెయ్యేండ్ల రాజ్యంలో ఉన్నవారందరు తిరుగుబాటుదారులే. అందరు నాశనమైపోతారు గనుక రక్షణ పొందకుండ నూతన జన్మ పొందకుండానే నీతి పాఠాలు వింటున్న వాళ్ళందరూ ఏ తరములోనైన పోవాల్సింది పాతాళానికే గనుక వాళ్ళు అక్కడికే పోతారు. ఏ ఒక్కడైన చచ్చిపోయిన వాడు ఆ శేషానికి చెందినవాడై ఉంటే, వాడు పరదైసుకు వెళ్తాడు. అంటే ఆ కాలంలో చచ్చిన వారందరు పరదైసుకే, పాతాళానికే అని చెప్పలేం. It may vary from person to person. వాళ్ళు నిజంగా మారుమనస్సు పొందితే ఎప్పుడైనా పరదైసుకు వెళ్తారు. మారుమనస్సు లేకుండానే నీతులు మాట్లాడేవారు ఎవరైనా ఉంటే, నూతన జన్మ పొందకుండానే, దైవజ్ఞానం ఉందని చెప్పుకునేవారు వారు ఈ తరములోనైన, వెయ్యేండ్ల రాజ్యంలోనైన వెళ్లాల్సింది పాతాళానికే.

ప్రశ్న : అంటే పరదైసులో ఉన్న ఆత్మలను రెండవ రాకడలో  తీసుకొచ్చి వివాహము చేసుకున్న తరువాత ఆ పరదైసు అలాగే ఉంటుందా?

జవాబు : పరదైసు అలాగే ఉంటుంది. మృతుల లోకము, పాతాళము మరణము అగ్ని గుండంలో పడవేయబడెను అని ప్రకటన 20: 14 లో ఉంది. కానీ పరదైసు నాశనం అయ్యే పరిస్థితి లేదు.