(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మన శరీరములోని ఏ భాగమునైన మనము ఉపయోగముకాకుండా దాన్ని నిరుపయోగంగా Damage చేసుకునే అధికారం మనకు లేదు. మన శరీరాన్ని దేవుడు నిర్మించినాడు. శరీరము దేవుని ఆలయం. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడుచేస్తే దేవుడు వాన్ని పాడు చేస్తాడు. గనుక ఇప్పుడు నపుంసకుడు అంటే పునరుత్పత్తి అవయువము ఒక పురుషునిలో ఉన్నటువంటి, పురుష మర్మ అవయవాన్ని ఖండించి దేహంలో లేకుండా తీసి అవతల పారేయడం. అంటే ఇక మీదట వానికి జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి. అంతే తప్ప Reproductive system అనేది ఉండదు. వాడు స్త్రీతో సంగమించలేడు. పిల్లల్ని కనలేడు. పుంసత్వము లేనివాడు అంటే పురుషత్వము లేనివాడు – నపుంసకుడు. ఇలాగ జన్మముతోనే కొంతమంది పుడతారు అంటాడు. By birth physically handicapper అంటున్నాం. ఇప్పుడు ఆ మాట అనడానికి ఇష్టపడడం లేదు. Physically Challenged అంటున్నారు. దివ్యాంగులు అంటున్నారు. మాట ఏదైనా అర్ధం ఏంటంటే ఏదో ఒక ముఖ్యమైన అవయవం పనిచేయకుండా ఉంది. పుట్టుకతోనే ఒకరికి కళ్ళు ఉండవు – పుట్టు గ్రుడ్డివాడు. పుట్టుకతో ఒకడు చెవిటివాడు, మూగవాడు. ఒక కాలు, చెయ్యి ఉండదు ఇది అంగవైకల్యం. పుట్టుకతో కొన్ని ముఖ్యమైన అవయవాలు లేకుండా పుట్టడం ఎలా ఉందో ఈ పురుషాంగం అనేది అసలు ఆ సామర్థ్యమే లేకుండా కొంతమంది పుట్టుకతోనే శరీర నిర్మాణంలోనే వాడికా శక్తి ఉండదు. ఆ అవయవాలే ఉండవు. కొంతమందికి ఉన్నా పనిచేయవు. కొంతమందికి అది పుట్టుకతో నపుంసకత్వం. కొంతమంది మనుషుల చేత చేయబడ్డవారు ఉన్నారు. వారికి ఇష్టం లేకున్నా ఎత్తుకుపోయి చేసేవారు కూడా ఉంటారు. అది యేసుప్రభువారు చెప్పారు. కొంతమంది తమ్మును తాము చేసుకొని ఈ మధ్య Transgenders అని బాగా వినబడుతుంది. పుట్టుకతో వాళ్లు మగ పిల్లలుగానే ఎంచబడ్డారు. తరువాత Mind అంతా కూడ నేను ఆడపిల్లనైతే బావుండు అనే ఆ ఉద్దేశ్యంలో ఉంటూ Surgery చేసుకొని పురుష అవయవం తొలగించేసుకొని ఇంక నేను ఒక స్త్రీని అని Feel అవుతూ ఆడవాళ్లలా బట్టలు కట్టుకొని అందులో Satisfaction పొందుతారు. కొంతమంది Voluntary గా ఇష్టపూర్వకంగా నపుంసకులైతారు. కొంతమందిని ఎవరో ఎత్తుకెళ్ళి బలవంతంగా చేస్తారు. కొంతమంది పుట్టుకతోనే Handicap అదొకటి ఉంటుంది. అయితే దేవుని రాజ్యము కొరకు తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నవారు కలరు. ఈ మాటలు అంగీకరించుటకు మనస్సుంటే అనుగ్రహము పొందినవారు తప్ప ఎవరు దీన్ని అంగీకరించలేరు అని అన్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, దేవుని రాజ్యము కొరకు ఏ భక్తుడైనా తనకు తాను ఆ damage చేసుకోవచ్చా? అంటే దానికి ఇంకో వచనం అడ్డం వస్తుంది. “దేహము దేవుని ఆలయము”. దేవుని ఆలయాన్ని పాడుచేస్తే దేవుడు వాడ్ని పాడు చేస్తాడు. గనుక దాన్ని అక్షరార్థంగా తీసుకోకూడదు. కాని అక్షరార్థంగా తీసుకోకుండానే నపుంసకులుగా ఎలా చేసుకుంటాము? అంటే రోమా 6:11, 13లో మంచి సమాధానం ఉంది. పౌలు భక్తుని ద్వారా “అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి”. రోమా 6:13లో “మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలోనుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అయువములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి” అని అంటాడు. అంటే ఎంచుకొనుట Counting yourself dead. for Example:ఒక అందమైన ఆకర్షణీయమైన Opposite sex person ఉన్నారు. (అమ్మాయి/అబ్బాయి) తప్పుచేయాలి అని బలమైన ఆలోచన గలిగినప్పుడు నేనెలా చేయగలను? నాకు ఆ అవయవాలే లేవుగా అనుకోవాలి. ఎంచుకొనుట Feel – teach yourself, tell yourself, brain wash yourself that you are really not capable of doing, committing that sin. అలాగ ఎంచుకొనుచూ మీరు మృతులుగా ఎంచుకొనుడి అంటే ఆత్మహత్య చేసుకోము కదా! నేను చచ్చిపోయాను అనుకోవాలి. ఇప్పుడు తప్పు చేయాలి అనిపిస్తుంది. చేసే వాడినేమో కాని ఇప్పుడు ఎలా చేయను? నేను చనిపోయాను గదా! అనుకోవాలి. నాలో ఆ అవయువమే చచ్చిపోయింది గదా! అనుకోవాలి. అలాగ మనలను మనము ఎప్పటికప్పుడు తప్పు చేయడం అనే అవకాశం వచ్చినప్పుడల్లా నేను చచ్చిపోయాను అని ఎంచుకోవడమే మనల్ని మనము నపుంసకులుగా చేసుకోవడం. అలాగ కొన్ని వందల,వేల సార్లు లక్షల సార్లు నేను పాపము చేయలేను, చేయకూడదు ఎందుకంటే నా వల్ల కాదు. Because those organs are not there in my body. అని ఎన్నో సార్లు అనుకున్నవాడే తన పరిశుద్ధతను కాపాడుకోగలుగుతాడు. ప్రభురాకడ సమయంలో ఎత్తబడగలుగుతాడు. అలాగే భక్తులందరు కూడా ఎవరైనా తప్పుచేసారనుకోండి తప్పు చేస్తే వాణ్ణి సమర్థించి, వ్యభిచారంలో దొరికాడు అనుకోండి ఆ…. చీము నెత్తురు ఉన్నవాడు, ఉప్పు కారం తినువాడు ఆ మాత్రం చేయడా? అనేవి పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఉప్పు కారం తిన్నవాడంటే భక్తసింగ్ గారు తినలేదా? సాధుసుందర్సింగ్, యేసుప్రభు వారు తినలేదా? మీరు లోకానికి ఉప్పుయి ఉన్నారంటే
ఆయనకు తెలుసు గదా ఉప్పు సంగతి. మరి ఐగుప్తులో యోసేపు తినలేదా? ఈ భక్తులందరికి లేదా? గనుక ఇదంతా కూడా వ్యర్థమైన ప్రేలాపన. ఉప్పు కారం తిన్నారు, చీము నెత్తురు ఉంది. వాళ్ళు ఆదాము పిల్లలే అయినా పరిశుద్ధత కాపాడుకున్నారు. ఎలా కాపాడుకున్నారు అంటే ఆ టైమ్ వచ్చేసారికి నేను చచ్చిపోయాను గదా అనుకున్నారు. నేను నపుంసకున్ని కదా, నాకు ఆ అవయువాలే లేవు అనుకున్నారు. గనుక ఆ ప్రేరేపణ చచ్చిపోయింది. ఒక secret ఇక్కడ చెప్పాలి. ఏంటంటే, ఆకలి దాహము ఎటువంటిదో ఈ Sexual drive అనేది, లైంగిక వాంఛ అనేది అటువంటిది కాదు. ఇది రెండు ఒక రకమే అని చెప్పడము humanists (అంటే మానవనైజమే సుప్రీమ్ అనే వాదన ఒకటుంది) వాళ్ళు చెప్పే మాట. తప్పది ఇప్పుడు ఆకలి ఉంది. అన్నం తింటే ఆకలి తీరుతుంది. లైంగిక వాంఛ మనం తీర్చిన కొద్దీ ఇంకా పెరుగుతుంది. దాన్ని చంపేయాలంటే ఒకటే మార్గం దాన్ని పట్టించుకోకుండా వదిలేయాలి. నువ్వు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది చచ్చిపోతుంది. దాని మీద దృష్టి పెట్టి దీన్ని ఎట్లా తీర్చుకోవాలి? పాపం అయ్యో నాక్కూడ చీము, నెత్తురు ఉంది గదా! నన్ను నేను Satisfy చేసుకోవాలి అని సానుభూతి చూపిన కొద్దీ, నీవు దాని మీద దృష్టి పెట్టి, దాని కొరకు ఏదైనా ఏర్పాటు చేసేకొద్ది, మంట మీద Petrol పోసినట్టు ఇంకా మండుతుంది. నిర్లక్ష్యం చేయాలి, దాన్ని పట్టించుకోవద్దు. అప్పుడే ఆ వాంఛ మనలో నుంచి చచ్చిపోయేది – మన పరిశుద్ధత నిలబడేది. గనుక పాపము విషయంలో కఠినమైన వైఖరి అవలంబించాలి. అది ఎవరైనా సరే లేదంటే పరిశుద్ధత అనేది మనకు అందని మావి అయిపోతుంది.