(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మహిమ ప్రపంచం గ్రంథం మరొకసారి చదవండి అని నా విజ్ఞప్తి. ఇంకో విజ్ఞప్తి ఏంటంటే, నేను రాసిన ఏ పుస్తకాన్ని, కూడా మీరు ఒక్కసారే చదివి, చదివేసామని అనుకోకండి. నేను రాసిందే కాదు, ఆత్మాభిషేకంతో ఏ భక్తుడు రాసిన గ్రంథాలైనా ఒకసారి చదివితే చదివినట్టు కాదు. నా పుస్తకాలు యుగాంతం ఒక వంద సార్లు చదివాను అన్న వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం 70 సార్లు చదివాను అన్న వాళ్ళు ఉన్నారు. నా పుస్తకాలు చాలామంది 10, 20, 50, 70, 100 సార్లు చదివినవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అంత గొప్ప గ్రంథాలు దేవుడు నా ద్వారా రాయించాడు అని అనుకుందామా? అంటే నేను కూడా Osward J. Smith గారు రాసిన “The Man God Uses” వంద సార్లు చదివాను. Leonard Raven Hill గారు రాసిన “Why Revival Tarries” వంద సార్ల కంటే ఎక్కువ చదివాను. అలాగే “The Imitation of Christ” అద్భుతమైన చిన్న పుస్తకము Powerful book-classic. అది కూడా నేను వందసార్లు కంటే ఎక్కువ చదివాను. చతుర్వేద సంహిత 70 సార్లు, బైబిల్ ని ఎప్పుడో వంద సార్లు దాటేసింది. దాని తరువాత number దేవుడు చెప్పుకోవద్దు. అక్కడ ఆగమన్నాడు తరువాత చాలా సార్లు చదివాను, నేనైనా ఏ పుస్తకం కూడా ఒక్కసారే చదివింది ఏది లేదు. కనీసం 20, 30, 40 సార్లు. ఖురాన్ షరీఫ్ 15 సార్లు చదివాను. దాన్ని Muslim సోదరులు ఒప్పుకోరు. మీరు Arabic లో చదివితేనే ఖురాన్. ఇది ఖురాన్ కాదు అని Pl. గారి translation చదివాను. The meaning of the holy Quran అది. 15 సార్లు చదివాను. గనుక ఏదైనా ఒక్కసారి చదివితే చదివినట్టు కాదు. పదేపదే చదవాలి. దాన్ని పారాయణం చేయాలి, ధ్యానం చేయాలి. అట్లాగే మరి నా పుస్తకాలు కూడా ఇప్పుడు చెప్పిన మహిమ ప్రపంచంలో “అక్కడ కుటుంబ సమాజమా లేక భక్త సమాజామా? అంటే Clear గా చెప్పాను. ఇప్పుడు ఒకటే Sentence లో దానికి సమాధానం చెప్తాను.
ఇప్పటి సంఘము యేసుని పెళ్ళి చేసుకున్న తరువాత అందులో ఒక్కొక్కరి పరిపక్వతను బట్టి ఆదాములాగా మరొక నూతన జాతికి మూల పురుషుడు కాగలడు, కావాలి అని దేవుడు ఎవరిని యోగ్యుడని ఎంచుతాడో అలాంటి వాళ్ళకు ఇంకో గ్రహం ఇచ్చి, ఇంకో హవ్వను ఇచ్చి మీరు దాన్ని నింపండి అని దేవుడు ఆ గ్రహాన్ని వాళ్ళ సంతానంతో నింపుతాడు. అక్కడ మళ్ళా ఘట్టసర్పం రాదు. ఏమి రాదు. అలాగ మహిమ ప్రపంచాలు నిర్మితం అవుతాయి. ప్రతి విశ్వాసి పట్ల దేవునికి వేరు వేరు సంకల్పం ఉంటుంది. ఇప్పటి భక్త సమాజంలోని కొందరు యోగ్యులైన భక్తుల వలన ఈ ప్రజాపతులు అన్నట్టు, మన హిందూ పురాణాలలో దక్షప్రజాపతి, కస్యప ప్రజాపతి ఇలాగా ప్రజాపతులు ఉంటారు. నవబ్రహ్మలు అని ఇదంతా concept ఎక్కడి నుండి వచ్చిందంటే, Original బ్రహ్మ కాకుండ మరి కొందరు బ్రహ్మలుండటం అనేది బైబిల్లో నేను యోహోవాను సెలవిచ్చుచున్నాను. మీరందరూ సర్వోన్నతుని కుమారులు మీరు దైవములు అని అంటాడు. గనుక ఆ Concept అంతా నేను మహిమ ప్రపంచంలో చెప్పాను. మనము యేసు ప్రభువు యొక్క భక్త సమాజము లేక వధువులో ఉంటామా? లేక మనము కుటుంబ మూలపురుషులం అవుతామా? అనేది వారి వారి Maturity ని బట్టి దేవుడు నిర్ణయిస్తాడు. అందరూ ఒక అంతస్థులో ఉండరు, అనేది అందరు గ్రహించాల్సిన విషయం. ఈ భూమి మీద ఎవరైనా రక్షణ పొందిన వారు ఎలా పొందుతారు అంటే క్రీస్తు ప్రభువును తమ హృదయంలో చేర్చుకొని యేసుప్రభువును విశ్వసించి, నమ్మి బాప్తిస్మము పొంది, రక్షణ పొందుతారు. అందరు అలాగే రక్షణ పొందుతారు కానీ అందరు అదే Height కి reach కారు. సాధు సుందర్ సింగ్ గారు ఉన్న Heightకు అసలు దశమ భాగమే ఎగ్గొట్టేవాడు ఎలా చేరుతాడు? వాళ్ళేమో మొత్తం పాణార్పణంగా పోయబడ్డారు. వీడేమో దేవునికి కానుక ఇవ్వడానికి ఏడుస్తాడు. ఆయన ఈయన సమానమా? భక్తులందరు ఒకే height లో ఉండరు. ఒకే మహిమ అంతస్తులో ఉండరు, అనేది ఖచ్చితంగా మనము గ్రహించాలి. అందులో నేనైతే ready గా ఉన్నాను. దేవుడు నన్ను ఆయన భార్యలో, వధువు సంఘంలో ఒక కణముగా ఒక అంగముగా చేరిస్తే చాలా సంతోషం. లేదురా బాబు నిన్ను ఇంతగా పెంచి నేను తర్పీదు నిచ్చాను, చెక్కాను, నీకో గ్రహం ఇస్తాను నువ్వో నూతన జాతికి మూలపురుషుడివి అవ్వు అంటే చిత్తం ప్రభువా అంటాను. ఉన్న కొడుకును బలివ్వమంటేనే చిత్తం ప్రభువా అన్న అబ్రహాము లాంటోడు క్రొత్త కొడుకును కనమంటే ఎందుకు వద్దంటాడు? గనుక ప్రభు చిత్తము. దేనికైనా ready గా ఉండాలి కానీ అందరు నూతన జాతులకు మూలపురుషులు కారు, selected few మాత్రమే అవుతారు.