(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు : ప్రప్రథమంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవులకు కష్టకాలం వస్తుందని మన రక్షకుడే భవిష్యత్ సంభవాలను గూర్చి ప్రవచించాడు. లోకంలో మనకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. బైబిల్ యొక్క ప్రవచనాలలో నెరవేరవలసిన ప్రవచనం ఒకటేంటంటే, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు శ్రమ కలుగుతుంది. గనుక మనం దానికి ఆశ్చర్య పోనక్కరలేదు. భారతదేశంలో అని మాత్రమే కాదు, క్రైస్తవుల యొక్క మైండ్సెట్ ఏంటంటే నేను సత్యమును నమ్మాను, అంతమాత్రాన గజమాల వేసి ఎవరూ నాకు సన్మానం చేయరు. ఈ లోకమును సత్యవిరోధ శక్తి అదృశ్యంగా ఉండి, పని చేస్తుంది, పాలిస్తుంది. గనుక శ్రమలు వస్తాయి. అయితే అంత్యకాలంలో వచ్చే మహా శ్రమలకు ముందుగా, సిద్ధపాటు చర్యగా యాంటీ కన్వర్షన్ బిల్ అంటే ప్రస్తుతం ఉన్న మతోన్మాద ప్రభుత్వం తీసుకొస్తుంది. యాక్చువల్గా గా వీళ్ళ జీవితాశయమే అది. ఒకప్పుడు జనసంఘ్ ఉండేది. ఆ జనసంఘ్ అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పొలిటికల్ వింగ్. ఆ జనసంఘ్ ని తీసుకెళ్లి జనతాపార్టీలోకి చేర్చారు, చేర్చిన తరువాత ఆర్.యస్.యస్. యొక్క పొలిటికల్ ఫేజ్ అయినటువంటి ఆ జనసంఘ్, జనతా
ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, ముక్కలు ముక్కలుగా చీలిపోయిన తరువాత, ఒకప్పుడు జనసంఘ్ గా ఉన్నటువంటి ఆర్.యస్.యస్. (సంఘ్ పరివార్) యొక్క పొలిటికల్ ఫేజ్గా ఉన్నటువంటి వింగ్, జనతా పార్టీ నుండి విడిపోయి భారతీయ జనతాపార్టీగా ఏర్పడ్డారు. స్వాతంత్య్రం రాకముందు నుంచే ఆర్.యస్.యస్. ఈ ఉద్దేశంతోనే పాటుపడుతూ పని చేస్తూ ఉంది. ఒకప్పుడు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్లను పలుమార్లు నిషేధించింది. ఎందుకంటే వీళ్ళు దేశ ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నారు. వీళ్ళు ఒక రకమైన తీవ్రవాదులు, ఉగ్రవాదులు అని నిషేధించారు. తరువాత అంటే ఇన్ని దశాబ్దాల పాటు అంటే 70 ఏళ్ళ పాటు 80 పాళ్ళపాటు వీళ్ళు కష్టపడి, కష్టపడి, ఏటికి ఎదురిది ఇవాళ వాళ్ళు దేశాన్ని సొంత బలం మీద, సొంత మెజారిటీ మీద పరిపాలిస్తున్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన తపస్సు ఏంటంటే భారతదేశం నుండి క్రైస్తవ్యాన్ని పారద్రోలాలి అనేదే వాళ్ళ ఏకసూత్ర కార్యక్రమం. హిందుత్వం, హిందుత్వం అంటారు. హిందుత్వం అంటే వాళ్ళ లోపల ఉన్న డిఫినేషన్, అర్థం ఏంటంటే యాంటీ క్రైస్తత్వం. యేసుప్రభువు వారికి వ్యతిరేకతే హిందుత్వం. ఇంకా నీవు ఏ మతం అయినా గానీ, మాలోపల మాకెన్ని సిద్ధాంత బేధాలయినా ఉండనీ, కానీ యేసు అంటే వారికి గిట్టదు. ఈ భావజాలం కలిగిన వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు. కష్టపడి, 7 నుండి 8 దశాబ్దాలు కష్టపడి వాళ్ళు అధికారంలోకి వచ్చిందే క్రైస్తవ మతవ్యాప్తిని అడ్డుకోవాలని, అరికట్టాలని. క్రైస్తత్వ మతాన్ని భారతదేశంలో లేకుండా తుడిచిపెట్టాలి. నేపాల్ లాగా ఇండియాను కూడా హిందు రాజ్యంగా చేయాలని వాళ్ళు కలలు కంటున్నారు. ఇంతకుముందొక సారి కూడా జంతర్ పార్టీలో భాగంగా ఉంటున్న రోజుల్లో జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోక్ సభలో బిల్ కూడా ప్రవేశపెట్టారు ఓం ప్రకాష్ త్యాగి గారు. తరువాత అది వీగిపోయింది. ఎందుకంటే నీలం సంజీవరెడ్డి గారు సంతకం చేయలేదు. తరువాత మళ్ళీ దాన్ని అరుణాచల్ ప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ జరిగాయి. గనుక భారతదేశంలో యేసు మార్గం, యేసు ప్రభువు పేరే లేకుండా తుడిచిపెట్టాలనేదే వారికున్న ఉద్దేశ్యం. గనుక తప్పకుండా ఇది చేస్తారు. చేయరనేది లేదు. అయితే ఏ బైబిల్ అయితే క్రైస్తవులకు ఇలాంటి శ్రమలు వస్తాయని చెప్పిందో అదే బైబిల్ గ్రంథం ఇంకో ప్రవచనం కూడా చెప్పింది. ఈ శ్రమల కాలం లేక సువార్తకు వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా క్రైస్తవ్యం వ్యాప్తి చెందుతుంది. గొప్ప ఉజ్జీవం వస్తుంది అని ఇది కూడా బైబిల్ చెప్పింది. ప్రకటన 7 : 9 లో మీరు చూస్తే, ఆ శ్రమల కాలంలో ఎవడునులెక్కింప శక్యం కానంత మహా ప్రజాసమూహం రక్షణ పొందుతుంది అని, కూడా బైబిల్ చెప్పింది. కాబట్టి క్రైస్తవులందరు గమనించాలి. క్రైస్తవులెవ్వరూ భయపడకండి. ఇప్పుడున్నటువంటి మతోన్మాద పరిపాలక శక్తులన్ని కూడా సువార్తను ఆపడానికి వారికి చేతనైనన్ని ఆటంకాలు వారు సృష్టిస్తారు. అధికారం వారి చేతిలో ఉంది కాబట్టి. కానీ ఇంతకు ముందు ఈ మతోన్మాదుల అధికారంలోకి రాకముందు జరిగిన దాని కంటే 100 రెట్లు అధికంగా సువార్త వ్యాపిస్తుంది. అనేక కోట్లమంది రక్షణ పొందుతారు. ఇది జరుగబోతున్న సత్యం. శ్రమలు రావడం బైబిల్ ప్రవచనమే. ఆ శ్రమలలో కోట్ల మంది రక్షణ పొందడం బైబిల్ ప్రవచనమే. కాబట్టి మీరెవ్వరు భయపడవనవసరం లేదు. ఈ మతోన్మాదులు వాళ్ళకు చేతనయినది వాళ్ళు చేస్తారు. పైన ఉన్న సత్యదేవుడు, క్రైస్తవులు నముకున్న సృష్టికర్తయైన దేవుడు తనకు చేతనయింది తాను చేస్తాడు. ఇది ఖాయం. ఎవ్వరూ భయపడొద్దు. అందరూ ఎక్సైటెడ్గా రాబోతున్న ఉజ్జీవాన్ని చూడడానికి ఎదురు చూస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ ఈచ్వన్ ఆఫ్ యు. ఇది ఆధ్యాత్మిక విషయం.
సామాజిక విషయానికి వస్తే మనం భారతీయ పౌరులం, మనం రాజ్యాంగ బద్దంగా ఓటు వేసి గెలిపించి, గద్దెనెక్కించిన ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని విస్మరించి, రాజ్యాంగ ప్రకారం కాకుండా పాలన చేసినప్పుడు గానీ, బిల్లులు ఆమోదించినప్పుడు గానీ, ఓటు వేసి, గెలిపించిన పౌరులందరు అది క్రైస్తవులే కాదు, ఎవరైనా తప్పును సామరస్యపూర్వకంగా ఎదిరిస్తాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమించే వారందరూ కూడా ప్రభుత్వం తప్పుదారి పడితే, శాంతియుతంగా మన స్వరాన్ని వినబడజేస్తాము. ఇది తప్పని, మేము ఒప్పుకోవడం లేదని తెలియజేస్తాము. దానికి చట్టసభలు ఉన్నాయి. న్యాయస్థానం ఉన్నది. రాజ్యాంగాన్ని నిర్వహించడానికి మనకు కోర్టులున్నాయి. ప్రభుత్వాలు తప్పు దారి పట్టినప్పుడు మనం కోర్టులో కేసు వేసి సరైన దారిలో పెట్టొచ్చు.