(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: చాలా మంచి ప్రశ్న. ఇది సమకాలీన ప్రాముఖ్యత కలిగిన ప్రశ్న (కాంటెంపరరీ ఇంపార్టన్స్ గల క్వశ్చన్. నేను చెప్పే విషయాలు చాలా శ్రద్దగా తెలుసుకోవాలి. మొట్టమొదటి విషయం ఉద్యోగంలో ఉన్నవారు మేము క్రైస్తవులమని డిక్లేర్ చేసుకోవడం కష్టం కదా అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదు. నేను సకల జనులకు తెలియజేప్పేది ఏమిటంటే, ఒక యస్.సి. కులానికి చెందిన వ్యక్తిగా ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం గానీ, ప్రభుత్వ భాగస్వామ్యం కలిగిన ఒక సంస్థలో గానీ ఉద్యోగం వస్తే, అపాయింట్మెంట్ సమయంలో మాల-హిందూ లేదా మాదిగ-హిందూ అని కులం యొక్క కాలమ్లో మతం యొక్క కాలమ్లలో, మాల అయితే మాల-హిందు లేదా మాదిగ అయితే మాదిగ-హిందూ అని రాయాలి. ఎందుకనగా క్రిస్టియన్ అని రాయడానికి వీలు లేదు. క్రిస్టియన్ అయితే కులం లేదు గనుక కులం అనేది హిందూ మతంలో, హిందూ సంస్కృతిలో భాగం గనుక మాల, లేదా మాదిగ అని కులం తెలిపినప్పుడు తప్పకుండా అక్కడ మతం యొక్క కాలమ్లో హిందూ అనే రాయవలసి వస్తుంది. కాబట్టి మాల-హిందు లేదా మాదిగ-హిందు అని వ్రాసే ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. తరువాత మేము ఇప్పటి నుండి క్రైస్తవులము అని చెప్పుకుంటే వాళ్ళ ఉద్యోగాలను వ్యర్ధం చేయడం ఉండదు. సకల జనులు ఇది తెలుసుకోండి.
నాకు ఉద్యోగంలో, అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు నేను హిందు విశ్వాసంలో ఉన్నాను. తరువాత నేను యేసును గురించి తెలుసుకున్నాను. కాబట్టి భారతీయులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును బట్టి ఇక నుంచి నేను యేసును అంగీకరించడానికి, యేసును ఆరాధించడానికి తీర్మానించుకున్నాను. అని చెబితే వాళ్ళు ఇంటికి పంపరు. ఆ తరువాత ప్రమోషన్లలో ఇబ్బంది పెడతారేమో కానీ, ఉన్న ఉద్యోగం పోదు. నా శిష్యులు కొంత మంది చేత ఆ పని చేయించాను కూడా. బి. హెచ్.ఇ.ఎల్.లో, ఈ.సి.ఐ.లోలో సెక్రటేరియట్లో జాబ్ చేస్తున్న వాళ్ళ చేత ఒక అఫిడవిట్ చేయించి డిపార్ట్మెంట్ హెడ్కు, గవర్నమెంట్కు పంపించాను. వాళ్ళు క్రైస్తవులుగా చెలామణి అవుతున్నారు. ఆన్ రికార్డులో మారిపోయింది. రెండవ విషయం: సర్టిఫికెట్లో మాల-హిందు లేక మాదిగ-హిందు అని ఉన్నంత మాత్రాన యేసు పరలోక రాజ్యానికి రానివ్వడు అనేది సరియైన అభిప్రాయం కాదు. ఎందుకంటే మాల, మాదిగ, షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ అనేది ఒక సామాజిక అంశమే గానీ, అది ఆధ్యాత్మిక అంశము కాదు.
సమాజంలో ఒక వ్యక్తి మాల కులంలోనో, మాదిగ కులంలోనో, యస్.టి. గానో, బి.సి.గానో పుట్టాడు. ఆ వ్యక్తి పుట్టినప్పటి నుండి ఏ వివక్ష అనుభవిస్తూ వచ్చాడో, లేక అణచివేతకు గురి అవుతూ వచ్చాడో, దాన్ని బట్టి అతనికి కొన్ని సౌకర్యాలు, రాయితీలు, (కంసెషన్), రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో ఇచ్చారు. ఎప్పుడైతే యేసును సమ్ముతాడో ఈ వివక్ష అంతా పోదుగదా! యేసును నమ్మినా, సరే అంతకు ముందు నీచంగానే చూసారు. ఇప్పుడు కూడా నీచంగానే చూడబడతాడు. ఇది సామాజిక అంశం. మతం మార్చుకున్నా సరే కులం మారదు అనేది సుప్రీంకోర్టు యొక్క తీర్పు కూడా ఉంది. కాబట్టి యేసు ప్రభువు వారికి ఇది ఇష్యూకాదు. నీవు ప్రభుత్వ రికార్డులలో హిందువుగా రాసుకొని యేసుప్రభువును నమ్ముకున్న తరువాత వెంటనే రికార్డులో మార్చుకోకుండా హిందువుగా ఎందుకు కంటిన్యూ అవుతున్నావ్ అనే ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే...
దీని వెనుక మన భారతదేశ పెద్దలు, పరిపాలకవర్గం చేసిన అతి పెద్ద కుట్ర ఉన్నది. అదేమిటంటే మన దేశంలో మాల, మాదిగ అయిన వారు హిందూ మతంలో నుండి సిక్కు మతంలోకి వెళ్ళినా, జైన మతంలోకి వెళ్ళినా, బౌద్ధమతంలోకి వెళ్ళినా, ఇస్లాంలోకి వెళ్ళినా నీ యొక్క యస్.సి., మాల, మాదిగ కులం మార్చుకోమని ఎవరడగరు. నీ రిజర్వేషన్కు ఏ ప్రమాదం లేదు. కానీ ఒక్క యేసుమతంలోకి వెళితేనే నీ మతం రికార్డులో మార్చుకున్నావా? నీ సర్టిఫికెట్ చేంజ్ చేసుకున్నావా? అని అడగడం, నీ రిజర్వేషన్ తీసివేయబడతుందనడం మన చట్టంలో, మన రాజ్యాంగంలో పొందుపర్చడం వెనుకనే చాలా పెద్ద కుట్ర ఉన్నది. గనుక ముల్లును, ముల్లుతోనే
తీయాలి. అసలు నా మత విశ్వాసంతో ప్రభుత్వానికి సంబంధం ఏమున్నది? నేను రోజుకో మతం నమ్ముతాను నేను ఏ మతాన్ని నమ్ముతున్నానేది ప్రభుత్వానికి ఎందుకు? ప్రభుత్వానికి ఎంతమంది ఏ మతాన్ని నమ్ముతున్నారు. ఎంత ఎక్కువ మంది ఏ మతాన్ని నమ్ముతున్నారు. ఎంత తక్కువ మంది ఏ మతాన్ని నమ్ముతున్నారు అనేది కాదు సమస్య. సరైన రోడ్లు లేవు అనేది ప్రభుత్వ సమస్య. తాగు నీరు, సాగు నీరు, విద్య లేదు, వైద్యం లేదు, అత్యాచారాలు పెరిగిపోతున్నవి, నేరాలు పెరిగిపోతున్నవి, శాస్త్రీయ విద్యావిధానం లేదు. ఇవి ప్రభుత్వానికి ఉండాల్సిన సమస్య, పట్టింపు, శాస్త్రీయ విద్యావిధానం గురించి ఆలోచించరు. నిరుద్యోగ సమస్యను గురించి ఆలోచించరు. మహిళలపై అత్యాచారాలను గురించి ఆలోచించరు. డ్రైనేజి సమస్య, వైద్యం సరిగా లేదు, ధరలు పెరిగిపోతున్నాయి. ద్రవ్వోల్బణం సమస్య లేదు. వీటి గురించి పట్టింపు లేదు ఆలోచన లేదు. కాబట్టి ఇదంతా కూడా తెలివి తక్కువ ధోరణి, తెలివితక్కువ పరిపాలన. వీళ్ళు అనేక సమస్యలను వదిలిపెట్టి దీని మీద ఎందుకు పడ్డారంటే వీరు సత్యవిరోధులు. వీరు న్యాయవంతులు కాదు. అన్యాయంగా ఒక వ్యవస్థ (సిస్టమ్)ను సృష్టించినప్పుడు ముల్లును, ముల్లుతోనే తీయాలి. మీరు యస్.సి.లు (మాల, మాదిగ) అయితే ఏ మతంలోకి అయినా వెళ్ళోచ్చు. కానీ క్రీస్తు మతంలోకి (క్రిస్టియానిటీ లోకి) మాత్రం వెళ్ళొద్దు అని చెప్పడము పరమదుర్మార్గమైన, నీచమైన ధోరణి. కాబట్టి దానికి విరుగుడుగా యేసును నమ్ముకున్న తరువాత కూడా యస్.సి., మాల-హిందు, యస్.సి.-మాదిగ-హిందు అనే కొనసాగనివ్వండి యేసును ఆరాధించుకోవాలి.
యస్.సి. మాల-హిందు అయితే యేసును ఆరాధించవద్దని రాజ్యాంగంలో ఎక్కడ ఉంది. యస్.సి. మాల-హిందు, మాదిగ-హిందు అయినతే ఆ వ్యక్తి హిందూ దేవాలయాలకు వెళ్ళితే వద్దనడానికి నీవెవరు దర్గాకు వెళ్ళొద్దని అనడానికి నీవెవరు?చర్చికి వెళ్లొద్దనడానికి నీవెవరు? అది ప్రభుత్వం పని కాదు. నీవు చర్చికి వెళ్ళినప్పుడు నీకు క్రిస్టయన్ సర్టిఫికెట్ ఉన్నదా? అని గవర్నమెంట్ అడగడానికి అవకాశం లేదు. సాధ్యం కాదు. యస్.సి., సోదరులందరికి నేను చెప్తున్నాను. రికార్డులో మీ గురించి ఏమైనా ఉండనివ్వండి. యస్.సి. మాల-హిందు అని అయినా, యస్.సి మాదిగ-హిందూ అని అయినా ఏదైనా ఉండనివ్వండి మీరు యేసును ఆరాధించండి. కులం అనేది సామాజిక అంతస్తు. అదంతా మీరు అనుభవించిన వివక్ష, అణిచివేత. అది రికార్డులో ఉండనివ్వండి. మీకు యేసయ్య మీద ఇష్టం ఉంటే చర్చికి వెళ్ళండి వద్దనడానికి ఏ ప్రభుత్వానికి హక్కులేదు. అధికారం లేదు. ఇది అధ్యాత్మికం, మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. సర్టిఫికెట్లో ఏమైనా ఉంచు కోండి. మీ మనసులో మీరెవరికైనా ప్రార్ధన చేయండి. అడగడానికి ప్రభుత్వానికి హక్కులేదు. చెప్పడానికి మీకు
అవసరం లేదు. మతం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి బలవంతం ఉండకూడదు.