54. ప్రశ్న : శ్రీశైలం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు గల దేవస్థానాల సమీపంలో క్రైస్తవుల shops ఉండొద్దు, క్రైస్తవులు వ్యాపారం చేయొద్దు వెళ్లిపోవాలి అనే నినాదం తీసుకొచ్చారు. దీనికి మీ స్పందన ఏమిటి సార్ ?

-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు
జవాబు: గుణదల మేరీ మాతా పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ Shops ఉండి వ్యాపారం చేస్తున్న వాళ్లు అందరు క్రైస్తవులేనా కాదు కదా! హిందువులు కూడా ఉన్నారు. ఇదంతా ఒక అజ్ఞానం, ఒకరకమైన ద్వేషంతో కూడుకున్న ప్రచారం. ఇందులో న్యాయం లేదు. వ్యాపారం అంటే ఎవరైనా చేసుకోవచ్చు. క్రైస్తవులయితేనేం, ముస్లిములయితేనేం. నేను ప్రశ్నిస్తున్నా ఒక నాస్తికుడే కూర్చుని వ్యాపారం చేసుకుంటున్నాడు. అసలు క్రీస్తులేడు, అల్లాహ్ లేడు, రాముడు లేడు, శ్రీశైలం లేదు, ఏమిలేదు, అసలు దేవుడే లేడు, దేవుడనేదే ఒక Trash అనే నాస్తికుడే కూర్చుంటాడు. అతన్ని దుకాణం పెట్టుకోనివ్వరా? ఇలా క్రైస్తవులు Shops పెట్టొద్దు, హిందూ దేవాలయాల దగ్గర వ్యాపారం చేయొద్దు అనేది ఒక చుప్పనాతి బుద్ధి.

ఇంకొక మాట కూడా అంటున్నారు. టి.టి.డి.లో కానీ, శ్రీశైలంలో గానీ Executive role లో వేరే మతస్థులు ఉండొద్దు అని. ఇక్కడ ఒక Technical Point ఉన్నది. అదేమిటంటే శ్రీశైలంలో గానీ, టి.టి.డి.లో గానీ Executive Committee ఏదైతే ఉన్నదో అందులో పని చేసేవారు ప్రభుత్వ ఉద్యోగులు. వారికి ప్రభుత్వం జీతాలిస్తుంది ఎందుకంటే విస్తారమైన జనం వస్తారు గనుక వారి నిర్వహణ విధులు వీళ్లు చేపడుతారు. ప్రభుత్వం అనేది అన్ని మతాలకు చెందినది. ఒక మతానికి చెందినది కాదు. కాబట్టి ఆ Board లో పనిచేయడానికి నియమించే ఉద్యోగులను ఆ దేవత మీద నీకు విశ్వాసం ఉందా? ఆ మతాన్ని నమ్ముతున్నావా? అని అడిగి ప్రభుత్వుం ఉద్యోగంలో నియమించరు. జీతాలిస్తుంది కాబట్టి నియమిస్తుంది. ఒక పోలీసు శాఖలో ఉన్న వాన్ని ఏ మతస్తున్నైనా, ఏ ప్రాంతానికైనా వేస్తారు. అలాగే వీళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి మతాన్ని బట్టి నియమించండి అనేది అంతా అన్యాయం, మోసం. ఇదంతా సంఘ పరివార్ వాళ్ళ యొక్క మతోన్మాద భావజాలం. ఇదంతా సంకుచిత మనస్తత్వం.
క్రైస్తవ దేవాలయాల దగ్గర, ముస్లిం దర్గాల దగ్గర కూడా హిందువులు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అసలు క్రైస్తవులు ఏమనుకుంటారంటే మా దేవాలయం దగ్గర, పుణ్యక్షేత్రాల దగ్గర, క్రైస్తవులే కాకుండా ఇంకాఇతర మతస్థులు వస్తే, వ్యాపారం చేసుకుంటే సంతోషిస్తారు. ఎందుకంటే ఈ విధంగానైనా మా దేవుని మాటలు, తెలుసుకుంటాడేమో, మాదేవుని ప్రేమను తెలుసుకుంటాడేమో, ఇక్కడ జరిగే అద్భుతాలను చూసి రక్షణలోకి వస్తాడేమో అని సంతోషంగా ఆహ్వనిస్తారు. గానీ వీళ్ళు ఎందుకు తిరస్కరిస్తున్నారు. క్రైస్తవుడు గానీ, ముస్లిమ్గా నీ వ్యాపారం చేసుకుంటూ వాళ్ల దేవుని మీద విశ్వాసం పెరిగి, భక్తి పెరిగి, ఆ దేవుని భక్తుడు అయిపోతాడని ఎందుకు అనుకోరు? అంటే అలా జరగదు అని వారికి కూడా తెలుసు. ఎప్పటికైనా Conversion అయితే మనవాళ్లు అక్కడ వెళ్తారు గానీ, అక్కడవాళ్లు మన విశ్వాసంలోకి రారు. అని ఈ మతోన్మాద భావజాలం కలిగిన వారికి ఆ నమ్మకం అన్నమాట. కాబట్టి ఇదంతా ద్వేషంతో చేస్తున్నకార్యక్రమం. Conversion హిందు నుండి క్రైస్తవ్యంలోకి జరుగుతుందనే భయంతో కూడిన కార్యక్రమం.