(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: వేయ్యేండ్ల పరిపాలనలో భూమి మీద ఉండే పౌరులు వేరు. వెయ్యేండ్ల పరిపాలనలో అదివరకే రక్షణ పొంది, మహిమ శరీరాలు ధరించి యేసయ్యతో పెండ్లి కూడా జరిగిపోయిన వధువు సంఘము, విమోచించబడిన శరీరాలతో ఉన్న భక్త సమాజం వేరు. బాగా గమనించాలి. వేయ్యేండ్ల పరిపాలన ప్రారంభం కాకముందో, వధువు సంఘం తయారయిపోయింది. యేసయ్య ప్రక్కన పట్టపు రాణిగా సింహసనం ఎక్కిన తరువాత వాళ్లు వేయ్యేండ్ల పరిపాలనలో పౌరులు కారు. ఈ 6 వేల యేండ్ల భక్త సమాజం వెయ్యేండ్ల పాలనలో పౌరులు కారు. వాళ్లు పట్టపురాణి. ఇది ప్రతి ఒక్కరి మనస్సులో స్పష్టంగా ఉండనివ్వండి. ఆదాము మొదలుకొని, కడబూర ధ్వనించే దాకా ఆ తరువాత ఇశ్రాయేలు సమాజంలో నుండి కూడా వచ్చిన భక్తులందరు కలిస్తే వాళ్లు పట్టపురాణి, వధువు సంఘం. యేసు అనే మహారాజు ప్రక్కన కూర్చునే వధువు సంఘమే కానీ భూమి మీద పౌరులు కారు. భూమి మీద పౌరులు ఎవరంటే మామూలుగానే ఇంక మట్టి శరీరంతోనే ఉండి. ఆ అర్మెగిద్దోను యుద్ధం తర్వాత కూడా బ్రతికి (Survive) ఉన్నవారు భూమి మీద పౌరులు. వాళ్లు మళ్ళీ పిల్లల్ని కని భూమిని నిండిస్తారు. వాళ్లకు ఇలాంటి శరీరాలే ఉంటాయి. కానీ మహిమ శరీరాలు ఉండవు. వాళ్లకు మరణం ఉంటుంది. అకాల మరణాలు ఉండవు. గానీ నిండు నూరేళ్లు బ్రతికి చచ్చిపోతుంటారు. నూరేళ్ల కంటే ఎక్కువ బ్రతికే వాళ్లు అధిక శాతం ఉంటారు. గనుక భక్తులందరూ వెయ్యేండ్ల పాలనలో ఉంటారా? అంటే ఉంటారు. వాళ్లు యేసుప్రభువు యొక్క భార్య గనుక వాళ్లు ఉంటారు. కానీ వాళ్లు భూమి మీద పౌరులు కాదు పరిపాలన చేసే రాణి. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించండి. మామూలు మట్టిదేహంతో ఉండే మనుషులు యేసు ప్రభువు రెండవ రాకడ తరువాత వాళ్లు మళ్ళీ పిల్లల్ని కని భూమిని నిండిస్తారు. ఆ తరువాత మళ్ళీ వాళ్లు నీతి రాజు మీద తిరగబడతారు. అదీ విషయం.