56. ప్రశ్న: దేవుడు సర్వజ్ఞాని కదా, మరి దేవుడు ఒక మనిషిని పుట్టించిన తరువాత వాడు అన్యుడిగా ఉండి దేవున్ని గ్రహించకుంటే వాడు సరకానికి వెళ్తాడు అని దేవునికి ముందే తెలిసినప్పుడు వాణ్ణి పుట్టించి, బ్రతికించి, నరకములో వేయడం కంటే పుట్టించకుండా ఉండడమే మంచిది కదా! మరి ఇలా ఎందుకు జరుగుతుంది? సమాధానం ఇవ్వగలరు.

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఈ ప్రశ్న అడుగుతున్న వారెవరో గానీ వారు దేవుడు నా చేత వ్రాయించిన “యాకోబు దేవుడు” అనే గ్రంథాన్ని తప్పక చదవాలని నా యొక్క అభ్యర్ధన. దీన్ని ఏమంటారంటే The Doctrine of Predestination, అంటారు. దేవుని యొక్క భవిష్యద్ నిర్ణయాల సిద్ధాంతం అంటారు. పిల్లలింక పుట్టి వాళ్లింకా కీడైనా, మేలైనా చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించెను, ఏశావును ద్వేషించెను. ఇంకా పిల్లలు పుట్టనేలేదు, వాళ్లు మంచి చేయనే లేదు, చెడుచేయనేలేదు వాళ్లు ఇంకా Entity లేనే లేదు. కానీ దేవుడు పుట్టబోతున్న ఒకనిపై మనస్సులో కోపం పెట్టుకున్నాడు, ఒకనిపై ప్రేమ పెంచుకున్నాడు. ఇది ఎంతవరకు న్యాయమూ? ఎంతవరకు సమంజసమూ? దేవుడు అనేవాడు అలా చేయొచ్చునా?
అసలు పుట్టి చెడు చేసిన వారిని ప్రేమించిన అంటాడు. పుట్టిన తరువాత పౌలు లాగా నేను ప్రధానపాపిని, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అనే వాన్ని ప్రేమించాను అంటాడు దేవుడు, అలాంటి వారిని, మనల్ని కూడా ప్రేమించుమని చెప్తాడు. మరి పుట్టనే, పుట్టని వాన్ని ఎలా ప్రేమించాడు మరి ఇంకా పుట్టనే పుట్టలేని వాన్ని ద్వేషించడమేమిటి. అనే Point కు “యాకోబు దేవుడు” అనే గ్రంథంలో వ్రాసాను. అక్కడ విషయమేంటంటే పుట్టిన తర్వాత మనుషులు ఎలా తయారవుతారో, సువార్త వాళ్లకు చెప్పబడినప్పుడు ఏలాగు ప్రతిస్పందిస్తారో, వాళ్లకు (Accountability age) లెక్క అప్పజెప్పవలసిన వయస్సు వచ్చినప్పుడు ఎవరైనా సువార్తను ప్రకటిస్తే వాళ్లు ఎలా ప్రతిస్పందిస్తారో దానిని దేవుడు కాలంలో ముందుకు వెళ్లి చూస్తాడు. చూసి శహభాష్ ఇతడు న్యాయంగా నా సువార్తను గురించి ఆలోచిస్తున్నాడు గనుక ఎలాగైన రక్షణ పొందుతాడు గనుక నేను ఇప్పటినుంచే ఇతన్ని ప్రేమిస్తాను. అనుకుంటాడు కొంతమంది ఎన్ని చెప్పినా లాజిక్ లేకుండా అడ్డంగా మాట్లాడి అలాగే వ్యతిరేకంచే వారిని కూడా దేవుడు అలాగే కాలంలో ముందుకు వెళ్లి వారి యొక్క వితండవాదాన్ని దేవుడు చూస్తాడు. ఓహో ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఇతడు రక్షణలోకి రాడు అని దేవుడు అప్పట్నుంచే అలాంటి వారి మీద Negative కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయనకు భవిష్యత్తు తెలుసు మరి అలాంటి వారిని పుట్టించడము ఎందుకు అనే ప్రశ్న అడిగారు. పుట్టించడము ఎందుకంటే First of all, దేవుడు ఖచ్చితంగా ఎవరు రక్షణ పొందుతారో వారు మాత్రమే పుట్టాలి అని అంటే, మనుషులు పుట్టడంతో పాతాళలోకంలో, ఆత్మల ఖార్ఖనాలో ఇంకొక శక్తి యొక్క ప్రమేయం కూడా ఉంది అనే విషయన్ని నేను “విశ్వచరిత్ర” అనే గ్రంథంలో వ్రాసాను. గనుక ఈ ప్రశ్నలన్నింటికి ఒక గ్రంథంలో చెప్పిన ప్రత్యక్షత, ఇంకో గ్రంథం, ఇలా గొలుసులాగా ప్రత్యక్షతలు వచ్చి ప్రశ్నేమిగులకుండా అయిపోతుంది. నా పుస్తకాలన్ని చదవాలి గనుక దేవుడు ఎవరయితే రక్షణ పొందరని తెలుసో వారిని కూడా పుట్టనిచ్చాడు.రక్షణ పొందరు అని తెలిసిన వాళ్లను కూడా పుట్టడానికి అవకాశం ఇచ్చాడు కానీ దేవుడే పుట్టించలేదు.
ఆత్మల ఖార్ఖానా అనే ఒక అంధకార రాజ్యానికి చెందిన రాజ్యాధిపతికి (సాతానుకు) కూడా కొంత భాగస్వామ్యం ఉంది. వానియొక్క ఉద్దేశ్యం ఏమిటంటే దేవుడు పుట్టించాలనుకునే కొన్ని కోట్ల మందే కాకుండా, నేను ఇంకా అనేకరెట్లు ఎక్కువ మందిని పుట్టేలాగా చేస్తాను, చేసినప్పుడు దేవుడు ఇంతమందిని నరకానికి పంపలేదు గనుక తన రక్షణ ప్రణాళిక కూడా మార్చుకోవలసి వస్తుంది. అనేది దుష్టుని యొక్క తెలివి తక్కువ పని అది. కానీ వాని పప్పులుడకవు. దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ పొందక పోయినా సరే వాళ్లను కొంతమందిని సాతాను పుట్టేటట్లు చేస్తున్నాడు గనుక ఉగ్రతా పాత్రలు అనే ఘటములుగా దేవుడు వాడుకుంటాడు. ఉగ్రతా పాత్రలను దేవుడు పుట్టించలేదు. వాళ్లు దేవుని సంకల్పానికి బయట పుట్టారు గనుక వాళ్లను కూడా ఒక ప్రయోజనానికి వాడుకుంటాడు అనే సంగతిని నేను “విశ్వప్రణాళిక”లో, “విశ్వచరిత్ర”లో, “మహిమ ప్రపంచం” అనే గ్రంథాలలో నేను వ్రాసాను.