(అపొ. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఈ వచనం మత్తయి, మార్కు, లూకా సువార్తలలో, మూడు సువార్తలలో ఉంది. ఈ రూపాంతరం సంభవాన్ని ముందున్న వచనాలను ముగ్గురు సువార్తికులు కూడా అవే రాశారు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములు, రమారమి 6 దినములు అని వ్రాయబడి ఉంది. గనుక ఆ మాటలకు నెరవేర్పే ఈ రూపాంతర కొండ మీది సంఘటన అన్నమాట. దేవుని రాజ్యము బలముతో వచ్చినప్పుడు ఉండే సన్నివేశాన్ని రూపాంతర కొండ మీద వాళ్లు చూశారు. దేవుని రాజ్యం బలముతో రావడం రెండవ రాకడలో జరిగినప్పుడు ఎన్ని రకాల మనుష్యులు, ఎన్ని వర్గాల మనుష్యులు ఉంటారో అన్ని రకాలు అక్కడ కనబడుతున్నాయి. యేసు ప్రభువు రెండవ రాకడలో జరిగే సంభవాలలో మొట్టమొదటగా యేసు ప్రభువు మహిమలో ప్రకాశిస్తూ ఉంటారు. రూపాంతర కొండ మీద యేసు ప్రభువు మధ్యాహ్నకాల సూర్యుని లాగా ప్రకాశిస్తూ ఉంటాడు.
రెండవది : మరణించి తిరిగి లేచిన భక్తులు కొందరుంటారు. జనులందరూ చూస్తారు. దానికి ప్రతినిధిగా మరణించి లేచిన పునరుత్థాన భక్తులను ప్రతినిధిగా మోషే ఉన్నాడు. రూపాంతర కొండమీద
మూడవది: మరణము చూడకుండానే ఎత్తబడే భక్తులు కొందరు యేసుప్రభువు రెండవరాకడలో ఉంటారు. వాళ్లకు ప్రతినిధిగా రూపాంతర కొండమీద ఏలీయా భక్తుడున్నాడు. ఆయన మరణము రుచిచూడకుండా అగ్నిరథం మీద కొనిపోబడ్డాడు. యేసుప్రభువు రెండవ రాకడలో మహిమలో యేసుప్రభువు వారు ఉంటారు. మోషే లాగా చనిపోయి తిరిగి లేచిన పునరుత్థాన భక్తులు ఉంటారు, ఏలియాలాగా మరణము రుచి చూడకుండా ఎత్తబడే భక్తులు ఉంటారు. వీళ్లుగాక కొండ దిగువన మారుమనస్సు పొందకుండ ఉన్న ఇశ్రాయేలు జనాంగం ఉండనే ఉన్నది. అంటే రెండవ రాకడ డ్రామాలో ఉన్న పాత్రలన్ని రూపాంతర కొండమీద ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నిలిచి యున్న వారిలో కొందరు, మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరను మాటలకు అర్థం ఇది. ఆ మాటలు యొక్క నెరవేర్పే (Fulfillment) ఇది.