(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: 1. నిశ్చయముగా ఎస్తేరు గ్రంథంలో ఉన్న India, మన భారతదేశమే.
2. దీని గురించి కూడా నేను “సింహనాదం” అనే గ్రంథంలో, కొన్ని “మాస పత్రికలలో” వ్రాసాను. కొన్ని Spoken message లలో కూడా చెప్పాను. అయితే మళ్ళీ చెబుతున్నాను. స్త్రీలు పురుషుల కంటే తక్కువ వారనిగానీ, తెలివితక్కువ వారని గానీ, అసమర్థులని గానీ, మగవారే సమర్థులని, స్త్రీలు పనికి మాలిన వారని గాని ఏమీ లేదు. Bible లోని దేవునికి ఆ ఉద్దేశ్యం లేదు, పౌలుకు ఆ ఉద్దేశ్యం లేదు. పౌలు భక్తుడు స్త్రీని చాలా గౌరవించాడు. రక్షకుడే, సృష్టికర్తే యేసుప్రభువుగా పుట్టి, ఒక తల్లి గర్భంలో పెరిగి, పుట్టి, ఆమె ఒడిలో పెరిగి, ఆమె పాలు త్రాగి, పెరిగి, ఆయన మరణ సమయంలో కూడా అమ్మ అని పిలిచి, తన బాధ్యతను నెరవేర్చుకున్న పరిస్థితి. స్త్రీలను రెండవ క్లాసు (Second Class) పౌరులుగా చూడొద్దు. స్త్రీలకు కొంతమందికి మగవారి కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నవి. గనుక విషయం అది కానేకాదు. కానీ విషయం ఏంటంటే ఒక సాదృశ్య రూపకంగా దేవుడు ఒక వ్యవస్థ (System)ను ఏర్పాటుచేశాడు. ఆధ్యాత్మిక సత్యాలకు భౌతిక ప్రపంచంలో ఒక పోలిక, ఒక నమూనా, ఒక Miniature Drama లాగా చేశాడాయన.
తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది మన ఊళ్లలో చిన్న చిన్న తాజమహల్ బొమ్మలను అమ్ముతారు. Charminar హైద్రాబాద్లో ఉంది. మన ఊళ్లలో చిన్న చిన్న Charminar బొమ్మలను అమ్ముతారు. అలాగే ఈ విశ్వంలోనే ఒక భర్త ఉన్నాడు ఆయన ప్రభువైన యేసు. భక్త సమాజం అంతా ఆయన యొక్క భార్య. అంటే యేసు ముందు భక్త సమాజం ఏవిధంగా లోబడుతుందో దానికి సూచనగా స్త్రీలు మౌనంగా, విధేయతతో ఉండాలి అని అన్నాడు. అలాగే క్రీస్తు ఏవిధంగా తన సంఘమును ప్రేమిస్తాడో ప్రతి పురుషుడు తన సొంత భార్యను ఆవిధంగా ప్రేమించాలి అన్నాడు. గనుక ఈ పోలికను బట్టి ఆడవాళ్లందరూ సంఘానికి పోలిక. మగవాళ్లు విశ్వానికే భర్త అయినటువంటి యేసునాధుని పోలిక. పురుషుడు క్రీస్తు యొక్క పోలిక, స్త్రీ సంఘము యొక్క పోలిక కాబట్టి క్రింద కూర్చున్న వారిలో పురుషులు, స్త్రీలు ఉన్నారనుకొండి. ఒక పురుషుడు నిలబడి పరిపాలన చేస్తున్నాడు. పరిచర్య చేస్తూన్నాడనుకొండి, వాక్యము చెబుతున్నాడు, ప్రభురాత్రి భోజనము ఇస్తున్నాడు, బాప్తిస్మాలు ఇస్తున్నాడు పరిచర్య ధర్మం పురుషుడు జరిగిస్తే, క్రింద స్త్రీలు ఉన్నారు అప్పుడు క్రీస్తు యొక్క ప్రతిబింబం నిలబడింది, సంఘం యొక్క ప్రతిబింబాలు క్రింద కూర్చున్నారు. ఇందులో ఇబ్బంది లేదు.
కానీ దానికి వ్యతిరేకంగా ఆలోచిద్దాం పురుషులందరూ క్రింద కూర్చున్నారు. ఒక స్త్రీ పరిపాలన చేస్తుంటే అప్పుడు ఎలా ఉంటుందంటే క్రీస్తు యొక్క ప్రతిబింబాలన్ని క్రింద కూర్చున్నాయి. క్రీస్తు మీద సంఘం పరిపాలన చేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ పోలిక తిరగబడింది. అందుచేత క్రీస్తు యొక్క ప్రతిబింబాల మీద సంఘం యొక్క ప్రతిబింబం పరిపాలన చేయకూడదు. అందుచేత స్త్రీకి సంఘ కాపరత్వం లేదు. తక్కువ జాతి, తక్కువ స్థాయి, తక్కువ తెలివి ఉంది అనికాదు. కానీ సృష్టిలో ఆమె సంఘానికి పోలిక గనుక సంఘం వలె వినయముగా విధేయతతో ఉంటే ఓహో భక్త సమాజం క్రీస్తుకు ఈ విధంగా ఉంటుందని అనుకుంటారు. ఆ పోలిక కొరకు మాత్రమే, అయితే కాపరత్వ బాధ్యతలు మాత్రమే ఇయ్యబడలేదు గానీ బైబిలులో ప్రవచించిన స్త్రీలు ఉన్నారు. దెబోరా ఒక ప్రవక్తి. క్రొత్త నిబంధనలో కూడా యెరుషలేములోని మేడగది దగ్గర పరిశుద్ధాత్మ తొలకరి వర్షం కుమ్మరింపబడ్డప్పుడు స్త్రీలు కూడా ఉన్నారు. వారు పరిశుద్ధాత్మను పొంది అన్యాభాషలు మాట్లాడారు. పేతురు యోహను, యాకోబు యేసు ప్రభువు శిష్యులతో ఆ 120 మందిలో స్త్రీలు కూడా ఉన్నారు. కృపావరములు ఇవ్వడంలో దేవుడు స్త్రీ, పురుష బేధం చూపించలేదు. కృపావరాలలో ఒకటి ప్రవచన వరం కూడా ఉన్నది. కృపా వరాలు అందరికి సమానం. అందులో ప్రవచన వరం కూడా పురుషులకు, స్త్రీలకు కూడా ఇచ్చాడు. మగవాళ్లు ప్రవక్తలు ఉన్నారు. స్త్రీలు ప్రవక్తిలు ఉన్నారు. అలాంటప్పుడు స్త్రీ మౌనంగా ఎలా ఉంటుంది. ప్రవచించుట అంటేనే నోరు తెరచి మాట్లాడడం, వాక్యం ప్రకటించడం. అందుకే స్త్రీలు ఉపదేశం చేయొద్దు అంటే అధికారం చేయొద్దన్న మాట. అంతేగానీ సువార్త చెప్పొద్దని కాదు. కాపరిగా సంఘపరిపాలన చేస్తూ, పురుషుని మీద అధికారం చేస్తూ మాట్లాడకూడదు. మామూలుగా తమకు బయలుపరచబడిన వాక్కును స్త్రీలు ప్రకటించవచ్చు. ఏం ఇబ్బంది లేదు. స్త్రీలు ఎంత సువార్తను ప్రకటించినా, ఎంత వాక్యం బోధించినా వాళ్ల ద్వారా వచ్చే ఆత్మలన్ని సంఘంలో చేర్చబడాలి. వాళ్లందరికి క్రీస్తు ప్రతిబింబం అయినటువంటి మగవాడు, పురుషుడు, సంఘకాపరి వారికి బాప్తిస్మాలు ఇస్తాడు. ప్రభురాత్రి భోజనాలు ఇస్తాడు. స్త్రీలకు ఒక విశిష్టత ఉంది. వారు సువార్త చెప్పొచ్చు. కాపరి అనుమతితో సంఘంలో ఉపదేశం కూడా చేయొచ్చు. బలమైన ప్రసంగం చేయొచ్చు. ఇది క్రమం. ఇది దేవుని చిత్తం కూడా.
- ప్రవక్తలు – ప్రవక్తలు: స్కూలుకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను ముద్రించి ఇస్తుంది. కానీ బోధించే ఉపాధ్యాయులు లేకపోతే ఆ గ్రంథాలలోని విషయం, సారాంశం విధ్యార్థులకు చేరదు. అదే విధంగా
ప్రవక్తలు దేవుడు సంఘానికి ఇచ్చిన గ్రంథం బైబిలును ఉపదేశించే, బోధించే ప్రవక్తలు లేకపోతే బైబిలు సారాంశం విశ్వాసికి చేరదు, విశ్వాసి దేవుని రూపంలోనికి మార్చబడడు. కాబట్టి ప్రవక్తలు, అపోస్తులులు బోధకులు, ఉపదేశకులు, కాపరులు, సువార్తికులు సంఘానికి ఇవ్వబడ్డారు. - మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట, కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానాభాషలు మాటలాడువారినిగాను నియమించెను. (దేవుడే నియమించెను).
- ప్రవక్తలు మూడు రకాలు. మొదటి రకం ప్రవక్తలు నోటి చేత ప్రవచిస్తారు. వారు గతంలో జరిగినది, ప్రస్తుతం (వర్తమానం) జరుగుచున్నవి, భవిష్యత్తులో జరగబోయే సంగతులను నోటి ద్వారా (దేవుని మాట) ప్రవచిస్తుంటారు. రెండవరకం ప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి బైబిల్ గ్రంథాన్ని వ్రాసారు 2పేతురు
1:20 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనము లో ఏ “ప్రవచనము” పుట్టదని…. మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మూడవరకం ప్రవక్తలు సమాజాన్ని నడిపిస్తారు. గలిబిలి నుండి, తడబాటునుండి, అసత్యం నుండి, స్పష్టత వైపునకు, సత్యం వైపునకు. ఉదాహారణకు ఏలియా, బాప్తిస్మమిచ్చు యోహాను వీరు గతాన్ని గూర్చి గానీ, ప్రస్తుతమును గూర్చిగానీ, భవిష్యత్తును గూర్చిగానీ నోటిచేత ప్రవచించలేదు. బైబిల్ గ్రంథం రాయడంలో కూడా లేరు. కానీ వీరు దేవుని సమాజాన్ని, దేవుని ప్రజలను తడబాటు నుండి స్పష్టత వైపు, అసత్యం నుండి సత్యం వైపు, పాపముల నుండి నీతి వైపు, నడిపించి సమాజాన్ని ప్రభావితం చేసారు. వీళ్లు మూడవరకం ప్రవక్తలు.