(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: సకల జనులు తెలుసుకోవాలి. ఈ విషయం నేను చెబుతున్నాను. మరణానంతరం ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అనే విషయం క్రైస్తవ మతం ఒకటి చెబుతుంది. ఇస్లాం ఒకటి చెబుతుంది. హైందవం ఒకటి చెబుతుంది. క్రైస్తవ ధర్మంలో ఉన్న వాళ్ళు మనం ఏమి నమ్ముతున్నామంటే, దేవుడు కనికరించి ప్రతి వ్యక్తిని క్షమించడానికి, ఆయన పరలోకానికి చేర్చడానికి దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు. దేవుడే నరావతారం ఎత్తి యేసుక్రీస్తుగా సిలువ మీద బలియై, ఆయన మరణించి, సమాధిలో పెట్టుబడి, మూడవ దినాన తిరిగి లేచాడు. యేసుప్రభువు వారు నా పాపముల కోసం మరణించి తిరిగిలేచాడు. ఈ సత్యంను ఎవరైతతే నమ్మి, నీళ్ళలో బాప్తిస్మం పొందుతారో వారు రక్షణ పొందుతారు. అలా నమ్మి బాప్తిస్మం పొందని వారికి రక్షణ కలుగదు. ఇది బైబిల్ చెబుతున్న సత్యం. అది నమ్మి రక్షణలో ఆనందిస్తున్న వాళ్ళు మనం ఉన్నాం, అలా కోట్లాది మంది ఉన్నారు. ఛత్రపతి శివాజి గారు, అంబేద్కర్ గారు నరకానికి వెళ్ళారా? పరలోకానికి వెళ్ళారా? అనే మీమాంస మనకు అవసరం లేదు. వాళ్ళ ఎక్కడికి వెళ్లారనే సంగతి కంటే, మోక్షసాధన అనే టాపిక్ ప్రక్కన పెట్టి బ్రతికి ఉన్నప్పుడు, మానవులు ఈ లోకంలో ఉన్నప్పుడు, అంటే పరలోకం, నరకం, పాతాళం కాదు. దృశ్యమైన ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఏ విలువల కోసం బ్రతకాలి, ఏ సిద్ధాంతం కోసం బ్రతకాలి. దేని కోసం బ్రతికితే సమాజం బాగుంటుంది. అనే విషయంలో వాళ్ళను ఆదర్శంగా తీసుకున్నాం. అంతేకాని అంబేద్కర్ గారు నన్ను నమ్మండి అని చెప్పలేదు, నేను మోక్షం ఇస్తానని చెప్పలేదు. అంబేద్కర్ గారికి వ్యక్తిగతంగా బౌద్దమతం ఉన్నది. ఆ విశ్వాసంలో ఆయన ఉన్నారు. తనవు చాలించారు. అయతే తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళారు అనేది మనం మాట్లాడుకోవలసిన విషయం కాదది. ఆయన కూడా సువార్త విన్నారు. ఆయనకు తెలుసు, ఆయన చదువుకున్నది కూడా క్రైస్తవ దేశాలలో. ఆయన యేసుప్రభువును నమ్ముకున్నాడా? నమ్ముకోలేడా? అనేది ఆయన వ్యక్తిగత విషయం. లేకపోతే మరణపడక మీద ఆయన మనసులో యేసు ప్రభువుని ప్రార్ధన చేసి ఉండే అవకాశం కూడా ఉన్నది. సిలువ మీది దొంగలాగా ఆయన ఒకవేళ ఆఖరి క్షణాల్లో ప్రభువు తట్టు చూచి రక్షణ పొంది ఉండొచ్చు. అది మన సబ్జెక్టు కాదు. ఆయన ఎక్కడికి వెళ్లాడని ఆలోచించడం కాదు. అసలు అంబేద్కర్ గారి సిద్దాంతం మనకెందుకు అవసరం అంటే ఈ లోకంలోనే మనువాదులు సృష్టించిన నరకం నుండి, దళితులు, యస్.సి, యస్.టి., బి.సి., మైనారిటీలు అణచివేత అనే నరకం నుండి రక్షింపబడడానికి మనకు అంబేద్కరిజం కావాలి. చనిపోయిన తరువాత ఉండే నరకం గురించి తెలియజేసి, నరకం నుండి తప్పించడానికి యేసురక్తం అవసరం. ఈ భూమి మీద ఉండే మనువాద నరకం నుండి తప్పించుకోవడానికి అంబేద్కరిజం అవసరం అని మనం స్పష్టీకరించాం.
అంబేద్కర్ గారు, ఛత్రపతి శివాజి గారు ఎక్కడికి వెళ్ళారు అనేది ముఖ్యమా? లేకపోతే యేసు ప్రభువు వారు రక్తం చిందించడం వలన మనకు రక్షణ ఏర్పాటు చేసాడు అనేది వేదములలోను, బైబిల్లో లోను, సకల శాస్త్రాలలోను చెప్పబడిన సత్యం. అవునా? కాదా? అనే విషయాన్ని పరిశోధన చేయడం ముఖ్యమా? అనే విషయాన్ని మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న గారిని అడగాలి. ఎవరైతే తర్కిస్తున్నారో వారిని మనం అడగాల్సింది ఏందంటే రంజిత్ ఓఫీర్ గారు చెప్తున్నారు, ఫ్రాన్సిస్ గారు చెప్పారు, పరవస్తు సూర్యనారాయణ గారు చెప్పారు, గుండాబత్తిని దేవదానం గారు చెప్పారు. అనేక మంది పెద్దలు చెప్పిందేమిటంటే రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగడం అసాధ్యం, అసంభవం అని వేదములలోను ఉన్నది, బైబిల్లో ఉన్నది. చరిత్రలో యేసులో నేరవేరింది అనే పాయింట్ మీరు నమ్ముతున్నారా? లేదా? మీకు నమ్మకం కలిగితే నమ్మండి లేదంటే వదిలేయండి. ఎవరెక్కడికి వెళ్ళారనేది దేవుని చిత్తంలో ఉన్నది. అది మనం చర్చించేది కాదు. ఎవరైనా అంతకుముందు ఆరోగ్యవంతులుగా, సజీవులుగా భూమి మీద సంచరించి ఉన్నప్పుడు, మారుమనస్సు పొంది బాప్తిస్మం పొందవచ్చు. లేదా మరణ పడక మీదనే ఆఖరి గడియలో దేవుడు కార్యం చేసి, యేసయ్య వైపు చూసి తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్ను మూసి పరదైసులోకి వెళ్ళవచ్చు. అది మనకు సంబంధించిన విషయం కాదు.
కానీ, అసలు ఇప్పుడు సువార్త చెప్తున్నాము కదా. అది ఆయనకు నమ్మదగినదిగా కనబడుతుందా? లేదా? శివాజీ గారు, అంబేద్కర్ గారు మనకు అవసరం లేదు. సువార్తను గూర్చి మాట్లాడేటప్పుడు వేదములో వ్రాయబడిన సంగతి, బైబిల్లో వ్రాయబడిన సంగతి, యేసు చరిత్రలో నేరవేర్చాడు అనేది వారికి నమ్మదగినదిగా కనబడుతుందా? లేదా? అనేది పాయింట్ నమ్మదగినదిగా కనబడితే మారమనస్సు ద్వారా బాప్తిస్మం పొంది, రక్షణ పొందమని చెప్పండి. ఒకవేళ నమ్మదగిందిగా అనిపించకపోతే ఆ పాయింట్ వదిలేయమని చెప్పండి. కానీ ఈ భూమి మీద అయితే Ambedkarism మనకు అవసరం.