66. ప్రశ్న: మీరు సేవా ప్రారంభంలో కొన్ని లక్షల సువార్త కరపత్రాలు పంచారని విన్నాము. ఎలా పంచేవారు? కనబడిన వారందరికా? లేదా కొన్ని ఊర్లు select చేసుకునేవారా? ఎలా ఉండేది? మీకు ఆ కరపత్రాలు ఎక్కడినుండి వచ్చేవి?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు: ఎలా చేసాం? అంటే ఒక గ్రామ పంచాయితీ ఆఫీసుకి వెళ్లి ఆ పంచాయితీ సమితికింద ఉన్న గ్రామాల Map తీసుకునేవారం. ఆ Map మీద చేతులుంచి ఇన్ని గ్రామాలలో సువార్త నింపాలి ప్రభువా! మాకు ఆత్మాభిషేకం దయచేయి అని ప్రార్థన చేసి తర్వాత ఏ గ్రామంలో ఎంత జనాభా ఉన్నదో దాని statistics తీసుకునేవారము. చర్చి ఉందా? లేదా సువార్తకు వ్యతిరేకత ఉందా? అనుకూలత ఉందా? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒకొక్క గ్రామాన్ని Cover చేస్తూ Map లో ఆ గ్రామాన్ని tick చేసేవాళ్లం. అలాగే ఎంత జనాభా ఉంది? వాళ్లకు ఎన్ని కరపత్రాలు కావాలి? ప్రతీ ఇంటికి కరపత్రం అందవలిసిందని ఇంటింటికి వెళ్లేవాళ్లం మళ్లీ Market places లో కూడా నిలబడి పంచేవాళ్లం. అర్థరాత్రి దాకా ప్రార్థనలో, discussions లో ఉండేవారం. ఉదయం 4 గంటలకు లేసి మళ్లీ పరిగెత్తాలి. ఈ బాధలు పడలేక కొంత మంది మధ్యలో మానేసారు. Bible society కి వెళ్లి కరపత్రాలు అడిగాము. ఆ కరపత్రాలలో కథలు ఉన్నాయి తప్ప అందులో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు, మరి ఎవరివలనను రక్షణ కలుగదు అని direct సువార్త మాత్రం ఆ సువార్త కరపత్రాలు లేవు. వారిని అడిగితే వారు bible society కి కొన్ని పరిమితులు ఉన్నాయి. మనం బోధ చేయకూడదు. బైబిల్లోనుండి సేకరింపబడ్డ భాగాలు print చేసుకోవాలి తప్ప మతబోధ చేయకూడదు. గనుక మేము ఇలా చేస్తున్నాం అన్నారు. ఆ తర్వాత నేను స్వయానా “శుభవార్త” అని ఒక కరపత్రం రాసాను. అది నా లైఫ్ లో నేను రాసిన మొట్టమొదటి కరపత్రం. అప్పుడు ఈ.సి.ఐ.ఎల్.లో ఉద్యోగం చేసేవాడిని. నా డబ్బులతో print చేయించాను. బస్సుల వెనుక అంటించేవాడిని. తర్వాత హెబ్రోను వాళ్లు Print చేసిన కరపత్రాలలో సువార్త correct గా ఉంది అనిపించింది. నాకు చాలా careful గా ఎన్నిక చేసుకొని యేసు ప్రభు యజ్ఞం తప్ప ఇంకొక రక్షణ మార్గం లేదు. యేసును నమ్మకపోతే నరకమే గ్యారంటీ. అనే సందేశం direct గా ఏ కరపత్రమైతే అందిస్తుందో వాటినే మేము పంచేవాళ్లం. కొంతమంది కొన్ని చోట్ల అమ్మేవారు, కొంత మంది ఫ్రీగా ఇచ్చేవారు.