69. ప్రశ్న : ఒక సందర్భంలో మీరు సువార్త ప్రకటిస్తుంటే ఆ గ్రామములోని పెద్దలు వచ్చి ఎప్పుడూ ఇలాంటి సువార్త వినలేదు అంటూ discussion జరిగిందని వినడం జరిగింది. కొంచెం clear గా చెప్పగలరు?

(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: అలా పలుమార్లు జరిగింది. మొట్టమొదట నకిరేకల్ లో మా టీంతో సువార్త ప్రకటనకు వెళ్లినప్పుడు నన్ను ఒకచోట వాక్యం చెప్పమన్నారు. ఆ వీధి అంతా హిందూ దేవాలయాలే నేను ఏమి చెప్తానో నా concept ఎవరికీ తెలీదు. అప్పుడు నేను “జీవాహారమును నేనే, నన్ను తినువాడు నా మూలముగా జీవించును” అని యేసు ప్రభు వారు చెప్పారని దానిమీద వాక్యం చెప్పాను. జీవాహారం అని ఎందుకు అన్నాడంటే అన్నము ఎంత అవసరమో నేను మీకు అంత అవసరం. అన్నం తినడం ఎంత సులభమో. నన్ను నమ్మడం కూడా అంతే సులభం. గనుక యేసుని నమ్మడం మనకు అవసరం, సులభం ఆయన తన్నుతాను అన్నంతో పోల్చుకున్నాడు. దీన్నే మనదేశంలో పెద్దలు, “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నమే దేవుడా? అన్నమే సూర్యున్ని, నక్షత్రాలని చేసిందా? అది సాధ్యం కాదు గదా. అన్నిటినీ చేసినవాడు అన్నమును పోలియున్నాడు. ఆయన అందరికీ అవసరం. అందరికీ యేసు కావాలి, అని ఆ రోజు సువార్త చెప్పాను. ఇంటికి వెళ్లాక టీం members అందరూ నన్ను అవమానకరంగా మాట్లాడారు. ఏమని అంటే మనం simple గా సువార్త చెప్పాలి గానీ అన్నం అని వేదాలని చెప్పడం మనకెందుకు? మనకు తెలివితేటలు ఎక్కువైపోయాయి లెండి అని మాట్లాడుకున్నారు. దానికి నేను బాధపడ్డాను, ఏడ్చాను, ప్రార్థన చేసి ప్రభువా నేను నిన్నే కదా చూపించాను! ఎందుకు వీళ్లు నన్ను ఇలా బాధపెడుతున్నారు? అని ప్రార్థించాను. ఆ next day morning ఎవరో తలుపు తట్టారు చూస్తే చాలా మంది హిందూ పండితులు, పంతుల్లు కొందరు మామూలు వాళ్లు కూడా ఉన్నారు. ఎవరు కావాలండీ అని అడిగాను. నిన్న ఎవరో ఒక కుర్రవాడు బోధ చేసాడు అతన్ని చూడడానికి వచ్చాం అన్నారు. నేనే అన్నాను అప్పుడు వాళ్లు. బాబు, మా జీవితంలో మేము ఎన్నడు వినని బోధ చేసావు, నీవు మాట్లాడేదాక యేసు అంటే మాల మాదిగల దేవుడు అని అనుకున్నాము. కానీ మన వేదాలలో ఉన్న పరబ్రహ్మ స్వరూపం యేసేనని నువ్వు చెప్పేదాకా మాకు తెలీదు. ఇప్పుడు మాకు అర్థమయ్యింది. మేం ఇప్పుడే బాప్తిస్మం పొందుతాం అని చెప్పలేం గాని ఇప్పటినుండి బైబిల్ చదువుతాం. చాలా బాగా చెప్పావు మళ్లీ మీరు ఈ ఊర్లో ఉంటారో లేదో, చూద్దాం అని వచ్చాము అన్నారు. మా team members ఓఫీర్ తప్పు మాట్లాడాడు, ఆయన కారణంగా గొడవైంది అని దూషిద్దాం అనుకుంటే అతడు చెప్పిందే మాకు correct గా అర్థమయ్యింది అని ఈ పండితులు చెప్తున్నారు, అని shock అయ్యారు. అయితే నేను ఎక్కడైనా సువార్త చెప్పేటప్పుడు నామకార్థ క్రైస్తవులకు చెబుతున్నానా? నాస్థికులకు చెబుతున్నానా? వాళ్ల mind లోకి వెళ్లిపోయి వాళ్లకున్న ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పాలనే Apologetic gospel method నాది. అట్లా దేవుడు నాకు భారం ఇచ్చాడు. అప్పటినుండే నన్ను ద్వేషిస్తున్నారు. ఎందుకు మీకు వ్యతిరేకత అంటే హిందూ సోదరులు మెచ్చుకున్నప్పుడు క్రైస్తవులెందుకు వద్దన్నారు? ఇదంతా నిత్య చీకటి చేస్తున్న వ్యవహారం గనుక ఇటువంటిది చాలా సార్లు జరిగింది.