(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: మొదట విజయనగర్ కాలనీ Bus stand సెంటర్లో లయోలా స్కూల్ లో every second Saturday కి ముందు వచ్చే Friday evening, second-Saturday మూడు కూటాలు. ఆదివారం ఆరాధన అలా 10 ఏండ్ల వరకు అక్కడ జరిగించాను. ప్రసాద్ రావు గారు వాక్యాన్ని ప్రేమించి, నన్ను కూడా ప్రేమించి ఎంతో ప్రోత్సహించారు. అయితే అప్పుడు అక్కడ 9-10 వరకు స్తుతి ఆరాధన జరిగింది. 10గంటలకు నాకు టైం ఇస్తే అప్పుడు start చేసి సాయంత్రం 4 గంటలకు ముగించేవాడిని, 6 గంటలు ఒకటే subject అది ఒక sensation అసలు. ఈయన 6 గంటలు ఏమి చెప్తున్నాడు? వాళ్లు ఏమి వింటున్నారు తర్వాత ప్రజలను అంతగా భాదపెట్టకూడదు. అని నేనే మానవతా ధోరణితో ఆలోచించి కుదించి, ఎన్నో ఏండ్ల వరకు 4 గంటల ప్రసంగాలు చేసాను. ఆ తర్వాత గంట ప్రసంగాలు, maturity వచ్చే కొద్ది అంతే subject concentratedగా 6 గంటలు ఏది చెప్పగలమో అదే 6 నిమిషాలలో కూడా చెప్పగలగాలి అనే concept వచ్చింది. తర్వాత V6 లో వాళ్లు chance ఇచ్చారు. మీరు పదినిమిషాలే మాట్లాడాలి అన్నారు. నా వల్లకాదు నేను 6గంటలు మాట్లాడే వాన్ని 10 నిమిషాలు అంటే ఎలా అన్నాను. వాళ్లు, మీరే మాట్లాడాలి అన్నారు అప్పుడు అదొక challenge గా తీసుకొన్ని కొన్ని సంవత్సరాలు V6 లో 10 నిమిషాలు 9,8 నిమిషాలు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల ఎందరో దీవించబడ్డారు. నేను గమనించిన ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే The shorter the message more powerful it is ఈ 8 – 12 నిమిషాల ప్రసంగాలు, అవి అద్భుతమైన శక్తివంతమైన messages గా నిలబడిపోయాయి. దానివల్ల రక్షణ పొందినవారు చాలా మంది ఉన్నారు. SO 6 గంటలు చెప్పాను. 8 నిమిషాలు కూడా చెప్పాను. గనుక I’m equally comfortable.