(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నకిరేకల్లో ప్రారంభించినప్పుడు అది మా తాత గారు కె.వి. జాకబ్ గారు ప్రారంభించిన సంఘం అది. అంటే మందిరం ఉంది సంఘం లేదు. So, నేను అక్కడికి వెళ్ళిన తరువాత మా మేన మామ గారి కుటుంబం ఇంకా ఓ ఇద్దరు, ముగ్గురు మొత్తం పదిమంది వరకు వచ్చేవారు. అలా ఒక 1-2 సంవత్సరాలు చేసిన తరువాత 40-50 మంది సంఘం అయ్యారు. ఆ తరువాత 1983లో దేవుడు నాతో మట్లాడి నువ్వు నకిరేకల్ నుండి హైదరాబాద్కు వెళ్ళిపోవాలి. అక్కడ నుండి అంతర్జాతీయంగా నిన్ను తీసుకెళ్తాను అని చెప్పినప్పుడు నేను కూకట్పల్లికి వచ్చాను. కూకట్పల్లిలో సంఘం ప్రారంభించినప్పుడు నాతో కలిపి నలుగురు తరువాత 10, 25, 50 ఇప్పుడు 500 మంది అలా వ్యాపించింది.