(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: బైబిల్ లో ఏ వచనానైనా అర్ధం చేసుకోవాలంటే దానికి ముందున్న వచనం దాని తర్వాత ఉన్న వచనం పూర్వాపరాలు కలిపి చదువుకుంటే దాని context మనకు 99% అర్థమైపోతుంది. 27వ వచనంలో “సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను, అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి యున్నది. 26లో ఒక సబ్జెక్ట్ మొదలు పెట్టాడు ఏమిటంటే, మరణముకంటే దుఃఖము కలిగించేది ఒకటి ఉన్నది. అదేమిటంటే, వలల వంటిదై ఉరులవంటి మనస్సు బంధకముల వంటి చేతులును కలిగిన స్త్రీ. ఈ భూమిమీద ఉన్న స్త్రీలందరూ ఒకేరకమైన వారు కారు. కొందరు భక్తిగలిగిన స్త్రీలు ఉన్నారు. కొంతమంది స్త్రీలు, వలల వంటి వారట. అంటే ఎటువంటి మగవాడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పక్షి చిక్కుకు పోయినట్టు చిక్కుకుపోతాడు. ఉరులవంటి చేతులు గలవారు అంటే ఇతరులను ఆకర్షించే శక్తి గలిగిన స్త్రీలు కొంతమంది ఉంటారు. కొంతమంది స్త్రీలు పవిత్రమైన దీపములాగా ఉంటారు. వాళ్ళను చూస్తే పాపము చేయడానికి అలవాటు పడ్డవాడైనా సరే, వాళ్ళను చూడగానే చేతులెత్తి మ్రొక్కాలి అనిపిస్తుంది. కొంది మంది పురుషులు ఎంత పరిశుద్ధంగా ఉండాలి అనుకున్నా ఉండనివ్వకుండా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మానసిక భావతరంగాలు వాటి ద్వారా పురుషులలో ఎక్కువ లైంగిక వాంఛ రెచ్చగొట్టే స్త్రీలు కొంతమంది ఉంటారు. అలాంటి వారు మరణం కంటే దుఃఖకరం అంట. అలాంటి వారి ఉరిలో పడేకంటే చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది. అని చెబుతూ 27లో ఆయా సంగతుల హేతువు ఏమిటి అనే పరిశోధించినప్పుడు ఈ సంగతి నాకు కనబడింది అంటాడు. 26లో ఎక్కువ పాపమును ప్రేరేపించే స్త్రీలు ఉన్నారు. అటువంటి స్త్రీ పురుషునికి ఎదురయ్యే అనుభవం చావుకంటే బాధకరమైనది అని చెబుతూ 27లో ఇలాంటి స్త్రీలు ఉన్నారు. అనేది నాకు ఎప్పుడు తెలిసిందంటే సంగతుల హేతువు ఏమిటి అని నేను తరచి పరిశోధించడానికి నేను పూనుకున్నప్పుడు. స్త్రీల మనస్తత్వాలన్ని ఒక రకంగా ఉండవు. అందరూ అమాయకులు కాదు. అందరు పవిత్రమైన మనస్సు కలిగిన వారు కాదు, అనే సంగతి నాకు అర్థమైంది అని ఆయన చెబుతాడు. ఆ తరువాత 27లో అయితే తరచి చూచినను నాకు కనబడునది ఒకటి యున్న అదేదనగా “వెయ్యిమంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను నేను చూడలేదు” అన్నాడు. ఈయన ఉంచుకున్న స్త్రీలే వెయ్యిమంది. ఈయన ఎవరి కొరకు చూస్తున్నాడు అంటే ఒక భయభక్తులు కలిగి పవిత్ర జీవితాన్ని సాధన చేయాలి అనే ఉద్దేశం కలిగిన మంచి మనుషుల కొరకు ఈయన ఎదురు చూస్తున్నాడు. నా అనుభవంతో నాకు ఇది దొరికింది. నేను కోరుకున్న ఉత్తమ లక్షణాలతో వెయ్యిమంది పురుషులలో ఒకడు కనబడ్డాడు. కాని అంతే సంఖ్య ఆడవాళ్ళు నా ప్రక్క ఉన్నారు. వాళ్లలో ఒకతెను కూడా నేను చూడలేదు అన్నాడు. ఇది ప్రసంగి సొంత అనుభవం, సాక్ష్యం గానీ అది దేవుని అభిప్రాయం అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ విధమైన పాప సంబంధమైన మనస్సు గలవారు పురుషులలో కూడా ఉంటారు. లింగ భావమును బట్టి పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అని పలానా వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పడానికి వీల్లేదు. మంచి చెడ్డ అనేది 50-50% ఇరు వర్గాలలో ఉంటుంది. అయితే నేను latest గా వ్రాసిన “ప్రమాణ వాక్యం” అనే గ్రంథంలో నేను ఈ “principle of interpretation” అనేది చెప్పాను. అదేమిటంటే బైబిల్లోని వాక్యమును సరిగ్గా విభాగించాలి. దేవుడు డైరెక్టుగా చెప్పిన ఆజ్ఞలు, కమాండ్మెంట్స్ అనేవి, మనిషి పలికిన దేవోక్తులుగా మనం తీసుకోకూడనివి వేరు. అలాంటివి కూడా బైబిల్లో ఉన్నాయి. యోబు గ్రంథంలో యోబు చెప్పిన ఒక మాట వీటన్నిటికి తార్కాణంగా మనం చెప్పుకోవచ్చు.
యోబు 19:6లో అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు, తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలిసికొనుడి అని అంటాడు. ఇలాంటి వాక్యాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. అదే బైబిల్లో దేవుడు అన్యాయం చేయడు అని ఎన్నో సార్లు ఉంది. దాని బట్టి మరి దేవుడు అన్యాయస్తుడు అని మనం నమ్మగలమా? నమ్మలేము. గనుక బైబిల్ లోని వచనాలను మనం categorise చేసి, వర్గీకరణ అనేది చేసి డైరెక్ట్ గా దేవుని వాక్కుగా ఏది ఎంచుకోవాలో, మనం మన అభిప్రాయం ఏ వచనం ప్రకారం స్థిరపరచుకోవాలో, ఏ వచనం ప్రకారం స్థిరపరచుకోకూడదో సరియైన వివేచన గలిగి బైబిల్లోని వచనాలను మనం ప్రామాణికంగా తీసుకోవాలి అని “ప్రమాణవాక్యం” అనే గ్రంథంలో చెప్పాను. గనుక ఈ వచనంలో ఆయనే ఒక కామాతురుడైయుండి ఆడవాళ్ళలో చాలామంది చెడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పడం. గనుక ఈయన పడిపోయి లేచిన స్థితిలో చెబుతున్నాడు. అలాగే ప్రసంగి గ్రంథము. కావ్య గ్రంథము గనుక అందులోనున్న విషయాలను కొంత అలంకార భాషతో కూడా మనం తీసుకోవాలి. స్త్రీలు అని కాకుండా భక్త సమాజములలో, భక్త సమాజములలో అందరూ దేవుడిని భర్తగా ఎంచుకుంటారు. గనుక అందులో కూడా నమ్మకమైన వారు చాలా తక్కువ అనే సంగతి, గనుక ఈ రకంగా spiritualize చేసి తీసుకోవాలి. తప్ప భూమ్మీద ఉన్న ఆడవాళ్ళలో వ్యభిచారులు ఎక్కువ ఉంటారు అంటే మన తల్లిని, చెల్లిని కూడా మనం అనుకున్నట్టే గనుక స్త్రీలను అలా వివక్షతో చూసే ప్రోత్సాహం బైబిల్ ఇవ్వదు. ఇదీ విషయం.