(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: Direct చెప్పాలి అంటే పనికొస్తుంది. “పరిశుద్ధ దేవుని గూర్చి జ్ఞానం”, “మహిమ ప్రపంచం॥ అనే గ్రంథాలలో కొంత చెబుతూ వచ్చాను. యోబు 38:4-7లో “నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి. దేవకుమారులందరును వచ్చి జయ ధ్వనులు చేసినప్పుడు నేను దాని మూలరాతిని వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి” అని యెహోవా దేవుడు యోబును అడుగుతున్నాడు. అంటే భూమికి పునాది వేయడం. అసలు ఇల్లు shape ఏ లేదు. భూమికి పునాది అంటే భూమి అనే నామరూపాలు కూడా లేదు. ఆ దశలో శంకుస్థాపన చేసినప్పుడు ఇక మునుముందు కట్టబడుతుంది అని సంతోషమే, ఆ సంతోషంలో దేవదూతలందరును, అంటే క్రింద ఫుట్నోట్లో దేవుని కుమారులు అందరును అని చెప్పాడు. దేవుడు కలుగును గాక అని పలికి ఎంతమంది కుమారులను సృష్టించాడో అందరూ వచ్చారు. వచ్చి జయధ్వనులు చేసారు. జయం కలిగినప్పుడు చేసేది జయధ్వని. జయము అనేది ఉన్నదంటే అంతకుముందు ఒక సమస్య ఉంది. ఒక సమస్య ఉంది. దానితో పోరాడి దానిలో నుండి విడుదల కలిగినప్పుడు జయధ్వనులు చేసారు. దేవ కుమారులందరూ జయధ్వనులు చేసారంటే అందరికి ఒక సమస్య ఉండింది. దానికి ఇప్పుడు పరిష్కారం కలుగుతుంది. యుగయుగాలుగా వాళ్ళు ఏ సమస్య ద్వారా బాధింపబడుతున్నారో ఆ సమస్యకు ఈ భూమి పునాది వేయడం ద్వారా పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అదే కీలకమైన విషయం. ఈ భూమి మీద రక్షకుడు పుట్టినప్పుడు ఈ దేవదూతలు రెండవసారి ఉత్సాహ గానాలు చేయడం చూస్తాము. లూకా 2వ అధ్యాయంలో. ఈ భూమిని కట్టడం మొదలు పెట్టినప్పుడు ఈ దేవకుమారులు జయధ్వనులు చేసారు. భూమ్మీద రక్షకుడు పుట్టినప్పుడు మళ్ళీ రెండవసారి సంతోషగానాలు చేసారు. అంటే రక్షకుడు పుట్టడం, యజ్ఞం కావడం కొరకు దేవుడు సిద్దపరచిన యజ్ఞ వేదిక, బలిపీఠము ఈ భూగ్రహం. అందుకే అంతకుముందు కోటానుకోట్ల గ్రహమండలాలు ఉన్నప్పటికి దాని విషయంలో జయధ్వనులు, ఉత్సాహం ఏమీ లేదు. ఏ గ్రహం పుట్టినా కలగని సంతోషం భూగ్రహం పుడితే కలిగింది. దేవకుమారులందరికీ సంతోషం కలిగింది. ఎందుకంటే ఇక్కడ మా సమస్యకు పరిష్కారం కలగబోతుంది. ఏమిటి ఆ సమస్య అంటే వీళ్ళు దేవకుమారులైయుండి కూడా దేవుణ్ణి ముఖాముఖి చూడలేని పరిస్థితి. 1తిమోతి 6:16లో దేవుడు సమీపించరాని తేజస్సులో ఉంటాడు. ‘సమీపించరాని తేజస్సు’ అని పాత బైబిల్ లో దురవగాహమైన తేజస్సు అని ఉండేది. దురవగాహమైన తేజస్సు అంటే మన ఊహలలో కూడా దరిదాపులోనికి పోలేనంత వెలుగు అని. అంత గొప్ప వెలుగులో ఆయన మాత్రమే వసించుచున్నాడు. అంటే, అక్కడ కెరూబులు, సెరాఫులు, మహాదూతలు ఎవరు లేరు. అది దేవుడు ఒంటరిగా నివసించే మహాతేజో కాంతి మండలము అంటే ఈ లోకంలో ఉండి మనం దేవున్ని చూడలేము అని ఎలా అనుకుంటున్నామో, పరలోకంలో ఉండి కూడా ఇంకా మనం దేవున్ని చూడలేదు అని వాళ్ళే బాధపడుతున్నారు. అసలు దేవుడు ఆయన సమీపించరానంత ఉన్నతుడు. గనుక వాళ్ళతో ఒక కాంటాక్ట్ ఏర్పరచుకోవడం కొరకు ఒక కొడుకును కన్నాడు. ఆయన అందులో నుంచి బయటికి వచ్చి తండ్రి చిత్తం వీళ్ళకు చెప్పి, వీళ్ళ యొక్క అవసరాలు తండ్రికి తెలియజేస్తూ, అలా మధ్యవర్తిగా ఆయన అనంతమైన నిత్యత్వం నుండి ఉన్నాడు. దేవకుమారులందరికి ఒక ప్రశ్న ఉంది. దేవున్ని మనం ఎందుకు చూడలేము? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేము? ఎందుకంటే దేవదూతలలో పాపము లేకపోయినా, లోపములుఉన్నవి. దేవునికి పాపాలు అన్నా లోపాలు అన్నా ఇష్టం లేదు. యోబు 4:18లో “ఆయన తన సేవకులను నమ్ముటలేదు. తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. లోపం అంటే పాపం కాదు. దేవదూతలు లోపరహితులైతే, లూసీఫర్ సైతాను కాడు. కొంతమంది దేవదూతలు దయ్యాలుగా మారారు. కాబట్టి లోపములైతే ఉన్నాయి. మనమెమో పాపాలను బట్టి వాళ్లేమో లోపాలనుబట్టి ఆయన దగ్గరకు వెళ్ళలేరు. ఇక ఎప్పటికీ మా పరిస్థితి ఇలాగే ఉంటుందా? అని దేవదూతలు దేవున్ని అడిగియుంటారు. అప్పుడు దేవుడు భవిష్యతులో పరిష్కారం అనేది ఉన్నది గనుక నా భవిష్యత్ ప్రణాళికను బట్టి మిమ్మల్ని బ్రతకనిస్తున్నా. మీ లోపములను క్షమించడానికి ఒక పరిశుద్ధమైన బలియజ్ఞం జరగబోతుంది. రక్తము మీ కొరకు కార్చబడుతుంది. మరణించుట, మరణించు అంటే ఏమిటి? రక్తం అంటే అర్ధం ఏమిటి ? మాకు రక్తం లేదుగా అని దేవదూతలు అంటారు. అప్పుడు దేవుడు-మీకు రక్తం లేదు, నేను మునుముందు సృష్టించబోతున్న మానవజాతికి రక్తం ఉంటుంది. వాళ్ళు శరీరానికి గాయం చేస్తే రక్తం స్రవించి చనిపోతారు అని చెప్పాడు. మానవజాతి ఎక్కడ ఉంది? అది ఏమిటి? దేవుడు-నేను మునుముందు సృష్టించబోతున్నాను. భూమి అనే గ్రహం మీద. వారు-ఆ భూగ్రహం ఎక్కడ ఉంది? దేవుడు-అది కూడా మునుముందు సృష్టించబోతున్నా అన్నాడు వారు-భూమి ఎప్పుడు చేస్తావు? మనుషులను ఎప్పుడు చేస్తావు తండ్రీ అని అడిగారు. దేవుడు-ఆ సమయం వచ్చినప్పుడు నేను ప్రకటిస్తాను అన్నాడు. తరువాత ఒక సమయం వచ్చినప్పుడు ఇంతకాలం మీరు ఎదురుచూసున్న బలిపశువుగా దేవకుమారుడు యజ్ఞం కావడం కొరకు నేను ప్లాన్ చేసిన యజ్ఞవేదిక అయిన గ్రహం నేను ఇప్పుడు నిర్మాణం ప్రారంభిస్తున్నాను అని దేవుడు ప్రకటించాడు. అందుకే మొత్తం దేవదూతలందరూ వచ్చి మన సమస్య పరిష్కారం కాబోతుంది. మనం కూడా తండ్రియైన దేవునితో సమాధాన పడబోతున్నాం అని అప్పుడు వారు జయ ధ్వనులు చేసారు. తరువాత ఏ బలిపశువు పుట్టడానికి భూమి తయారు చేయబడిందో, ఆయన పుట్టినప్పుడు మళ్ళీ పాటలు పాడారు. అదీ విషయం. డైరెక్టుగా చెప్పాలంటే ప్రయోజనం ఉందా? అంటే ప్రయోజనం ఉంది.