(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: తప్పిపోవడం అంటే ఏమిటి? అదే ఒక్క పెద్ద sensitive question. ఒక ఆరోగ్యవంతుడైన పురుషుడు ఉన్నాడు. అతని దేహములోని metabolism, అతనిలోని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పరిపక్వ దశకు ఎదిగినప్పుడు ఖచ్చితంగా అతనికి opposite sex మీద interest పుడుతుంది. పరిపూర్ణంగా అన్ని అవయవాలు ఎదిగిన ఒక స్త్రీ కి తోడు కావాలి. For all purposes తన మనోభావాలు అర్థం చేసుకొని moral support ఇవ్వడానికి, భౌతికమైన అవసరాలు తీర్చడానికి, నీకు తోడుగా నేను ఉన్నాను అని ధైర్యం చెప్పడానికి ఒక స్త్రీ అవసరం. అరోగ్యవంతుడైన పురుషుడు తప్పకుండా ఒక better half ను కావాలి అనుకుంటాడు. మరి యేసు ప్రభు కంటే healthy man ఎవడూ లేడు భూమ్మీద, ఎందుకంటే ఆయనలో పాపం లేదు. పాపం లేదు గనుక ఆయనలో రోగం లేదు. ఆ దశలో మనస్సు ఆరోగ్యవంతుడైన పురుషుడికి ఎటువంటి మనోభావాలు, అవసరము అనేది feel అవుతాడో, అది యేసు కూడా feel అయ్యాడు. హెబ్రీ 2:18లో “తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక” తాను శోధింపబడ్డాడు అంటున్నాడు. హెబ్రీ 4:15లో “మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాదు గానీ, సమస్త విషయములలోని మనవలెననే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇప్పుడు సమస్త విషయములు అంటే ఒక exception లేదు. మనం ఎన్ని విషయాలలో శోధింపబడుచున్నామో అన్ని విషయాలలోనూ యేసు శోధింపబడ్డాడు అని లేఖనం చెబుతుంది. అంటే మంచి భోజనం కావాలని గానీ, అధికారం కావాలని గానీ, అందరు నన్ను పొగడాలని గానీ, అలాగే నాకంటూ ఒక జీవిత భాగస్వామి ఉండాలి. అనే ఒక శారీరక అవసరత ఉన్నది అనే విషయంలో గానీ శోధింపబడ్డాడు అని బైబిల్ చెప్తుంది. గనుక మనం broad – minded గా విషయాన్ని అర్థం చేసుకోవాలి. తొందరపడి విమర్శించకూడదు. ఇక్కడ ఒక సుందరమైన ప్రత్యక్షత కలుగుతుంది. యేసు ప్రభు వారు శోధింపబడియు పాపము లేనివాడుగా ఉండెను, అంటే శోధింపబడుట అనేది పాపంలో పడిపోవుట కాదు. యేసు ప్రభువు శోధింపబడి కూడా పాపము లేనివాడుగా తీర్పుపొందితే, మనము కూడా శోధింపబడుతూ పాపం చేయలేదు అనే తీర్పు దేవుని ద్వారా పొందవచ్చు. శోధింపబడుట అంటే నువ్వు తప్పు చేయి అని శోధకుడైన సాతాను మనల్ని బలవంత పెట్టడం. శోధన అనేది వచ్చినప్పుడు మనం దాన్ని ఆమోదించి, చేద్దాం అనే తీర్మానానికి వచ్చి ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేద్దాం? ఏమి చేద్దాం? అని నేను ఈ పని చేసి తీరతాను. దాని కొరకు sketch గీసుకుంటూ అన్న దశలోనికి వెళ్ళిపోయి ఆ మానసిక స్థితిలో చాలా సేపు ఉన్నప్పుడు, క్రియగా మారక తప్పని పరిస్థితి ఏర్పడినంత సేపు, mind దాని మీద ఆలోచన చేసిన ఆ దశకు చేరుకుంటే, వీడు పాపము చేసినవాడుగా పరిగణించబడతాడు. ఆయన ఆ దశకు రాలేదు. మనలో కూడా చాలా మంది ఆ దశకు రాకుండా తప్పించుకుంటాం. మనం కూడా ఎవరిచేతనైనా కొద్ది సేపటికి శోధింపబడి, ఆ తరువాత వెంటనే దేవుని వాక్యం జ్ఞాపకం వచ్చి, నన్ను క్షమించు ప్రభువా! ఈ తలంపు తెచ్చిన సైతానుని యేసు నామంలో గద్దిస్తున్నాను, అని ప్రార్ధించి యేసు రక్తంలో కడగుకొని మన మనస్సు నిర్మలం చేసుకుంటే దేవుడు ఇదే లెక్క రాసుకుంటాడు. “వీడు శోధింపబడియు పాపము లేనివాడిగా ఉన్నాడు” అని. కాబట్టి ఆయన అన్ని శోధనలను పొందాడు Jesus is the healthiest young man ever lived after adam.